Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే!
వైవాహిక జీవితం ఎంత సంతోషంగా ఉన్నా, కొన్నిసార్లు ఆకర్షణ అనేది ఎవరినైనా ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక వివాహిత వేరొక పురుషుడి పట్ల ఆకర్షితురాలైనప్పుడు, ఆమె వెంటనే హద్దులు దాటి తప్పు చేయకపోవచ్చు. కానీ, ఆమె మనసులో జరిగే ఆ భావోద్వేగ సంఘర్షణ ఆమె ప్రవర్తనలో సూక్ష్మమైన మార్పులుగా బయటపడుతుంది.

ఓ నివేదిక ప్రకారం..మోసం చేయడంలో స్త్రీ, పురుషుల మధ్య స్పష్టమైన మానసిక వ్యత్యాసం ఉంటుంది. పురుషులు తరచుగా శారీరక ఆకర్షణతో తప్పు చేస్తే, మహిళలు మాత్రం భావోద్వేగ బంధం, ప్రేమ, ఆత్మీయత కోసం వెతుకుతారు. కాబట్టి ఒక మహిళ వేరొకరి వైపు చూస్తోందంటే, ఆమె తన ప్రస్తుత బంధంలో సంతోషంగా లేకపోవడం లేదా ఆ కొత్త వ్యక్తితో బలమైన మానసిక అనుబంధం ఏర్పడటం ప్రధాన కారణం కావచ్చు.
ఇటీవలి సర్వేల ప్రకారం దాదాపు 20శాతం పురుషులు, 13 శాతం మహిళలు ఏదో ఒక దశలో తమ భాగస్వామిని మోసం చేసినట్లు అంగీకరించారు. ఒకవేళ మీ భాగస్వామి మనసు దారితప్పుతోందని మీకు సందేహం ఉంటే ఈ క్రింది 9 సంకేతాలను గమనించండి.
అకారణంగా విమర్శించడం
అంతకుముందు లేని విధంగా మీలోని చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపుతూ విమర్శించడం ప్రారంభిస్తుంది. తన మనసులో ఉన్న కొత్త వ్యక్తితో మిమ్మల్ని పోల్చుకుంటూ చిరాకు పడుతుంటుంది.
భావోద్వేగ దూరం
ఆమె ఇంట్లో శారీరకంగా మీ పక్కనే ఉన్నా, మనసు మాత్రం ఎక్కడో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. మీతో మాటలు తగ్గించడం, ఎప్పుడూ తనలో తాను ఆలోచిస్తూ ఉండటం ఆమె ఆలోచనలు వేరొకరి చుట్టూ తిరుగుతున్నాయనడానికి తొలి సంకేతం.
ఫోన్ తోనే రహస్య ప్రపంచం
ఎప్పుడూ ఫోన్ లోనే గడపడం, అకస్మాత్తుగా పాస్ వర్డ్ మార్చడం, మీరు రాగానే ఫోన్ ను దాచడం లేదా బోర్లా పెట్టడం అనుమానించాల్సిన విషయాలే. ఫోన్ ను ఎప్పుడూ తన కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక ప్రమాద ఘంటిక.
కలిసి గడపడానికి సాకులు
మీతో ఏకాంతంగా గడిపే సమయాన్ని తగ్గించడం, ఇద్దరూ కలిసి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా బిజీగా ఉన్నాను లేదా అలసిపోయాను అని పదే పదే సాకులు చెబుతుంటే ఆమె వేరొకరి సాంగత్యాన్ని కోరుకుంటున్నట్లు కూడా భావించవచ్చు.
అపరాధభావం - ఆపై సమర్థన
తన మనసులోని ఆకర్షణను తలచుకుని ఆమెలో తెలియని గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో అతను కేవలం మంచి ఫ్రెండ్ మాత్రమే అంటూ తనకు తాను సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తుంది.

అలంకరణపై అకస్మాత్తుగా శ్రద్ధ
మునుపటి కంటే తన రూపంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం, తరచుగా హెయిర్ స్టైల్ మార్చడం, కొత్త పెర్ఫ్యూమ్ వాడటం, ఆకర్షణీయమైన దుస్తులు ధరించడం ప్రారంభిస్తే, ఆ అందాన్ని ఆరాధించే కొత్త వ్యక్తి ఆమె దృష్టిని ఆకర్షించారని అర్థం కావచ్చు.
దినచర్యలో ఊహించని మార్పులు
రెండు సంబంధాలను (డబుల్ లైఫ్) బ్యాలెన్స్ చేయాలంటే చాలా అప్రమత్తత అవసరం. ఈ క్రమంలో ఆమె తన రోజువారీ అలవాట్లను మార్చుకుంటుంది. మీరు కలిసి చేసే పనుల పట్ల ఆసక్తి చూపదు.
పెళ్లి ఉంగరాన్ని పక్కన పెట్టడం
అనుకోకుండా పెళ్లి లేదా నిశ్చితార్థపు ఉంగరాన్ని తీసేయడం కొన్నిసార్లు కేవలం సౌకర్యం కోసమే అయినా, మానసికంగా బంధం నుంచి దూరం అవుతున్నారనడానికి ఇదొక సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ కధనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు దృవీకరించలేదు.



Click it and Unblock the Notifications