Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మీ పిల్లలు మారాం చేస్తున్నారా? కొట్టకుండానే దారిలో పెట్టే చిట్కా
మన ఇళ్లల్లో చిన్నపిల్లలు ఉంటే వారిని కొన్ని సందర్భాల్లో డీల్ చేయడం చాలా కష్టమైపోతుంది. కొందరు అయితే వారిని డీల్ చేయలేక కొట్టడం ఒక్కటే దీనికి పరిష్కారం అని భావిస్తారు. వాస్తవానికి పిల్లలకు తమ ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు. అందుకే వాళ్లు అకారణంగా ఏడవడం, గట్టిగా అరవడం వంటివి చేస్తుంటారు. ఇది ప్రతి ఇంట్లోనూ ఉండే సహజమైన దృశ్యం. అయితే అది మొండితనం స్థాయికి చేరుకుని వారి డిమాండ్లు నెరవేరనప్పుడు పెద్దగా అరుస్తూ రచ్చ రంబోలా చేస్తున్నారా? అయితే బీ అలర్ట్. అడిగింది ఇవ్వలేదని నేలపై దొర్లుతూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే తల్లిదండ్రులుగా మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సిన సమయం ఇదే.
పిల్లల మొండితనం వారి ఎదుగుదలలో ఒక భాగమే అయినా, దానిని సరైన దారిలో పెట్టకపోతే భవిష్యత్తులో వారికే హాని చేస్తుంది. అయితే కొట్టడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ప్రేమతో కూడిన మార్గనిర్దేశనం చేయడం దీనికి పరిష్కారం. మీ ఓర్పు, ప్రేమ మీ బిడ్డకు ఉత్తమమైన మార్గాన్ని చూపుతాయి. మొండితనాన్ని అణచివేయడం కాదు, వారి భావోద్వేగాలను సరైన దారిలో పెట్టడమే మీ లక్ష్యం కావాలి. వారిని కొట్టకుండా, భయపెట్టకుండా కొన్ని సులభమైన చిట్కాలతో వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు.

-పిల్లలు కేవలం మీ దృష్టిని ఆకర్షించడం కోసమే ఉద్దేశపూర్వకంగా ఏడుస్తున్నారని మీకు అనిపిస్తే ఆ ప్రవర్తనను పూర్తిగా విస్మరించండి. మీరు ఎంత ఎక్కువగా స్పందిస్తే వారు అంత ఎక్కువగా మారాం చేస్తారు. మీరు పట్టించుకోవడం మానేసినప్పుడు తన ప్రయత్నం ఫలించడం లేదని గ్రహించి, నెమ్మదిగా ఏడుపు ఆపేస్తారు. ఇది వారిని నిరుత్సాహపరచడం కాదు, అనవసర ప్రవర్తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.
-బొమ్మల షాపుకి లేదా చాక్లెట్ల షాపు దగ్గరకు వెళ్లినప్పుడు మీ బిడ్డ మారాం చేస్తాడని మీకు ముందే తెలిస్తుంటది.. అలాంటప్పుడు వీలైనంత వరకు అలాంటి ప్రదేశాలకు వారిని తీసుకువెళ్లకపోవడమే ఉత్తమం. సమస్య వచ్చాక పరిష్కరించడం కంటే సమస్యే రాకుండా చూసుకోవడం తెలివైన పని. కాబట్టి వారిని అడిగిన ప్రదేశాన్ని తీసుకెళ్లి అడిగింది కొనివ్వడం ప్రతిసారీ చేయకండి.
-నలుగురిలో ఉన్నప్పుడు మీ బిడ్డ ఏడవడం ప్రారంభిస్త, వారిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకండి. ఆ సమయంలో వారు తీవ్రమైన భావోద్వేగానికి లోనై ఉంటారు. మీరు ఎంత ఆపాలని చూసినా, వారి మొండితనం ఇంకా పెరుగుతుంది. బదులుగా వారిని కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఎవరూ తనను పట్టించుకోవడం లేదని గ్రహించాక వారే నెమ్మదిగా శాంతిస్తారు.

-పిల్లలు అడిగినవన్నీ వెంటనే కొనివ్వకండి. అలా చేయడం వల్ల ప్రతి కోరిక తీరాలనే తత్వం వారిలో పెరుగుతుంది. బదులుగా వారికి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించండి. ఈ వారం హోంవర్క్ సరిగ్గా పూర్తి చేస్తే నీకు ఆ బొమ్మ కొనిస్తాను వంటి షరతులు పెట్టండి. దీనివల్ల ఓపిక, బాధ్యత అలవడతాయి.
-పిల్లల శక్తి అపారం. దానిని సరైన దారిలో పెట్టకపోతే అది మొండితనం రూపంలో బయటకు వస్తుంది. వారిని డ్రాయింగ్, ఆటలు, పాటలు వంటి క్రియేటివ్ కార్యకలాపాలలో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించండి. తోటి పిల్లలతో కలిసి ఆడుకునే అవకాశాలు కల్పించండి. దీనివల్ల పంచుకోవడం, సర్దుకుపోవడం వంటి సామాజిక నైపుణ్యాలు పెరిగి వారి మొండితనం సహజంగానే తగ్గుముఖం పడుతుంది.



Click it and Unblock the Notifications