Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పిల్లలు పుట్టిన తరువాత మీ భార్యతో దూరం పెరిగిందా? ఈ పని చేయండి, మీ చుట్టే తిరుగుతుంది
పెళ్లి తరువాత భార్య, భర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. అదే ఓ బాబో, పాపో పుట్టిన తరువాత వారి మధ్య కొంచెం గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ ఎన్నో అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో విడాకుల వరకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలు పుట్టగానే వారిపై ఎక్కువగా ప్రేమ చూపించడం, వారితో ఉండడం వలన వీరి మధ్య దూరం అనేది పెరుగుతుంది. అందుకే అలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరువురిపై ఉంటుంది. ఇద్దరి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విషయాలను పట్టించుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బహుమతులు ఇచ్చుకోవడం..
సాధారణంగా పిల్లలు పుట్టిన తరువాత భార్య, భర్త మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరాన్ని తగ్గించుకునేందుకు ఇరువురూ అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా బహుమతులు ఇచ్చుకుంటూ సర్‌ప్రైజ్ చేసుకోవాలి. దీని వలన ఇరువురి మధ్య బంధం బలపడుతుంది. అలాగే పిల్లల కారణంగా ఏర్పడిన దూరం కూడా తగ్గిపోతుంది. మీకు ఎప్పుడైనా మీ భార్యతో లేదా భర్తతో దూరం పెరిగిందని అనిపిస్తే బహుమతులు ఇచ్చి ట్రై చేయండి.. కచ్చితంగా మీ బంధం బలపడుతుంది.

ఒకరినొకరు సాయంగా..
భార్య, భర్త మధ్య బంధం బలపడాలంటే వంటగది ఒక గొప్ప ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య బంధం బలంగా ఉండాలంటే వంటగదిలో ఒకరినొకరు సాయంగా పనులు చేసుకోవాలి. పిల్లల పనులతో పాటు వంట పనులు, ఇంటి పనులు కూడా చేసుకోవడం వలన ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దీని కారణంగా ఇద్దరూ ఎంతో ప్రేమగా మెలుగుతారు.
మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి..
పిల్లలు పుట్టిన తరువాత అందరి ప్రేమ, ఆప్యాయత పిల్లలపై చూపిస్తుంటారు. తమను తాము పట్టించుకోవడమే మానేస్తారు. అలా కాకుండా పిల్లలను ప్రేమిస్తుంటే మీ గురించి కూడా మీరు పట్టించుకోవాలి. మీరు సరిగ్గానే ఉంటున్నారా? మీ భాగస్వామితో ఎలాంటి బంధాన్ని కలిగి ఉన్నారు, అనేది ఆలోచన చేసుకొని ముందుకు సాగాలి. అప్పుడు పిల్లల పైన ప్రేమ అలానే ఉండడంతో పాటు మీ బంధం కూడా బలపడుతుంది.
అకేషన్లకు వెళ్ళండి..
పిల్లలు పుట్టిన తరువాత భార్య, భర్తలకు ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు సమయం దొరకడం చాలా కష్టంగా మారుతుంటుంది. ఎప్పుడో వారి బాగోగులు చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరూ ఎంతో ప్రేమగా, ఆప్యాయతంగా మాట్లాడుకునేందుకు ఏదైనా అకేషన్లకు వెళ్లడం మంచిది. అక్కడ భార్య భర్తలిద్దరూ ప్రత్యేకంగా ఆప్యాయంగా మాట్లాడుకోవడం వలన వారి మధ్య దూరం తగ్గిపోతుంది. ఈ పనులు చేయడం వలన.. పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇద్దరి మధ్య దూరం పెరగకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications