Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శృంగార కోరికలు పురుషుల్లో ఎక్కువా, స్త్రీలలో ఎక్కువా? రోజుకు ఎన్ని సార్లు సెక్స్ చేసుకోవచ్చు?
శృంగారం.. ప్రేమను మరింత గట్టిగా తెలిపే శారీరక చర్య. ఓ మనిషిపై ఉండే ప్రేమను ఈ విధంగా చాలా చక్కగా తెలపవచ్చు. అయిచే చాలా మందిలో ఓ వయసు రాగానే శృంగార కోరికలు కల్గుతాయి. కానీ ఆ విషయాన్ని అస్సలే బయటకు చెప్పరు. ప్రేమలో పడితేనో లేదా మరెవరిపైనైనా ఆ ఫీలింగ్ కలిగితేనో తప్ప దాన్ని వివరించరు. కేవలం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఈ విషయాన్ని చెబుతుంటారు. అయితే ఇందులో ఎక్కువగా పురుషులే ఉండడం గమనార్హం. వారు ధైర్యంగా అమ్మాయిలకు ఈ విషయాన్ని చెప్పడంతో.. వారికే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఇదంతా అవాస్తవం.

ఇద్దరిలోనూ ఒకే స్థాయిలో లైంగిక వాంఛ:
నిజానికి స్త్రీ, పురుషుల ఇద్దరిలో శృంగార కోరికలు ఒకే విధంగా ఉంటాయి. కానీ వారు వారు ఎక్స్ ప్రెస్ చేసే తీరును బట్టి అంతా అలా అనుకుంటారు. లైంగిక వాంఛ ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ అని ఏమీ ఉండదు. సమాజంలో సెక్స్ విషయంలో ఆడ వాళ్లకు అంత స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇలాంటి అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతుంటాయి. మగువలకు సెక్స్ కోరిక కల్గినా, సమాజంలోని పరిస్థితులకు తలొగ్గి.. వాటిని బయట పెట్టరు. కేవలం భౌతిక రూపాల్లోనే తేడాలు ఉంటాయి తప్పితే.. శృంగారం విషయంలో ఇద్దరూ సమానమే.
ఒకరికి కోరిక కల్గినప్పుడు మరకొరు సపోర్ట్ చేయాల్సిందే..!
సో ఈ విషయం అర్థం చేసుకొని దంపతులు ఇద్దరూ తమ తమ భావాలను ఒకరితో మరొకరు పంచుకోవాలి. ఒకరికి కోరిక కల్గినప్పుడు మరొకరూ సపోర్ట్ చేస్తూ వెళ్తుంటే.. మీ జీవితం హాయిగా, హ్యాపీగా గడిచిపోతుంది. శృంగారం చేయడం వల్ల కల్గే అనేక లాభాలను కూడా మీ సొంతం చేసుకోవచ్చు. మానసికంగా బలంగా అవ్వడమే కాకుండా.. శారీరకంగా కూడా అనేక సమస్యలను అధిగమించవచ్చు. మీ మీ ఇష్టాలను బట్టి రోజూ లేదా వారానికి నాలుగైదు సార్లు రతిలో పాల్గొనవచ్చు.
రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు రతిలో పాల్గొనవచ్చు:
సెక్స్ లో పాల్గొనడానికి ఇన్నిసార్లు, అన్ని సార్లు అని లిమిట్ ఏమీ ఉండదు. కోరిక, సామర్థ్యం ఉంటే ఎన్ని సార్లు అయినా శృంగారంలో పాల్గొనవచ్చు. కొత్తగా పెళ్లి అయిన జంటలు అయితే రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. నిజంగా మనసు పడి రతిలో పాల్గొంటే దంపతులు పొందే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే మనసులోని ఒత్తిడి అంతా పటాపంచలైపోతుంది. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఓపిక ఉంటే ఎన్నిసార్లు అయినా సెక్స్ లో పాల్గొనవచ్చు.
సెక్స్ చేసుకోవడం వల్ల నీరసం రాదు.. ఉత్సాహం పెరుగుతుంది
అలాగే సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎవరూ నీరస పడరు. ఇంకా చెప్పాలంటే రతి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోజు చాలా ఫ్రెష్ గా కనిపిస్తారు. మీకు కూడా అంతే ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఎందుకంటే సెక్స్ వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదల అవుతాయి. దీని వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ ప్రేమ, బంధం మరింత బలపడాలంటే కచ్చితంగా మీరు వారానికి నాలుగైదు సార్లు అయినా సెక్స్ లో పాల్గొనాల్సిందే. శృంగారానికి ఎక్కువ రోజులు గ్యాప్ ఇస్తే కూడా అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇటీవలే నిపుణులు తెలిపారు. ఎక్కువ గ్యాప్ రాకుండా సెక్స్ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











