Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Sharad Purnima 2025 : అమృతం కురిసే రాత్రి..శరద్ పూర్ణిమ నాడు శృంగారంలో పాల్గొనవచ్చా? పండితులు ఏమంటున్నారంటే..
ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో వచ్చే శుక్ష పక్ష పౌర్ణమిని శరద్ పూర్ణిమ పండుగగా జరుపుకుంటారు. శరత్కాలపు రాత్రిలో చంద్రుడు తన పదహారు కళలలో పరిపూర్ణంగా ప్రకాశిస్తూ భూమికి చాలా దగ్గరగా వచ్చే రోజు ఇది. సనాతన ధర్మంలో శరద్ పూర్ణిమ చాలా ముఖ్యమైన రోజు. ఈ సంవత్సరం శరద్ పూర్ణిమను అక్టోబర్ 6వ తేదీన అంటే ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ రోజు రాత్రి కురిసే చంద్ర కిరణాలలో అమృతం ఉంటుందని.. అది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ రోజున లక్ష్మీదేవిని, చంద్రుడిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున జంటలు శృంగారంలో పాల్గొనడం మంచిదా? కాదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే వివాహిత జంటలు ఈ రోజున పాటించాల్సిన నియమాలు,దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పవిత్రత, ఆధ్యాత్మిక సాధన
శరద్ పూర్ణిమ రోజు రాత్రి మొత్తం దైవశక్తితో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయం మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకోడానికి అత్యంత అనువైనది. లైంగిక సంపర్కం అనేది భౌతిక చర్య. ఈ పవిత్ర రాత్రి భౌతిక సుఖాలకన్నా ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రాధాన్యత ఇవ్వాలని..ధ్యానం, పూజ వంటి వాటితో మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
చంద్రుడి శక్తి,మానసిక ప్రభావం
శరద్ పూర్ణిమ రోజు రాత్రి సమయంలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమిపై, ముఖ్యంపై జలంపై ఎక్కవగా ఉంటది. మనిషి శరీరంలో 70శాతం నీరు ఉంటది కాబట్టి ఆ ప్రభావం మన శరీరం,మనస్సునూ కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ రోజున మన ఎమోషన్స్ ఉధృతంగా ఉంటాయి. శరద్ పౌర్ణమి రోజున చంద్రుడి శక్తి తారా స్థాయిలో ఉంటది, అలాంటి సమయంలో శారీరక కలయిక వల్ల ఆ శక్తి అసమతుల్యతకు గురై అది మానసిక ఒత్తిడి, ఆందోళన, చంచలత్వానికి దారితీసే అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నారు. ఈ శక్తిని ఆధ్యాత్మిక వైపు మళ్లిస్తే మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది.
సంతానంపై ఎఫెక్ట్
హిందూ శాస్త్రాల ప్రకారం శరద్ పూర్ణిమ రోజు రాత్రి చంద్రుడి శక్తి అత్యంత తీవ్రంగా, అసమతుల్యంగా ఉంటది. ఈ సమయంలో గర్భం దాల్చితే ఆ ప్రభావ్ పుట్టబోయే బిడ్డపై పడే అవకాశముంటుందని పండితులు చెబుతున్నారు. పుట్టబోయే బిడ్డకి మానసిక,శారీరక సమప్యలు రావచ్చని పెద్దలు విశ్వసిస్తారు. అందుకే ఈ పవిత్ర రాత్రిని సంతాన సౌఫల్యం కోసం కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ కారణాల వల్ల శరద్ పూర్ణిమ రాత్రి సమయంలో జంటలు సంయమనం పాటించడం ద్వారా ఈ రోజు పవిత్రతను కాపాడుతూ, చంద్రుని అమృత కిరణాల ద్వారా లభించే సంపూర్ణ ఆరోగ్యాన్ని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది, తమ జీవితాన్ని సుఖశాంతులతో నింపుకోవచ్చు.



Click it and Unblock the Notifications