Latest Updates
-
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.? -
ఆగ్రా ఫేమస్ పేఠా స్వీట్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.. -
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.! -
గ్రహణం రోజు ఈ పూజ తప్పనిసరిగా చేయాలట.. శాస్త్రాలు చెప్పే పూర్తి నియమాలు ఇవే!
ఈ లక్షణాలు కనిపిస్తే.. రిలేషన్‌షిప్‌లో కొనసాగడం కష్టమే..!
రిలేషన్ షిప్ లో ఉన్న వారు గొడవలు పడ్డం సహజం. అయితే కొన్ని సంబంధాల్లో పార్టనర్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కొందరు అదే బంధంలో కొనసాగుతుంటారు. ఇది వారికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురించేస్తుంది. పార్టనర్ నుంచి ఎన్ని ప్రమాదకర సాంకేతాలు వచ్చినా రేలషన్శిప్ లో కొనసాగుతూ ఉండడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ వుంటారు.
అయితే పార్టనర్ నుంచి ఎలాంటి సాంకేతాలు వస్తే అప్రమత్తమవ్వాలి. ఎలాంటి పరిస్థితిలో మీ రేలషన్శిప్ లో ఇంక కొనసాగవద్దని నిర్ణయం తీసుకోవాలో ఇక్కడ మీకు అందిస్తున్నాం.
వేరే రేలషన్శిప్
గొడవలు జరిగిన సందర్భంలో పార్టనర్ తరచుగా.. నేను వేరే పెళ్లి చేసుకోదలచుకోలేదు, నేను వేరే ఎవ్వరితో సంబంధంలో లేను లాంటి మాటలను పదే పదే అంటూ ఉంటే ఇక మీరు వారిని వదివేయవలసిన సందర్భం వచ్చిందని అనుకోవచ్చు. మీతో సంబంధం నచ్చకనే ఇలా పరోక్షంగా మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు పార్టనర్ కు నిరూపించుకోవలసిన అవసరం లేదని నిర్ధారణకు రావాలి.
నువ్వు చాలా ఎమోషనల్
ఎమోషన్స్ మనిషికి చాలా ముఖ్యమైనవి. ఆ ఎమోషన్స్ తో మాత్రమే ఇతర జీవులకు మనిషికి వ్యత్యాసం వచ్చింది. రేలషన్శిప్ పుట్టేది ప్రేమ అనే ఎమోషన్ నుంచే. ఎమోషన్స్ లేకపోతే బంధాలు కూడా కొనసాగవు. అలాంటి ఎమోషన్స్ కు పార్టనర్ ప్రాధాన్యత ఇవ్వాకపోతే చాలా ప్రమాధకరమైన విషయం. ఎమోషన్స్ కి విలువ ఇవ్వని పార్టనర్ తో కలిసి ఉండవద్దని నిర్ణయం తీసుకోవాలి.

ఇది నీ సమస్య
రేలషన్శిప్ లో ఏ సమస్య వచ్చినా ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలి. ఇద్దరి మధ్యలో ఏ గొడవ జరిగినా దానికి కారణం నువ్వే అని పార్టనర్ అంటే అప్పుడే అప్రమత్తం కావాలి. ఏ సమస్య వచ్చినా దాంట్లో తన తప్పు కూడా ఏదైనా ఉండవచ్చు అని ఇద్దరు పార్టనర్స్ కు అనిపించాలి. సమస్య నీది మాత్రమే ఉంది అనే బంధం చాలా ప్రమాదంలో ఉన్నట్టుగా భావించాలి. వెంటనే ఆ రేలషన్శిప్ కి గుడ్ బై చెప్పివేయాలి.
మిమ్మల్ని గాయపరచాలనే ఉద్దేశ్యం లేదు
గొడవలు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో పార్ట్‌నర్ శారీరకంగా లేక మానసికంగా చాలా బాధపెడతారు. బాధపెట్టిన తరువాత మళ్లీ వారే..నాకు నిన్ను బాధపెట్టడం ఇష్టం లేదని అంటారు. అంటే మీరు అలాగే ప్రవర్తిస్తే మిమ్మల్ని అలాగే ఎప్పటికీ బాధపెడతానని పార్ట్‌నర్ పరోక్షంగా మీతో అంటున్నాడని మీరు భావించాలి. ఈ సంకేతం చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకొని రిలేషన్‌షిప్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచిస్తున్నారు.
కమ్యునికేషన్ తగ్గినప్పుడు
రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ ప్రతీ రోజు మాట్లాడుకోవడానికి, కలిసి పనిచేసుకోవడానికి సమాయాన్ని కేటాయించుకొని మాట్లాడుకోవాలి. ఎన్ని కష్టపరిస్థితులు వచ్చినా పార్ట్‌నర్‌తో మాట్లాడకుండా వుండవద్దు. పార్ట్‌నర్ మీతో కావాలని కమ్యునికేట్ చేయకపోతే ఇక ఆ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ కాలం కొనసాగవద్దు.
భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే
పార్ట్‌నర్‌తో జీవిత కాలంపాటు వుండాలని రిలేషన్ మొదలుపెడతారు. కానీ గొడవలు జరిగిన సందర్భంలో లేదా ఇంకెప్పుడు కూడా ఇద్దరు పార్ట్‌నర్ భవిష్యత్తు గురించి కలిసి ప్లాన్ చేసుకోకపోతే ఇక వారు రిలేషన్‌షిప్‌లో వుండి లాభం లేదని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications