Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
పచ్చని సంసారంలో నిప్పులు..అత్తతో ఎన్నటికీ కోడలు అనకూడని 5 మాటలు
ఏ ఇంట్లో అయినా చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయభేదాలు చాలా సర్వసాధారణం. ఇక అత్తా కోడల్ల మధ్య అయితే ఇది చాలా కామన్. తరాల అంతరం, విభిన్న ఆలోచనా విధానాల వల్ల అత్తాకోడల్ల మధ్య కొన్నిసార్లు దూరం పెరుగుతుంది. అయితే ఈ దూరం పెరగడానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. కేవలం కొన్ని పదునైన మాటలు చాలు, పచ్చని సంసారంలో నిప్పులు పోయడానికి. కోడలు కాస్త ఓపికతో, అవగాహనతో మాట్లాడితే అత్తగారి మనసును సులభంగా గెలుచుకోవచ్చు. బంధంలో చిచ్చు పెట్టే కొన్ని మాటలకు దూరంగా ఉంటే ఆ ఇల్లు నందనవనంగా మారుతుంది. అత్తగారితో ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడని ఆ మాటలేంటో ఇక్కడ చూడండి.
మా దాంపత్యంలో జోక్యం చేసుకోకండి
మీ అత్తగారు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తి. ఆమె అనుభవంతో ఏదైనా సలహా ఇస్తే అది మీ మంచికేనని భావించి ప్రేమగా వినండి. దాన్ని పాటించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. అంతేకానీ మా జీవితంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని ముఖం మీదే చెప్పేస్తే ఆమె మనసు తీవ్రంగా గాయపడుతుంది. తనను పరాయి వ్యక్తిగా చూస్తున్నారనే బాధ ఆమెను కుంగదీస్తుంది. ఇది బంధంలో మొదటి పగులుకు కారణం కావచ్చు.

మీరిచ్చిన బహుమతి నాకు నచ్చలేదు
బహుమతి విలువ దాని వెలలో కాదు దాని వెనుక ఉన్న ప్రేమలో ఉంటుంది. అత్తగారు ఎంతో ఇష్టంతో మీకోసం ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు దానిని ఆనందంగా స్వీకరించండి. ఒకవేళ అది మీకు నచ్చకపోయినా ఆ విషయాన్ని బయటపెట్టకండి. ఈ చీర బాగాలేదు లేదా ఇలాంటివి నాకు నచ్చవు అని చెప్పడం, ఆమె ప్రేమను తిరస్కరించినట్లే. ఇది మీ మధ్య అపార్థాలకు, అనవసరమైన వాదనలకు దారి తీస్తుంది.
మీరు నా కన్నతల్లి కాదు కదా
కోపంలో మనిషి విచక్షణ కోల్పోతారు. ఆవేశంలో అత్తగారితో నన్ను అనడానికి మీరేమైనా నా కన్నతల్లా? అనే మాట అంటే అది బంధాన్ని దెబ్బతీస్తుంది. ఆమె మీ కన్నతల్లి కాకపోవచ్చు, కానీ మీ జీవిత భాగస్వామికి జన్మనిచ్చిన తల్లి. ఆ స్థానానికి గౌరవం ఇవ్వడం మీ బాధ్యత. ఈ మాట ఆమె హృదయాన్ని ముక్కలు చేస్తుంది.
నన్ను అదుపులో పెట్టాలని చూడకండి
మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా అత్తగారు ప్రశ్నలు అడుగుతుంటే అది మిమ్మల్ని నియంత్రించాలని కాదు.. మీపై ఉన్న ప్రేమ, బాధ్యతతో కావచ్చు. దానికి చిరాకుపడి ఇది నా జీవితం, నన్ను కంట్రోల్ చేయకండి అని సమాధానం ఇస్తే ఆమె మీపై చూపిస్తున్న ఆసక్తిని మీరు అగౌరవపరిచినట్లు అవుతుంది. ఆమె ఆందోళనను అర్థం చేసుకుని, ప్రశాంతంగా సమాధానం చెప్పడం ఉత్తమం.
మా పిల్లల విషయంలో జోక్యం వద్దు
అమ్మమ్మగా, నానమ్మగా పిల్లల పెంపకంలో అత్తగారికి అపారమైన అనుభవం ఉంటుంది. వారు మీ పిల్లల గురించి ఏమైనా సలహాలు ఇస్తే వాటిని సావధానంగా వినండి. మీరు మీ బిడ్డను దండించినప్పుడు ఆమె వారిస్తే నా బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలుసు, మీరు జోక్యం చేసుకోకండి అని కఠినంగా మాట్లాడకండి. ఇది ఆమె అనుభవాన్ని అవమానించడమే కాక ఆమెకు తన మనవళ్లు లేదా మనవరాళ్లతో ఉన్న బంధాన్ని కూడా దెబ్బతీస్తుంది.



Click it and Unblock the Notifications