Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ గర్ల్ ఫ్రెండ్‌లో ఈ లక్షణాలు ఉంటే ఆమె మీకు అబద్దం చెప్తున్నట్లే.. వెంటనే తెలుసుకోండి, లేకపోతే!
పుట్టిన మనుషులందరూ ఏదో ఒక సమయంలో తప్పకుండా అబద్దం చెబుతారు. జీవితంలోని వివిధ పరిస్థితులు అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. చాలా వరకు అబద్ధాలు ఇతరులకు హాని కలిగించవు. అందుకే వాటిని హానిచేయనివిగా పరిగణించబడతాయి.
కానీ వివాహ లేదా ప్రేమ బంధంలో ఉన్న వ్యక్తి నిరంతరం అబద్ధం చెబుతుంటే, అది వారి సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ అబద్ధాలు తమ బంధంపై సందేహాన్ని కలిగిస్తుంది. ఆ సందేహాలు, అనుమానాలు పెరిగేకొద్దీ అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. అయితే మీ భాగస్వామి మీకు అబద్దం చెప్తున్నారని కొన్ని కొన్ని విషయాల ద్వారా తీసుకోవచ్చు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ భాగస్వామి మీకు అబద్దం చెప్తున్నారనడానికి సంకేతాలు ఇవే!
ఆడవాళ్లు అబద్ధాలు చెప్తున్నారని గుర్తించడం చాలా కష్టమని అంటున్నారు నిపుణులు. కానీ స్త్రీలు అబద్ధం చెప్పేటప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మీరు తరచుగా అబద్ధాలు చెప్పే వారితో ప్రేమలో ఉన్నట్లయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాలి.
కిందకి చూస్తూ మాట్లాడడం
స్త్రీ అయినా, పురుషుడైనా ఎవరైనా అబద్ధాలు చెప్పినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఈ సమయంలో వారి శరీరం అనేక బాడీ లాంగ్వేజ్‌లను వ్యక్తపరుస్తుంది. స్త్రీల విషయానికొస్తే, వారు అబద్ధం చెప్పేటప్పుడు తల కిందకు దించుకొని నేలను చూస్తూ మాట్లాడతారు. ఇది ఆ స్త్రీ అబద్దం చెప్తున్నారనడానికి మొదటి నిదర్శనం అని చెప్తున్నారు. దీనిని మీరు గ్రహించి ఆమెను లేదా ఆయనను నిలదీస్తే తప్పకుండా మీరు వారిని పెట్టుకోవచ్చని పేర్కొంటున్నారు.
మాటలు దొరకకపోవడం..
మీ స్నేహితురాలు లేదా స్నేహితుడు మీకు అబద్దం అబద్ధం చెబితే, వారు మాట్లాడేటప్పుడు మాట్లాడ కోసం తడబడుతుంటారు. వారు భయపడడంతో పాటు ఒక రకమైన ట్రాన్స్‌లో ఉండడంతో వారి మాట తడబడుతుంది. మాట పెదవి దాటదు. అందుకే మాటలు దొరక్క పదాల కోసం వెతకడం, మాట తడబడడం వంటివి చేస్తుంటారు. దీని ద్వారా మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు అబద్దం చెప్తున్నారని గ్రహించాలని పేర్కొంటున్నారు.
సమాధానం లేకపోవడం..
మీ స్నేహితురాలు లేదా స్నేహితుడు మీకు అబద్దం చెపుతున్నారంటే వారు తప్పకుండా మీరు అడిగే ప్రశ్నలకు నో అనే సమాధానం ఇస్తారు. వారి వద్ద ఎలాంటి సమాధానం లేనప్పుడు, మీ ప్రశ్నలను దాటేయడానికి ప్రయత్నించినప్పుడు నో చెప్పారంటే వారు కచ్చితంగా అబద్దం చెప్తున్నారని గ్రహించాలట.
నత్తిగా మాట్లాడడం
అబద్దం చెప్పేటప్పుడు ఏ మనిషైనా కొంచెం భయంతోనే ఉంటాడు. ఆ భయంతో అతను చెప్పే అబద్దం, అతను పలికే మాట కచ్చితంగా మాట నత్తి పోతుంది. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు మీ భాగస్వామి నత్తితో మాట్లాడితే కచ్చితంగా అబద్దం చెప్తున్నారని గ్రహించాలని పేర్కొంటున్నారు. అలా ఆ మాటను చెప్పి మాట్లాడేది అబద్దమో, నిజమో అర్ధం చేసుకోవాలంటున్నారు.
తొందరపాటు తప్పించుకోవడం
ఎవరు, ఎప్పుడు అబద్దం చెప్పినా ఆ వ్యక్తికి అసౌకర్యంగా ఉంటుంది. అది ఒక రకమైన భయాన్ని, ఆందోళనను కలిగిస్తూ ఉంటుంది. దీని కారణంగా మీ ప్రేయసి లేదా ప్రియుడు మీకు అబద్దం చెప్పేటప్పుడు తొందరగా తప్పించుకోవాలని అనుకుంటారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. అలా మీతో కూడా ప్రవర్తిస్తే వారు కచ్చితంగా మీకు అబద్దం చెప్తున్నారని గ్రహించాలట.



Click it and Unblock the Notifications