Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
సీఈవో,హెచ్ఆర్ రొమాన్స్ వీడియో వైరల్..ఆఫీసులో సహోద్యోగితో ఎఫైర్ బయటపడితే ఏం చేయాలి?
మీరు ఒక మంచి మ్యూజిక్ కచేరీలో మైమర్చిపోయి హాయిగా ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు. చుట్టూ వేల మంది జనం మధ్యలో నచ్చిన పాట వింటూ రిలాక్స్ అవుతున్నారు. సెడన్ గా స్టేడియంలోని పెద్ద స్క్రీన్ పై కెమెరా మీ వైపు తిరిగింది. ఆ సమయంలో మీ పక్కన, మీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా కెమెరా కంటికి చిక్కారు. కానీ అసలు సమస్య ఇక్కడ కాదు. మీ ఇద్దరి సంబంధం ప్రపంచానికి తెలియనిది అయితే, మీ ఎఫైర్ విషయం తెలియని మీ భాగస్వామి అదే జనసమూహంలో ఎక్కడో ఒకచోట కూర్చుని ఉన్నారు. ఊహించుకుంటేనే గుండెల్లో దడ పుడుతోంది కదూ? ఇదే ఘటన ఇటీవల అమెరికా దేశంలోని మసాచుసెట్స్ లో జరిగిన ప్రఖ్యాత కోల్డ్ ప్లే సంగీత కచేరీలో నిజంగా జరిగింది.
అక్కడ ఒక జంట ఎంతో అన్యోన్యంగా ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీరా ఆరా తీస్తే వారిద్దరూ భార్యాభర్తలే కానీ, ఒకరికొకరు కాదు. ఆ జంట ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైరాన్, అదే కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్. ఈ ఒక్క సంఘటన ఆఫీసు వ్యవహారాల చీకటి కోణాన్ని మరోసారి ప్రపంచం ముందుంచింది. ఆఫీసు ప్రేమకథ బయటపడినప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే నైతికత విలువల పరంగా చూస్తే ఇలాంటి బంధాలు కంపెనీ ప్రతిష్టకే కాకుండా కుటుంబ గౌరవానికి కూడా మాయని మచ్చ తెస్తాయి. ఒక్క పొరపాటుతో కెరీర్, కుటుంబం, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఒక్కసారిగా ప్రమాదంలో పడతాయి.

ఆఫీసులో ప్రేమ ఎందుకు పుడుతుంది?
పని ప్రదేశంలో ఎఫైర్లు పుట్టడానికి చాలా బలమైన కారణాలున్నాయి. రోజువారీ సమావేశాలు, గంటల తరబడి కలిసి వర్క్ చేయడం, ఒకే లక్ష్యాలు, ఒకే రకమైన ఒత్తిడిని పంచుకోవడం వంటివి సహోద్యోగుల మధ్య బలమైన సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ఈ క్రమం, నెమ్మదిగా వ్యక్తిగత బంధంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా ఇప్పటికే వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ సాన్నిహిత్యం ఓ కొత్త బంధానికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.
ఆఫీస్ ప్రేమ వ్యవహారం బయటపడితే ఏం చేయాలి?
నిజాన్ని ఎదుర్కోండి
రహస్య సంబంధం అకస్మాత్తుగా బయటపడటం ఎవరికైనా దిగ్భ్రాంతికరమే. ఆ పరిస్థితుల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సోషల్ మీడియాలోనో, ఆఫీసు గుసగుసల్లోనో జనాలు మాట్లాడుకుంటారు. కానీ ఆవేశపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకొని స్పందించే ముందు ఆలోచించడానికి సమయం తీసుకోండి.
జీవిత భాగస్వామికి నిజం చెప్పండి
మీరు వివాహితులై ఉండి విషయం బయటపడితే దాన్ని ఇకపై దాచిపెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది అత్యంత కఠినమైన పనే అయినా, ధైర్యం చేసి నిజాన్ని అంగీకరించండి. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరి బంధాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.

హెచ్ ఆర్ తో మాట్లాడి నియమాలు తెలుసుకోండి
చాలా కంపెనీలకు ఆఫీస్ రొమాన్స్ పై స్పష్టమైన విధానాలు ఉంటాయి. విషయం బయటపడినప్పుడు కంపెనీ హెచ్ ఆర్ తో నిజాయితీగా మాట్లాడండి. మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం కన్నా వాస్తవాన్ని అంగీకరించి ముందుకు సాగడం ఉత్తమం. ఆఫీసు వ్యవహారాలు మీ కెరీర్ ను ప్రభావితం చేస్తాయి, కానీ సరైన నిర్వహణతో నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు.
నిపుణుల సహాయం తీసుకోండి
కుటుంబ సలహాదారు లేదా మ్యారేజ్ థెరపిస్ట్ సహాయం తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. వృత్తిపరమైన సహాయం దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వృత్తి, వ్యక్తిగత జీవితాలను వేరుగా ఉంచండి
ఒకవేళ మీరు ఆ సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటే ఇద్దరూ ఒకే కంపెనీలో, ఒకే విభాగంలో పనిచేయడం సరికాదు. మీలో ఒకరు విభాగాన్ని మార్చుకోవడం, బదిలీపై వెళ్లడం లేదా ఉద్యోగం మారడం వంటివి తెలివైన నిర్ణయాలు. ఇది మీ కెరీర్ ను, బంధం యొక్క గౌరవాన్ని కాపాడుతుంది.
కంపెనీలు ఎందుకు కఠినంగా వ్యవహరిస్తాయి?
సీనియర్ స్థాయి ఉద్యోగుల మధ్య ఇలాంటి వ్యవహారాలు బయటపడితే అది కంపెనీ నైతిక విలువలపై, వర్క్ కల్చర్ పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది టీమ్ లో పక్షపాతానికి, అసమానతలకు దారితీయవచ్చు. నిర్ణయాలు వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ప్రభావితం కావచ్చు. దీర్ఘకాలంలో ఇది కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది.



Click it and Unblock the Notifications











