Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
పార్ట్‌నర్‌కు ఇష్టం లేదు.. ఇవే సంకేతాలు..
ఇద్దరు భార్యా భర్తలు లేదా ఇద్దరి ప్రేమికుల్లో ఎవరి మనసులో ఏమి దాగుందో ఈ భూమిపై ఎవ్వరూ కనిపెట్టలేరు. రిలేషన్‌షిప్‌లో ఒకరంటే ఒకరికి పడి చచ్చేంత ప్రేమ ఉన్నా కొన్ని బంధాల్లో తరువాత అది క్రమంగా తగ్గిపోతుంది. దీనికి చాలా కారణాలు ఉండి ఉంటాయ్. రిలేషన్‌షిప్‌లో ఉండడానికి పార్ట్‌నర్‌కు ఇష్టం లేకున్నా ఆవిషయాన్ని బయటకు చెప్పడానికి సాహసం చేయరు. కానీ వారు మీతో ఉంటున్న విధానం, తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులను బట్టి మిమ్మల్ని ఎంత వరకు ప్రేమిస్తున్నారో అంచనా వేయవచ్చు. ఇక్కడ మేము ఇచ్చిన ఆర్టికల్‌లో రిలేషిప్‌లో పార్ట్‌నర్‌కు ఉండడం ఇష్టంలేకపోతే ఎలాంటి లక్షణాలు వారి కనిపిస్తాయో తెలుసుకుందాం.
పార్ట్‌నర్‌కు ఇష్టం లేదనడానికి ఇవే సంకేతాలు..
చిరాకు కోపం
మీపైన వారికి చిన్న విషాలకు సంబంధించి కూడా కోపం వస్తుంది. మీరంటేనే వారికి అసహ్యం అనే భావన వారిలో మీరు గమనించవచ్చు. వారికి వచ్చిన కోపాన్ని మీరు సులభంగా హ్యాండిల్ చేయలేరు. మీతో కనీసం చాటింగ్ చేయడానికి కూడా ఇష్టపడని వారు వేరే వారితో ఎక్కువ సేపు సంభాషణలో ఉంటే మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ఇష్టపడరని అనుకోవచ్చు.

ఇద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంభించినప్పుడు లేదా ఇద్దరూ కలిసి చాలా కాలం ప్రేమలో గడిపిన తరువాత ఇక మీతో వారి భవిష్యత్తుకు సంబంధించిన ఏ విషయాన్ని చర్చించకపోతే. లేదా మీతో కలిసి భవిష్యత్తులో చేసే ప్లాన్స్ ఏవీ లేకపోయినా మీపై వారికి ఇష్టం లేదని, ఇక ఎక్కువ రోజులు మీతో గడపడం కష్టమనే భావన వారిలో ఉందని నిర్ధారణకు రావచ్చు.
సమయం కేటాయించకపోవడం
జీవితంలో పార్ట్‌నర్ చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. ఎన్ని పనులున్నప్పటికీ పార్ట్‌నర్‌కు సరిగ్గా టైం ఇవ్వకపోతే దానిని కూాడా ఒక సంకేతంగా చూడవచ్చు. సెలవులు, లీవుడు, ఖాళీ సమయం దొరికినప్పుడు మీతో గడపకుండా వేరే ప్లాన్స్ వేసుకోవడం, ఇతరులతో, వేరే ప్రదేశాల్లో మిమ్మల్ని వదిలి ఎంజాయ్ చేయడం గనక చేస్తే మీపై వారికి ఇష్టం లేదని చెప్పవచ్చు.
కమ్యునికేషన్
ఒకరితో ఒకరు కమ్యునికేట్ చేయడం రిలేషన్‌షిప్ లో చాలా ముఖ్యం. గతంలో మీతో మాట్లాడుతూ గంటలు గంటలు గడిపే వ్యక్తి ఉన్నట్టుండి 5 నిమిషాలు కూడా మీకు సమయం ఇవ్వకపోతే దీనిని కూడా సంకేతంగా తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కాకుండా ప్రతీ సారి చాటింగ్‌లోనూ, ఫోన్‌లోనూ వారి ప్రవర్తన అలాగే ఉంటే ఇక ఇష్టం లేనట్టేనని మానసిక నిపుణులు చెబుతున్నారు.
రొమాన్స్ తగ్గిపోవడం
ఇద్దరు పార్ట్‌నర్స్ ఎంత రొమాంటిక్‌గా ఉంటే వారి బంధం అంత హ్యాపీగా ఉంటుంది. రొమాన్స్ సమయంలో మీ మాటలు కూడా వారికి చిరాకు తెప్పిస్తుంటే. మీరు ఎంత రొమాంటిక్‌గా ఉన్నప్పటికీ సీరియస్‌గా ఉండడం మీతో రొమాన్స్‌లో ఒక అడుగుకూడా ముందుకు వేయకపోతే మీతో వారు సంతోషంగా లేరని అనుకోవచ్చు.
మీ బాధలను పట్టించుకోకపోవడం
మీ కష్టాలను, ఏడుపులను, కన్నీళ్లను చూసి కూడా పట్టనట్టు గనగ వుంటే, బాధ సమయాల్లో కూడా మీరు కంఫర్టబుల్‌గా ఉండలేకపోతే మీరంటే ఇష్టం లేరనడానికి ఓ పెద్ద కారణంగా చెప్పవచ్చు. మీరు ఏడుస్తున్నప్పుడు ఓదార్చాలి, మీరు కుంగిపోతే మిమ్మల్ని పైకి తీసుకొని రావాలి, ఇలాంటివేవీ కనిపించకపోతే మీ రిలేషన్‌షిప్‌లో బలం లేనట్టే.



Click it and Unblock the Notifications