Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మీ సంసారం సప్పగా సాగిపోతుందా? 2-2-2 రూల్ పాటిస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా!
పెళ్లైన కొత్తల్లో దంపతుల మధ్ య ఉండే ఉత్సాహం అంతో ఇంతో కాదు. పెళ్లి జరిగిన కొత్తలో ఉన్న ఆ ఉత్సాహం, ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధ, గంటల తరబడి సాగే కబుర్లు..రోజులు గడిచేకొద్దీ మాయమవుతాయి. ఉద్యోగ బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లల ఆలనాపాలన వంటి వాటితో సతమతమవుతూ, ఎంతో ఇష్టపడి ఒక్కటైన రెండు మనసులు తెలియకుండానే దూరమవుతాయి. మాటలు తగ్గి, మౌనం పెరిగి, ప్రేమ నాలుగు గోడల మధ్య బందీ అయిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా సంబంధాలు నిస్సారంగా మారిపోతాయి. అయితే మీ అనుబంధంలో మళ్లీ పాత మాధుర్యాన్ని నింపడానికి, బంధాన్ని మరింత పటిష్టం చేయడానికి సంబంధాల నిపుణులు ఒక అద్భుతమైన సూత్రాన్ని చెబుతున్నారు. అదే 2-2-2 రూల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫార్ములా మీ బంధానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది.

ఏమిటీ 2-2-2 నియమం?
ఈ నియమం చాలా సులభమైంది కానీ అత్యంత ప్రభావవంతమైంది.
ప్రతి 2 వారాలకు: మీరిద్దరూ కలిసి ఒక డేట్ నైట్ కి వెళ్ళాలి. అంటే బయట డిన్నర్ కి వెళ్లడం, సినిమా చూడటం లేదా చేతిలో చేయి వేసుకుని ప్రశాంతంగా నడవడం వంటివి చేయాలి. ఆ సమయంలో ప్రపంచాన్ని పక్కనపెట్టి, కేవలం ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి.
ప్రతి 2 నెలలకు: ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. రోజూ ఉండే హడావిడికి, నగరపు రణగొణ ధ్వనులకు దూరంగా రెండు రోజులు ప్రశాంతమైన ప్రదేశంలో గడపాలి. ఇది మీ బంధానికి ఒక రిఫ్రెష్ బటన్ లాంటిది.
ప్రతి 2 సంవత్సరాలకు: కనీసం ఒక వారం రోజుల పాటు సుదీర్ఘమైన విహారయాత్రకు వెళ్ళాలి. ఇది మీరిద్దరూ కలిసి కొత్త ప్రదేశాలను చూడటానికి, కొత్త జ్ఞాపకాలను నిర్మించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి దోహదపడుతుంది.
ఈ నియమం ఎందుకంత ముఖ్యం
రోజూ కలిసే ఉంటున్నాం కదా మళ్లీ ప్రత్యేకంగా డేట్లు, ట్రిప్పులు ఎందుకు? అని చాలామంది అనుకుంటారు. కానీ కలిసి ఉండటం వేరు, క్వాలిటీ సమయాన్ని కలిసి గడపడం వేరు. రోజువారీ జీవితంలో భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా పాత్రలను పోషిస్తాం. కానీ ఈ 2-2-2 నియమం మీరిద్దరూ కేవలం భాగస్వాములు మాత్రమే కాదు, అంతకుమించి ఒక ప్రేమ జంట అని గుర్తుచేస్తుంది.
డేట్ నైట్ మీ మధ్య సంభాషణను ప్రోత్సహిస్తుంది. వీకెండ్ ట్రిప్ కొత్త ఉత్సాహాన్ని నింపి పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తుంది. సుదీర్ఘ సెలవులు ఒకరినొకరు కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి, మీ బంధానికి కొత్త దిశను చూపడానికి సహాయపడతాయి. ఈ చిన్న చిన్న విరామాలు మీ బంధంలో పేరుకుపోయిన ఒత్తిడిని తొలగించి, అనుబంధంలో తాజాదనాన్ని నింపుతాయి. మీ భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో, వారి సమయం ఎంత విలువైందో మీకు అర్థమయ్యేలా చేస్తాయి.
ఈ 2-2-2 నియమం ఒక సూత్రం మాత్రమే, శాసనం కాదు. మీ బడ్జెట్, సమయం, సౌలభ్యాన్ని బట్టి దీనిని మార్చుకోవచ్చు. ఖరీదైన ట్రిప్ కు బదులు దగ్గరలోని ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లొచ్చు. రెస్టారెంట్‌కు బదులు ఇంట్లోనే పిల్లలు నిద్రపోయాక మీకిష్టమైన సినిమా చూస్తూ సమయం గడపొచ్చు. ముఖ్యమైనది ఒకరికొకరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం.



Click it and Unblock the Notifications