Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇలాంటి టాక్సిక్ భార్యలుంటే భర్తలు అప్రమత్తంగా వుండాలి..!
భార్యా భర్తల మధ్య పరస్పర గౌరవ మర్యాదలు ఉండాల్సిందే. కానీ వారి ఇద్దరి మధ్య ఏర్పచుకున్న కొన్ని హద్దులు మీరితేనే ఇద్దరి వైవాహిక జీవింతం పెద్ద సమస్యలో పడుతుంది. రిలేషన్‌షిప్‌లో తప్పులు జరగడం సహజం కానీ ఆ తప్పులను సరిచేసుకొన్నప్పుడు మాత్రమే ముందుకు సాగగలుగుతారు. ఈ మధ్య వైవాహిక జీవితంలో స్త్రీలు చేసే తప్పులకు భర్తలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భార్యలు చేసే ఈ తప్పుల వల్ల నూరేళ్ల సంబంధం కొన్ని రోజులకే పరిమితం అవుతుంది. తప్పని తెలిసినా భార్యలు అదే తప్పులను చేసుకుంటూ పోతే ఇక వారి వైవాహిక జీవితాన్ని వారే చేతులతో పాడుచేసుకుంటున్నారని భావించవచ్చు. దీని వల్ల వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రిలేషన్‌షిప్ ముందుగు సాగాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాల్సిందే. లేదంటే ఇక ఆ రిలేషన్‌షిప్ ఇక ఎంత కాలం కూడా నిలవదు.
గౌరవం లేకపోతే
పెళ్లి తరువాత భార్య భర్తకు, భార్యకు భర్త గౌరవం ఇవ్వాల్సిన అవసరం వుంది. ఈ గౌరవం లోపిస్తే అది వారి రిలేషన్‌షిప్‌ను చులకనగా మారుస్తుంది. కొంత మంది భార్యలు ఈ విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. వారి మాటల ద్వారా, చర్యల ద్వారా భర్తకు గౌరవం ఇవ్వవపోవడం వల్ల వారే సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఆ తరువాత వారి వివాహబంధంలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. భర్తకు గౌరవం ఇవ్వని భార్యలకు సమాజంలో సముచితమైన గౌరవం వుండదు.

మైండ్ గేమ్
రిలేషన్‌షిప్‌లో వుంటూనే భార్యలు భర్తలతో మైండ్ గేమ్ ఆడుతుంటారు. భర్తకు నచ్చిని పనులు, చేయడం భర్తలను మోసం చేస్తూ వుంటారు. ఇది చాలా చాకచక్యంగా చేస్తుంటారు. వీటికి సంబంధించి భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు భార్యలు అసత్యాలను ఎక్కువగా మాట్లాడుతుంటారు. తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. భార్యలు ఇలాంటి పనులు చేస్తే ఇక వారి వైవాహిక జీవితం గంగలో కలిసినట్లే.
మోసం చేయడం
వైవాహిక జీవితంలో నమ్మకం చాలా ముఖ్యం. ఆ నమ్మకానికి కొందరు భార్యలు తూట్లు పొడుస్తుంటారు. భార్తలను మోసం చేస్తుంటారు. వివాహం సమయంలో చేసిన ప్రమాణాలను కూడా మరిచిపోయి తమకు నచ్చినట్లుగా భర్తలతో వుంటూ నమ్మక ద్రోహానికి పాల్పడతారు. ఇలాంటి భార్యల వల్ల వైవాహిక జీవితం మొత్తం కుదేలవుతుంది. ఇలాంటి భార్యలు చాలా ప్రమాదకరమని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిజాయితీగా వుండాలి
రిలేషన్‌షిప్‌లో నిజాయితీగా వుండాలి. బలమైన వైవాహిక జీవితానికి నిజాయితీయే పునాది. ఒక్కసారి నిజాయితీని కోల్పోతే తిరిగి దాన్ని సంపాదించడం చాలా కష్టమైన విషమయం. నిజాయితీ లేని వారి నుంచి దూరంగా వుంటేనే జీవితం సుఖమయంగా వుంటుంది. లేదంటే అటు రిలేషన్‌షిప్‌లో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా నష్టపోతారు.
పట్టించుకోకపోవడం
వైవాహిక జీవితంలో భార్యలు భర్తలతో పైకి సంతోషంగానే వున్నట్లు నటిస్తూ వారిని నిజజీవితంలో పట్టించుకోకుండా వుంటారు. ఇలా వుండడం వల్ల భర్త చాలా సమస్యలను ఎదుర్కొంటాడు. భార్యలు తమకు ఆసక్తి లేకపోయినా, రిలేషన్‌షిప్‌లో వుండడం ఇష్టం లేకపోయనా బహిరంగంగా తమకు ఇష్టం లేదని చెప్పాలి. రహస్యంగా వుంటూ అటు భర్తను ఇబ్బందులకు గురి చేసే భార్యలు చాలా ప్రమాదకరమని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications