Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వాడికి ఏదో మందు పెట్టిందిరా అది అనేలా చేసే అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ రహస్యాలు
కొన్నిసార్లు వేల పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క చిన్న సైగ చెప్పేస్తుంది. మాటలకంటే ఎక్కువగా మన శరీర భాషే మన భావాలను వ్యక్తపరుస్తుంది. ఈ చిన్న చిన్న హావభావాలే అసలైన మ్యాజిక్ చేస్తాయి. సంబంధాలలో నిజమైన ఆకర్షణకు పునాది వేసేది ఈ తీయని సైగలే. కొందరు అమ్మాయిల హావభావాలు అబ్బాయిలకు పిచ్చెక్కిస్తాయి..అబ్బాయిల మనసును వారి హావాభావాలు కట్టిపడేస్తాయి. అబ్బాయిల మనసును ఇట్టే దోచేసే అలాంటి 10 అందమైన హావభావాల గురించి ఇప్పుడు చూద్దాం.
చిలిపిగా పెదవి కొరకడం
ఒక అమ్మాయి ఆలోచిస్తూనో, సిగ్గుతోనో తన పెదవిని కొద్దిగా కొరికినప్పుడు అది అబ్బాయిలకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఈ చిన్న చర్యలో ఓ కొంటెతనం, అమాయకత్వం కలగలిపి ఉంటాయి. ఇది ఎదుటివారి దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది.

కేశాలతో కవ్వింత
అమ్మాయిల జుట్టుకు ఉండే ఆకర్షణే వేరు. చెవి వెనుకకు జుట్టును నెట్టడం: ఇది చాలా సహజంగా, సరళంగా కనిపించినా అబ్బాయిల మనసులో చెరగని ముద్ర వేస్తుంది.
పోనీటెయిల్ ను విప్పడం: కట్టి ఉన్న జుట్టును ఒక్కసారిగా విప్పి, భుజాలపై పడేలా వదిలేయడం ఏదో సినిమాలోని హీరోయిన్ సీన్ లా అనిపిస్తుంది. ఈ సహజమైన అందానికి అబ్బాయిలు ఫిదా అయిపోతారు. కింగ్ లాంటి మగాడు కూడా ఓసారి ఫ్లాట్ అవ్వాల్సిందే.
జుట్టును సవరించుకోవడం (హెయిర్ ఫ్లిక్): ముఖంపై పడుతున్న జుట్టును సున్నితంగా పక్కకు తిప్పడం అమ్మాయి ఆత్మవిశ్వాసాన్ని, శైలిని తెలియజేస్తుంది. ఇది అబ్బాయిలను బాగా ఆకర్షిస్తుంది.
చూపులతోనే బాణాలు వేయడం: కళ్ళు చెప్పే భాషకు సాటి ఏదీ లేదు.
అందమైన కన్నుగీటడం: సరదా సంభాషణలో లేదా ఓ చిలిపి జోక్ కు ప్రతిస్పందనగా అమ్మాయి కొట్టే చిన్న కన్నుగీటు ఇద్దరి మధ్య ఓ రహస్య బంధాన్ని ఏర్పరుస్తుంది.
లోతైన చూపు: ఒక్క క్షణం పాటు మాటలు లేకుండా ఒకరి కళ్లలోకి సూటిగా, ప్రేమగా చూడటం వంద మాటలతో సమానం. ఇది ఎదుటి వ్యక్తికి మీరు ప్రత్యేకం అనే భావనను కలిగిస్తుంది.
మనస్ఫూర్తిగా నవ్వడం
కల్మషం లేని, బిగ్గరగా వచ్చే నవ్వుకు పడిపోని వారు ఎవ్వరుంటారు. మీ నవ్వు ఫేక్ ది, ఆర్టిఫిషియల్ కాకుండా నిజమైనదైతే అది మీలోని ఆనందాన్ని, సానుకూలతను ప్రదర్శిస్తుంది. ఓ వెచ్చని చిరునవ్వు ఎదుటివారి మనసును ప్రశాంతపరిచి, మీతో మాట్లాడటానికి వారిని ప్రోత్సహిస్తుంది.
సున్నితమైన స్పర్శ
మాటల మధ్యలో సరదాగా అవతలి వ్యక్తి చేయి పట్టుకోవడం లేదా భుజంపై చేయి వేయడం వంటివి మీకున్న ఇష్టాన్ని, చనువును తెలియజేస్తాయి. ఈ చిన్న స్పర్శ వారికి భద్రతను, మీతో సమయం గడపడం ఆనందంగా ఉందనే సందేశాన్ని ఇస్తుంది.
ఈ హావభావాలన్నీ మీరు బలవంతంగా చేయాల్సినవి కావు. మీ వ్యక్తిత్వానికి సరిపోయేలా సహజంగా వచ్చినప్పుడే వాటికి అందం. మీరు సౌకర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మీ సహజమైన ఆకర్షణ రెట్టింపవుతుంది.



Click it and Unblock the Notifications