రీసెర్చ్‌ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.?

భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే కేవలం పిల్లలు, ఆర్థిక ఎదుగుదల, అన్యోన్యమైన కుటుంబం ఇవి మాత్రమే ఉంటే సరిపోదు. వారి మధ్య ఏకాంత సమయం, ఆ టైంలో ప్రేమ, శారీరక సంతృప్తి, సంతోషం ఇవి కూడా ముఖ్యమని రీసెర్చ్‌ చెబుతోంది. అన్ని సమపాళ్లలో ఉన్నట్లయితేనే దాంపత్య బంధానికి సరైన అందం తీసుకువస్తుంది.

Research says how many days a week a couple should be intimate for a happy married life

దాంపత్య బంధంలోకి అడుగుపెట్టాక ఆరంభంలో శృంగార జీవితం బాగానే ఉన్నా.. పిల్లలు, ఆర్థిక బాధ్యతలు, ఒత్తిడి పెరిగిన తర్వాత వారి మధ్య ఏకాంతం అనేది చాలా వరకు తగ్గిపోతుందనేది వాస్తవం. ఈ కారణంగా ఇద్దరి మధ్యా మనస్పర్థలు, కలహాలు, అభిప్రాయ భేదాలు చోటుచేసుకుంటాయి. అంతేకాకుండా వారిద్దరి మధ్య కుటుంబ వ్యవహారాలు తప్ప ఏకాంత విషయాలు మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. కానీ, ఎన్ని బాధ్యతలు, ఒత్తిళ్లు ఉన్నా దంపతుల మధ్య శృంగారం, ఏకాంతం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. దీంతో వారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు.

ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?

రీసెర్చ్‌ ప్రకారం దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే దంపతులు ఈ సలహాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారంలో కొంత సమయం, కొన్ని రోజులు తప్పనిసరిగా ఇద్దరి మధ్యా శృంగార జీవితం ఉండాలని చెబుతున్నారు. అలాంటి వారి జీవితాల్లో సంతోషం ఎక్కువగా ఉంటుంది. అవేంటో చూద్దాం. .

సంతోషకరమైన దాంపత్య జీవితం కోసం భార్యాభర్తలు వారానికి ఒక్కసారైనా శారీరకంగా కలవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాంటి వారి మధ్య ఆనందం, ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వారి వీలును బట్టి ఒక రోజు కంటే ఎక్కువ సార్లు కూడా కలవొచ్చని సూచిస్తున్నారు.

Research says how many days a week a couple should be intimate for a happy married life

అయితే ఎక్కువసార్లు కలిస్తే ఎక్కువ సంతోషం ఉంటుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. ఎన్నిసార్లు కలిశామన్నది కాదు.. కలిసినప్పుడు ఎంత సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారనేది ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.?

భార్యాభర్తలకి వయసు పెరిగే కొద్దీ పిల్లలు, బాధ్యతల కారణంగా ఏకాంతం తగ్గడమనేది సహజమే అయినా వారి మధ్య ప్రేమ తగ్గిందనేది కాదని అర్థం చేసుకోవాలి. ఇతరుల దాంపత్య జీవితంతో పోలిక పెట్టుకోకుండా మీ దంపతులు కలిసినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారనేది ముఖ్యం. మీ ఇద్దరూ హ్యాపీగా ఉంటే చాలని గమనించుకోవాలి.

మీరు రొటీన్‌ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా మీతో జీవితం పంచుకున్న భాగస్వామికి కొంత నాణ్యమైన సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఆ సమయం కూడా ప్రతిరోజూ ఇచ్చినట్లయితే మీ దాంపత్య జీవితంలో ఎటువంటి ఒడుదొడుకులు, అడ్డంకులు రావు. ఎలాంటి సమస్యనైనా ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకునే ధైర్యం మీకు వస్తుంది.

Story first published: Tuesday, September 8, 2026, 20:16 [IST]
Desktop Bottom Promotion