Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
ఈ టిప్స్‌తో అత్తా కోడళ్ల పంచాయితీని అయిదు నిమిషాల్లో ఆపేయొచ్చు.. ఇల్లంతా ప్రశాంతత!
పురాణాల నాటి నుంచి ఇప్పటి వరకూ మారని వ్యవహారం ఏదైనా ఉందంటే అది అత్తా కోడళ్ల పంచాయతీ మాత్రమే. ఎన్ని తరాలు మారినా, ఎంత చదువులు చదువుకున్నా.. అత్త అంటే అధికారమే, కోడలు అంటే స్వాతంత్రమే అనే భావన ఇంకా పోయినట్టే లేదు. ఒకరి మాట ఇంకొకరికి ఒప్పనట్టుండటం, ఇల్లు చిన్నచిన్న మనస్పర్ధలతో పెద్ద కురుక్షేత్రమవడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం.
మాటలు ఉండవు, కనీస సహనసంపత్తి లేకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలగా దారి తీస్తాయి. ఈ పరిస్థితి లోతుగా చూసినప్పుడు, తరాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇంట్లో ఆడవాళ్లు కేవలం ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మగవాళ్లు, ఆడవాళ్లు అందరూ కలిసి పని చేయడం, ఉద్యోగం చేయడం సాధారణమైంది. దీని కారణంగా అత్తల మీద కోడళ్ళు, కోడళ్ల మీద అత్తల పెత్తనం పెరిగిపోతుంది. తానే గొప్ప అంటే తానే గొప్ప అని చెప్పుకోవడం, తన మాట చెల్లాలంటే, తన మాట చెల్లాలని గొడవలాడుతూ ఉంటారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే అత్త కోడళ్ల పంచాయితిని సులభంగా పరిష్కరించుకోవచ్చట. ఎంత పెద్ద గొడవ అయినా సులభంగా సరిదిద్దోచ్చట. ఆ టిప్స్ ఏంటి? ఏ విధంగా వాటిని అమలు చేస్తే అత్త కోడళ్ల మధ్య మనస్పర్థలు తొలిగిపోతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. ప్రత్యేక దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడం
అత్త కోడలు చెప్పే మాటల్లో భావం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆమె పెరిగిన వాతావరణం, చదువు, జీవనశైలి వేరు. అవి గౌరవించగలిగితే అనేక విభేదాలకు అడ్డుకట్ట పడుతుంది. కేవలం "నాకు ఇష్టం" అనే కోణంలో కాకుండా, "ఆమె కోణం ఏమిటి?" అనే దృష్టితో చూడాలి.
2. సంవాదానికి చోటివ్వాలి
ఒకరిపై ఒకరికి కోపం ఉన్నా, దానికి కారణమేంటో తెలుసుకోవాలి. మాట్లాడుకోవడం వల్లే అసలు సమస్యలు ఏమిటో తెలిసి పరిష్కార మార్గాలు కనపడతాయి. తలవంచి వినడం కాదు - గౌరవంతో స్పందించడమే ముఖ్యమయినది.
3. ఇగోకు బదులుగా ఓర్పు
నిజమైన సమస్యల్ని తేల్చడానికి 'నేనే చెప్పాలి' అనే తలపుతో కాదు, 'మన ఇద్దరికీ శాంతి కావాలి' అనే ఆలోచనతో ముందుకు రావాలి. ఇగో మధ్య ఉండి పోతే పరిష్కారానికి అవకాశం ఉండదు.
4. తీర్మానాలకు గౌరవం ఇవ్వాలి
కొంతమంది కోడలికి స్వతంత్రంగా జీవించాలని ఉంటుంది. ఆమె తీసుకునే నిర్ణయాలను అర్థం చేసుకుని మద్దతు ఇవ్వడం వల్ల సంబంధం బలపడుతుంది. అదీ కాకుండా, ఆర్థికంగా, భావోద్వేగంగా అండగా ఉండే ప్రయత్నం చేయాలి.
5. తప్పులపై పదే పదే ఫోకస్ చేయకండి
రోజూ కోడలిని తప్పుపట్టడం వల్ల సంబంధంలో గొడవలు రావడంతో పాటు కమ్యూనికేషన్ తగ్గుతుంది. "నాకు అలవాటైందిగా" అని నెత్తిన వేసుకోకుండా, నిన్ను నీవు మార్చుకునే ప్రయత్నం చేయాలి. సానుకూల దృక్పథం పెంచుకుంటే ఇల్లు క్షణాల్లో ప్రశాంతతతో నిండిపోతుంది.
చివరగా..
ఇంట్లో శాంతి ఒకరి కృషితో సాధ్యపడదు. అత్త-కోడలు ఇద్దరూ పథకం వేసుకుని, అహంకారాన్ని దూరంగా పెట్టి, పరస్పరం గౌరవించే శైలిని పెంపొందించుకుంటేనే ఇంట్లో నిజమైన ఆనందం స్థిరపడుతుంది. ఒకరిపై ప్రేమ, మరొకరిపై గౌరవం.. ఇవే మామూలు గొడవలకు శాశ్వత పరిష్కారం.



Click it and Unblock the Notifications
