Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
బంధం బలహీనపడుతోందా? ఈ 5 సంకేతాలు మీకు చెప్తాయి!
ప్రేమలో పడినప్పుడు ప్రపంచమంతా అందంగా ఓ ఇంధ్రధనస్సులా కనబడుతుంది. ప్రతి క్షణం ఓ మధురమైన పాటలా, ప్రతి మాట ఓ కవితలా అనిపిస్తుంది. ఈ బంధం శాశ్వతమని, కాలం కూడా దీన్ని చెరిపేయలేదని మనసు గట్టిగా నమ్ముతుంది. కానీ అదే ప్రేమ బంధం బీటలు వారుతున్నప్పుడు ఆ రంగులన్నీ చెదిరిపోయి జీవితం ఓ తుఫానులో చిక్కుకున్న నావలా అనిపిస్తుంది. ప్రేమ నిశ్శబ్దంగా మనసులోకి అడుగుపెట్టినా అది వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇచ్చే వెళ్తుంది. ఆ ప్రమాద ఘంటికలేంటో తెలుసుకుంటే బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది లేదంటే విడిపోయి భాధపడాల్సిందే.
బంధం తెగిపోయే ముందు కనబడే సంకేతాలివే
గౌరవం లేకుంటే
ఏ బంధానికైనా గౌరవం వెన్నెముక లాంటిది. అభిప్రాయ భేదాలు, వాదనలు సహజమే..ఇవన్నీ వస్తుంటాయి,పోతుంటాయి కానీ ఆ వాదనలు వ్యక్తిగత దూషణలకు, అవమానాలకు దారితీస్తుంటే, మీ భాగస్వామి మాటలు మిమ్మల్ని తక్కువ చేస్తున్నట్లు అనిపిస్తే అక్కడ ప్రేమ పునాదులు కదులుతున్నాయని అర్థం. గర్వాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు గౌరవించుకోలేనప్పుడు ఆ బంధం కొనసాగడం కష్టం.

ఆధిపత్యం
ప్రేమలో ఒకరు సర్దుకుపోవడం సహజం. ఇలా సర్దుకుపోతేనే కాపురం సజావుగా సాగుతుంది. అయితే రిలేషన్ షిప్ లో ఒకరి సర్దుబాటును మరొకరు అలుసుగా తీసుకుని ప్రతి విషయంలోనూ ఆధిపత్యం చెలాయించడం మొదలుపెడితే ఆ బంధం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ప్రతి మాటకు, ప్రతి పనికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తే అది ప్రేమ కాదు, ఓ రకమైన బానిసత్వం. స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేని చోట ప్రేమ బతకదు. త్వరలోనే ఈ బంధం ఇలా ఉంటే తెగిపోవడం గ్యారెంటీ.
వ్యక్తిగత స్వేచ్ఛ
సంబంధంలో ఒకరిలో ఒకరు కలిసిపోవడమే కాదు.. ఒకరికొకరు ఎదిగేందుకు కావలసినంత స్పేస్ ఇచ్చుకోవడం కూడా ముఖ్యమే. ప్రతి ఒక్కరికీ తమకంటూ సొంత సమయం, స్నేహితులు, ఆసక్తులు ఉంటాయి. వాటిని గౌరవించకుండా, ఎప్పుడూ నీడలా వెంటాడుతూ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంటే ఆ బంధం భారంగా మారుతుంది. ఇలా కంటిన్యూ అయితే త్వరలోనే ఈ బంధం కూలిపోతుంది.
నమ్మకం .
నమ్మకమే ప్రేమకు ఏ బంధానికి అయిన ప్రాణం. ఆ నమ్మకం స్థానంలో అనుమానం ప్రవేశిస్తే ఆ బంధం విషపూరితమవుతుంది. అబద్ధాలు, మోసం, దాపరికం వంటివి మొదలైతే ప్రేమ సౌధం కుప్పకూలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒకసారి నమ్మకం పోతే దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం.

సమయం ఇవ్వలేనప్పుడు
ఎంత బిజీగా ఉన్నా మనసుకు నచ్చిన వారికోసం సమయం దొరకదంటే వారి ప్రాధాన్యత తగ్గుతోందని అర్థం. కష్టసుఖాలు పంచుకోవడానికి, కనీసం ఒకరి మాట ఒకరు వినడానికి కూడా సమయం లేకపోతే, ఆ బంధంలో ఒంటరితనం ఆవహిస్తుంది. శారీరకంగా పక్కన ఉన్నా మానసికంగా దూరమైతే ఆ బంధానికి అర్థం ఉండదు.ఇదే కంటిన్యూ అయితే బంధం చీలిపోతుంది.
బంధంలో స్నేహం కరువైతే
భాగస్వామి కేవలం ప్రేమికులే కాదు మంచి స్నేహితులు కూడా కావాలి. మనసులోని ప్రతి మాటను, భయాన్ని, సంతోషాన్ని స్వేచ్ఛగా పంచుకోలేని వాతావరణం ఉంటే ఆ బంధంలో ఏదో లోపం ఉన్నట్లే. మీ భాగస్వామి దగ్గర ముసుగు వేసుకోవాల్సిన అవసరం వస్తే ఆ బంధం ఎక్కువ కాలం నిలవడం కష్టం. ఈ సంకేతాలు మీ బంధంలో కనిపిస్తుంటే వాటిని విస్మరించకుండా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అందమైన ప్రేమ జ్ఞాపకం లేదా మీ బంధం ఒక చేదు అనుభవంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.



Click it and Unblock the Notifications