Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
మనోళ్లే కదా అనుకుంటే అస్సామే!..బంధాల్లో ఈ సరిహద్దులు ఉండాల్సిందేనట
నాకు నా ఫ్యామిలీనే సర్వస్వం..అంతా వాళ్ల కోసమే అనే మాటలు మనం తరుచుగా వింటుంటాం. మన జీవితంలో వెలకట్టేని బంధాలు రెండు ఉంటాయి..ఒకటి ఫ్యామిలీ, రెండోది ఫ్రెండ్స్. కష్టసుఖాల్లో తోడుండేది వారే కాబట్టి మన రహస్యాలన్నీ వారితో షేర్ చేసుకోవచ్చని, మనల్ని మనం పూర్తిగా ఆవిష్కరించుకోవచ్చని భావిస్తుంటాం. కొంతవరకు ఇది నిజమే అయినప్పటికీ మానసిక నిపుణులు ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతున్నారు.
బంధం ఎంత బలమైందైనా, అది కుటుంబమైనా, ఫ్రెండ్ షిప్ అయినా ఒక ఆరోగ్యకరమైన సరిహద్దు, ఒక లక్ష్మణ రేఖ ఉండటం అత్యంత అవసరం అని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఎందుకంటే అన్ని బంధాలకంటే ముందు మన ఆత్మగౌరవం, మన మానసిక శ్రేయస్సు ఎంతో ముఖ్యం. బంధాల్లో సరిహద్దులను ఎలా నిర్మించుకోవాలో, ఆ బంధాలను మరింత ఆరోగ్యంగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ చూడండి.

నో అని చెప్పడం నేర్చుకోండి
మనోళ్లే కదా, మన ప్రియమైన వ్యక్తే కదా అని వాళ్లు అడిగిన ప్రతిదానికీ సరే అని తల ఊపడం కరెక్ట్ కాదు. ఇతరులను సంతోషపెట్టాలనే తాపత్రయంలో మనకు ఇష్టం లేని, మనపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించే పనులకు కూడా మనం తలూపుతుంటాం. ఇది మన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కాబట్టి అవతలి వారిని నొప్పించకుండా మీ పరిస్థితిని వివరిస్తూ మర్యాదగా నో(కాదు,కుదరదు) అని చెప్పడం నేర్చుకోవాలి.
మీకంటూ కొంత సమయం
ఫ్రెండ్స్, ఫ్యామిలీతో గడపడం ఎంత ముఖ్యమో..మీతో మీరు సమయం గడపడం కూడా అంతే ముఖ్యం. మీకంటూ కొంత ఏకాంతాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో మీకు నచ్చిన పనులు చేయండి. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోగలిగినప్పుడే ఇతరులకు కూడా ఆనందాన్ని పంచగలరు.
మీ సీక్రెట్స్ చెప్పే ముందు ఆలోచించండి
మీ సీక్రెట్స్, పర్శనల్ విషయాలను ఒకరితో పంచుకుంటున్నారంటే వారిపై మీకు అపారమైన నమ్మకం ఉన్నట్టే. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వారి బాధ్యత కూడా. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి మీ మనసులోని మాటను ఎవరితో పంచుకుంటున్నారో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో ఇది చాలా ముఖ్యం.
మీ పనికి మొదటి ప్రాధాన్యత
ఎవరో పిలిచారని మీ ముఖ్యమైన పనులను వదిలేసి వెళ్ళకండి. మీ సమయం కూడా విలువైందే. ముందు మీ పనులను పూర్తిచేయండి. దానివల్ల అవతలి వారు కూడా మీ సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకుంటారు.
మీ భావోద్వేగాలను కాపాడుకోండి
బంధాలను నిలబెట్టుకోవడం ఒక్కరి బాధ్యతే కాదు. ఎవరైనా సరే ఎంత దగ్గరివారైనా మీ భావాలను కించపరిచే హక్కు వారికి ఇవ్వకండి. మీ మనసును గాయపరిచే మాటలను, ప్రవర్తనను సున్నితంగానైనా సరే ఖండించడం ముఖ్యం.

డబ్బు విషయంలో స్పష్టత
మానవ సంబంధాలన్నీ ప్రస్తుతం ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఎన్నో గొప్ప బంధాలు డబ్బు దగ్గరే దెబ్బతింటాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉండండి. ఇవ్వడంలోనూ, తీసుకోవడంలోనూ స్పష్టమైన వైఖరిని కలిగి ఉండటం బంధాలను కాపాడుతుంది.
వ్యక్తిగత స్వేచ్ఛకు గౌరవం
మీరు ఎంత క్లోజ్ గా ఉన్నా సరే అవతలి వారి వ్యక్తిగత జీవితంలో బలవంతంగా జోక్యం చేసుకోకండి. వారి ఇష్టాయిష్టాలను, నిర్ణయాలను గౌరవించండి. అదేవిధంగా మీ జీవితంలోకి ఇతరులు అనవసరంగా తలదూర్చే అవకాశం ఇవ్వకండి.
మాటల్లో మర్యాద ముఖ్యం
మాట్లాడేటప్పుడు మన మాటలు ఎదుటివారిని ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలి. గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది. మాట జారితే తిరిగి తీసుకోలేమని గుర్తుంచుకోండి.
డిజిటల్ ప్రపంచంలోనూ హద్దులు
మీరు ఆన్ లైన్ లో ఉన్నంత మాత్రాన వచ్చిన ప్రతి మెసేజ్ కి వెంటనే రిప్లై ఇవ్వనక్కర్లేదు. మీకంటూ డిజిటల్ సరిహద్దులు కూడా ఉండాలి. ఇది మీ వ్యక్తిగత సమయాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications