Latest Updates
-
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం -
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.! -
మహిళలకు అమృతంతో సమానం.. ఎముకల పటిష్టతకు, రక్తహీనతను తరిమికొట్టే హెల్తీ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.! -
చాణక్య నీతి: భార్య తన భర్తకు తెలియకుండా చేయకూడని 4 పనులు.. లేదంటే కష్టాలు తప్పవు.! -
డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్?
40 ఏళ్లు దాటినా శృంగారంలో రెచ్చిపోవాలంటే ఏం చేయాలో తెలుసా?
చాలా మందికి ఓ వయసు రాగానే సెక్స్ చేసుకోవడం తప్పుగా చూస్తారు. పాతికేళ్లకే పిల్లలు పుట్టిన వాళ్లకి 40 ఏళ్ల వచ్చే సరికి పిల్లలు పెద్దగా అవుతారు. ఆ సమయంలో చాలా మంది జంటలు శృంగారం తప్పుగా భావిస్తూ సెక్స్ కు దూరం అవుతుంటారు. అలాగే మరికొంత మందికి సహజంగానే శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కానీ సెక్స్ చేసుకోవడానికి వయసుకు అస్సలే సంబంధం లేదు. వయసు ఎంత పెరుగుతున్నా సెక్స్ లో పాల్గొంటే మానసికంగా, శారీరకంగా చాలా సంతోషంగా ఉంటారు.

బలవంతం, హింసకు బాగా దూరమవ్వండి:
లైంగిక సంబంధాల ప్రభావం మన ఆరోగ్యంపై కనిపిస్తుందని ఎన్సీబీఐ పరిశోధనలో తేలింది. లైంగిక సంబంధాల్లో ఆనందాన్ని పొందని మహిళలు అధిక రక్తపోటు బారిన పడుతున్నారని తేలింది. ఇక పురుషులు అయితే ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారట. మొత్తం జీవిత నాణ్యతను మెరుగు పరచడానికి సెక్స్ చాలా ముఖ్యం. లైంగిక ఆరోగ్యం, లైంగిక సంబంధాలకు సానుకూల, గౌరవప్రదమైన విధానం చాలా అవసరం. వీటితో పాటుగా బలవంతం, హింస లేకుండా ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకోవాలి.
40లలో కూడా రేసు గుర్రాలైపోండి..!
ఈ వయసులోనూ కోరికలు పురివిప్పి మీ భాగస్వామి పిచ్చెక్కిపోవాలంటే మీరు కొన్ని చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే వయసు ఎంత పెరిగినా సెక్స్ మీద ఆసక్తి మాత్రం తగ్గదు. ఎప్పుడూ మీ పొందు కావాలనే కోరుకుంటారు. పెళ్లైన తొలినాళ్లలో ఏ రేంజ్ లో సెక్స్ లో పాల్గొన్నారో 40లలో కూడా అలాగే పాల్గొంటారు. అయితే మారుతున్న పరిస్థితులు, ఒత్తిడి, వయసు కారణంగా లిబిడో తగ్గిపోతుంది. దాన్ని పెంచుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భావప్రాప్తి చాలా ముఖ్యం:
చాలా మంది సెక్స్ లో పాల్గొంటున్నామా అంటే పాల్గొంటున్నాం అన్నట్లుగానే ఉంటారు కానీ సెక్స్ సమయంలో సంతృప్తిపై దృష్టిని అసలే పెట్టరు. ఒకరినొకరు తోడుగా ఉంటే చాలు. ఒకరితో ఒకరు సమయం గడిపితే చాలు అనుకునేవారు. వీటిపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అయితే శృంగారంలో భావప్రాప్తిని తారాస్థాయికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. సంతోషకరమైన జంట పనితీరు కంటే ఆ సమయాన్ని ఆస్వాదించడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు, ఇది వారి సంబంధాన్ని బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది.
సెక్స్ లైఫ్ బాగుంటేనే దాంపత్య జీవితం బలంగా ఉంటుంది:
సెక్స్ ను భారంగా భావించకుండా ఇష్టం పెరిగేలా చేసుకోవాలి. దంపతుల్లో ఒకరికి మాత్రమే ఇష్టం ఉంటే మరొకరు కూడా కచ్చితంగా పాల్గొనాలి. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలి. సెక్స్ లైఫ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలి. సెక్స్ లైఫ్ బాగున్న వాళ్ల జీవితాలే చాలా వరకు బాగుంటాయి. మీ దాంపత్య జీవితం బాగుండాలని కోరుకుంటే మాత్రం కచ్చితంగా సెక్స్ లైఫ్ బాగుండేలా చేసుకోండి.
మీ బంధం మరింత బాగుండడానికి మీ భాగస్వామితో మాట్లాడడం చాలా ముఖ్యం. ఒకరితో ఒకరు సెక్సీగా, రొమాంటిక్ గా మాట్లాడుకుంటే చాలా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అనేక ఒత్తిడులను దూరం చేసుకోవచ్చు. మీ పిల్లలకు కేటాయించిన్లుగానే కాస్త సమయాన్ని మీ భాగస్వామికి కేటాయించండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications