Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సాయి పల్లవికి ఇలాంటి అబ్బాయిలే ఇష్టమట.. క్వాలిటీస్ ఎలా ఉండాలంటే?
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' ఈరోజు విడుదలైంది. సినిమాలో 'తండేల్ రాజు' పాత్రలో నాగచైతన్య నటనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో అంతా సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. సాయి పల్లవి నటన, మ్యూజిక్ అంతా బాగుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి, నాగ చైతన్య చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో సాయి పల్లవి తనకు ఎలాంటి అబ్బాయిలు ఇష్టమో తెలిపారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
నలిగిపోయిన డ్రెస్
తనకు నలిగిపోయిన డ్రెస్సులు వేసుకున్న అబ్బాయిలంటే అస్సలు ఇష్టం ఉండదట. తన కుటుంబంలో ఎవరైనా నలిగిపోయిన డ్రెస్సులు వేసుకుంటే వెంటనే వాటిని రెడీ చేయడానికి లేదా సరి చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. దీనిపై నాగ చైతన్య స్పందిస్తూ.. "అబ్బాయిలు విన్నారా? ఈసారి సాయిపల్లవిని కలిసే ముందు, మీ డ్రెస్‌ను బాగా ఉతికి, ఇస్త్రీ చేసి వేసుకుని" అని సరదాగా వ్యాఖ్యానించారు.

ఫ్యాషన్ గురించి:
"నటించిన సినిమా కాకుండా, సాయిపల్లవికి ఏం ఫ్యాషన్ ఇష్టమంటే?" అన్న ప్రశ్నకు, సాయిపల్లవి స్పందిస్తూ "నేను తేనెటీగల పెంపకం అంటే చాలా ఇష్టపడతాను. ఇటీవలే ఈ హాబీని ప్రారంభించాను." అని చెప్పారు.
దర్శకత్వం గురించి:
"దర్శకత్వం చేయాలనుకున్నారా?" అన్న ప్రశ్నకు సాయిపల్లవి తన ఆలోచనను వెల్లడిస్తూ "నేను దర్శకురాలిని కావాలనుకోవడం లేదు. అలాంటి ఆలోచనే లేదు." అని చెప్పారు. దీనిపై నాగచైతన్య సరదాగా స్పందిస్తూ, "నువ్వు అబద్ధాలు చెబుతున్నావు. గతంలో ఈ విషయం అడిగితే, నువ్వు 'డైరెక్షన్ చేస్తా' అన్నావు. నన్ను కూడా నటుడిగా తీసుకుంటానని చెప్పావు." అని నవ్వుతూ చెప్పారు.
చైతన్య డ్యాన్స్ గురించి:
"సినిమాలో చైతన్య డ్యాన్స్ చూసి ఏమనిపించింది?" అన్న ప్రశ్నకు సాయిపల్లవి "ముందు చైతన్య డ్యాన్స్ చేస్తుండగా అప్పుడప్పుడు వెనకడుగు వేసేవారు. కానీ ఈ సినిమాలో నమో నమః పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు." అని తెలిపారు.
ఖాళీ సమయం:
"ఖాళీ టైంలో సాయిపల్లవి ఏం చేస్తుంది?" అన్న ప్రశ్నకు, "ఖాళీ సమయాల్లో నేను ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తాను. వంట చేయాలనుకుంటాను కానీ చేయలేను. ఆర్డర్ చేసి తినేస్తాను. క్యారెట్లు పండిస్తాను. సినిమాలు చూస్తాను." అని నవ్వుతూ చెప్పారు.



Click it and Unblock the Notifications