Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఇలా బిహేవ్ చేస్తే, అబ్బాయిలకు మీపై ప్రేమ తగ్గిపోయినట్లు అర్ధం.. మీ భర్త కూడా ఇలానే చేస్తున్నారా?
ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకరినొకరు పూజించుకున్నట్టు మమకారం చూపుతారు. కానీ కాలక్రమంలో రిలేషన్‌షిప్‌లో ఉండే వ్యక్తులు ఇంకో వ్యక్తిపై ప్రేమను తగ్గించుకుంటారు. ఇలా ప్రేమ తగ్గిపోవడం వలన ఆ బంధం ముందుకు వెల్లడం చాలా కష్టం అవుతుంది. మధ్యలోనే ఆ బంధం ముక్కలైపోయి ఇద్దరూ విడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ఆ బంధంలో అబ్బాయి తప్పుకోవాలని అనుకుంటే కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటారు. ఆ సిగ్నల్స్ ఆధారంగా ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడో అమ్మాయిలు తెలుసుకుంటే తమ మనసు గాయపడకుండా.. అప్రమత్తంగా ఉండొచ్చు. అలాగే ముందుగానే వారికి తగిన గుణపాఠం చెప్పొచ్చు. అయితే అబ్బాయిలు విడిపోవాలని అనుకున్నప్పుడు ఏం ఏం సిగ్నల్స్ ఇస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. కమ్యూనికేషన్ తగ్గిపోతుంది
ఒకప్పుడు రోజులో మూడు సార్లు కాల్ చేసి మాట్లాడే వ్యక్తి, ఇప్పుడేమైనా పనిలో బిజీ అంటూ మెసేజ్‌లకే రిప్లై ఇవ్వకపోతే అది ఒక వార్నింగ్. మాట్లాడినా ఫోర్స్‌ఫుల్‌గా, ఆప్యాయత లేకుండా ఉంటుంది. అది ఆ వ్యక్తి ఇక ఈ రిలేషన్‌షిప్‌లో ఆసక్తి కోల్పోయాడని చెప్పే మొదటి సంకేతం.

2. ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది
మీరు షేర్ చేసిన భావోద్వేగాలను అర్థం చేసుకోవడం లేదా స్పందించకపోవడం, తన మనసులో ఏముంది చెప్పకపోవడం వంటివి చేయడం వలన ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది. ఇది క్రమంగా మీ నుంచి అతను దూరమైపోతున్నాడనడానికి నిదర్శనం. మీ భావాలు అతనికి సంబంధం లేని వాటిలా అనిపించడం మొదలవుతుంది. దీంతో మీ బంధం విచ్చిన్నమవుతుంది.
3. మీటింగ్‌లు, ప్లాన్లు చివరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తారు
పనిలో బిజీ అంటూ ప్లాన్లు అట్టర్ చేసి వేయడం, మీతో టైమ్ స్పెండ్ చేయడం తగ్గించడం మొదలవుతుంది. నిజంగా ప్రేమిస్తే మనం ఎంత బిజీగా ఉన్నా కనీసం కొంత సమయం కేటాయించకమానము. కానీ ప్రేమ తగ్గిపోయినప్పుడు, టైమ్ ఉండీ ఉండదన్నట్టు ఉంటారు.
4. మాటల్లో, ప్రవర్తనలో రఫ్‌నెస్ కనిపిస్తుంది
మీరు ఏ చిన్న విషయాన్ని చెప్పినా అతను వెంటనే అసహనం వ్యక్తం చేయడం, అసహ్య పడడం, మీపై సీరియస్ అవడం మొదలవుతుంది. ఇది మొదట్లో ఉండే తీపి ప్రేమలో భాగం కాదు. ప్రేమకు బదులుగా ఇబ్బంది పెడుతున్న అనుభూతి కలిగిస్తుంది.
5. శారీరక సన్నిహితత తగ్గిపోతుంది
హగ్, కిస్, చేయి పట్టుకోవడం వంటి చిన్న చిన్న ప్రేమ గుర్తులు కనిపించకపోతే, ఇది ఫిజికల్ డిస్టెన్స్‌కు సంకేతం. శారీరక స్పర్శ కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్. అది తగ్గిపోతే, బంధంలో ఉత్సాహం తగ్గిపోయిందని అర్థం.
6. మీ మార్పు ప్రయత్నాలను నిరాకరించడం
మీరు అతనిలో మార్పు కోసం ఎంత ప్రయత్నించినా, అతడిని మీరు "కంట్రోల్" చేయాలని చూసే వ్యక్తిగా కనిపించవచ్చు. అప్పుడే అతను మిమ్మల్ని రెడ్ ఫ్లాగ్‌లా చూస్తాడు. ప్రేమగా మార్పు కోరినా, అతనికి అది ఒత్తిడి లాగా అనిపించవచ్చు.
7. ఇలాంటి సిగ్నల్స్ కనిపిస్తే.. సైలెంట్‌గా ముందుకు పోవడం మంచిది
బలవంతంగా ఎవరినైనా ప్రేమించడం సాధ్యంకాదు. ఒకవేళ మీ బాయ్‌ఫ్రెండ్ ఇలా మెలగడం మొదలైతే, బాధ కలిగినా, గౌరవంగా సంబంధాన్ని ముగించుకోవడం మంచిది. మీకు విలువనిచ్చే వారు, ప్రేమించేవారు నిజంగా ప్రేమిస్తారు, పీడించరు.



Click it and Unblock the Notifications