Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కానివ్వండి..కానివ్వండి: శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తోన్న ప్రభుత్వం..మంచి ఆఫర్ లు
ఇప్పటిదాకా చదువు కోసం, రక్షణ కోసం, వైద్యం వంటి వాటికోసం ప్రభుత్వాలలో మంత్రిత్వ శాఖలు ఉండటం చూశాం. అయితే ఇప్పుడు కొత్తగా శృంగార మంత్రిత్వ శాఖ కూడా ప్రభుత్వంలో ఓ భాగం కానుంది. ఈ శృంగార మంత్రిత్వ శాఖ ప్రజలు శృంగారం చేయాలని ప్రోత్సహిస్తుంది. వామ్మో ఇదేంటి..ఇలాంటి మంత్రిత్వ శాఖ గురించి ఎప్పుడూ వినలేదని ఆలోచిస్తున్నారా? అసలు ఈ మంత్విత్వ శాఖ ఏ ప్రభుత్వంలొ ఉంది..ఎందుకు ఈ మినిస్ట్రీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది..దీని వల్ల ఏంటీ లాభం అనేది ఇప్పుడు చూద్దాం.
చాలాదేశాల్లో ఇప్పుడు జనాభా సంఖ్య వేగంగా పడిపోతుంది. కారణాలు ఏమైనా.. లో బర్త్ రేటు, వృద్ధుల సంఖ్య పెరుగుదలతో చాలా దేశాలు తమ దేశంలో జనాభా అంతరించిపోతుందనే ఆందోళనలో చాలా దేశాలున్నాయి. అందుకే అనేక రకాల స్కీమ్ లు ఇస్తూ పిలల్ని కనాలని ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇదే క్రమంలో రష్యా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జనన రేటును పెంచడానికి శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పుతిన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఓ రిపోర్ట్ ప్రకారం ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా కూడా రష్యాలో మరణాల రేట్లు పెరిగింది. జనవరి-జూన్ మధ్య రష్యాలో 3,25,100 మరణాలు నమోదవగా.. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 49 వేల మరణాలు ఎక్కువగా రికార్డయ్యాయి. ఇదే సమయంలో జననాల రేటు కనిష్ట స్థాయికి చేరుకుంది. రష్యాలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో 5,99,600 మంది చిన్నారులు జన్మించారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 16 వేల జననాలు తక్కువగా నమోదయ్యాయి. 1999 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైం. ఈ క్రమంలోనే జననాల రేటును పెంచేందుకు పుతిన్ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ శృంగార మంత్రిత్వశాను తీసుకొస్తోంది.
శృంగార మంత్రిత్వ శాఖ పెట్టి ఏం చేస్తారు
డేటింగ్‌ను ప్రోత్సహిస్తారు. డేటింగ్ చేసేవాళ్ల కోసం అనేక ఆఫర్లు అందిచనున్నారు. ఫస్ట్ డేట్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న జంటలకు 5,000 రూబీస్ ఇస్తారు. కొత్తగా పెళ్లైన జంటకు ఫస్ట్ నైట్ కోసం హోటల్ బుకింగ్ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. రాత్రి సమయాల్లో మాత్రమే కాకుండా ఆఫీస్ పని వేళల్లో కూడా శృంగారంలో పాల్గొనేందుకు కపుల్స్ కి టైం కల్పిస్తారు.
జంటల మధ్య సాన్నిహిత్యం పెంచేందుకు రాత్రిపూట కొంత సమయం ఇంటర్నెట్ ఆఫ్ చేయడం,కరెంటు తీసేయడం వల్ల జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని..అది పిల్లల పుట్టుకకు దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి కాన్పులో జన్మించిన బిడ్డలకు 8500 పౌండ్లు అందించనున్నారు. 18- 23 ఏళ్ల మహిళా విద్యార్థులకు 900 పౌండ్లు ప్రోత్సాహక బహుమతి ఇవ్వనున్నారు. ఇలా రకరకాల ఆలోచనలు ప్రభుత్వం ముందు ఉన్నట్టు తెలుస్తోంది. ఏ పథకం అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పాటు మహిళల వ్యక్తిగత జీవితాలను, అభిరుచులను కూడా అధ్యయనం చేస్తోంది రష్యా ప్రభుత్వం. మరోవైపు, కాఫీ,భోజన విరామ సమయాలను సంతానం కోసం వినియోగించాలని రష్యా ఆరోగ్య మంత్రి ఆ దేశ పౌరులకు సూచించారు.



Click it and Unblock the Notifications