Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
మీ జీవితాన్ని మార్చేసే 3L టెక్నిక్.. దీనికి తిరుగులేదు
ఆధునిక ప్రపంచంలో స్త్రీ పాత్ర బహుముఖంగా మారింది. ఇల్లు, ఉద్యోగం, పిల్లలు, కుటుంబ బాధ్యతలు అంటూ నిరంతరం ఒక చక్రంలో తిరుగుతూ అందరి బాగోగులు చూసుకునే క్రమంలో తమ గురించి తాము ఆలోచించుకోవడమే మర్చిపోతున్నారు. ఈ ఒత్తిడి వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, సైకాలజిస్ట్ విజయ పెద్దిన తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా మహిళలకు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు. అదే 3L టెక్నిక్. ఈ మూడు సూత్రాలను పాటిస్తే ప్రతి అమ్మాయి జీవితం మరింత ఆనందంగా, ప్రశాంతంగా మారుతుందని ఆమె భరోసా ఇస్తున్నారు.
లవ్ యువర్ సెల్ఫ్(love yourself)
ఏ ఇంటికి అయినా స్త్రీ వెన్నుముక లాంటిది. స్త్రీ.. పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు.. ఇలా అందరి సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. అయితే ఈ నిస్వార్థమైన త్యాగంలో తనని తాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. తన ఇష్టాలు, అభిరుచులు, ఆరోగ్యం గురించి మర్చిపోతారు. దీనివల్ల కాలక్రమేణా నీరసం, నిరాశ ఆవహిస్తాయి. విజయ పెద్దిన చెప్పినదాని ప్రకారం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్వార్థం కాదు, అది మీ మానసిక ఆరోగ్యానికి అత్యవసరం. మీ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని, మీకు నచ్చించి చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించాలని విజయ చెబుతున్నారు. నచ్చిన పుస్తకం చదవడం, ఇష్టమైన పాటలు వినడం, చిన్నపాటి వాకింగ్ కు వెళ్లడం లేదా ఏదైనా కొత్త హాబీని నేర్చుకోవడం వంటివి చేయాలి.

లివ్ ఇన్ ది ప్రజెంట్(live in the present)
చాలాసార్లు ఆడవాళ్లు అతిగా ఆలోచిస్తుంటారని,గతం గురించి కానీ లేదా తమ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారని విజయ చెప్పారు. అప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది అనో, రేపు ఏం జరుగుతుందో అనో ఆలోచిస్తూ, కళ్ల ముందు ఉన్న అందమైన వర్తమానాన్ని ఆస్వాదించడం మర్చిపోతారు. ఎప్పుడూ గతంలోలోనో, భవిష్యత్తులోనో ఉండి బాధపడుతూనో,ఆందోళనపడుతూనో కాకుండా ఈ రోజుని ఎలా అద్భుతంగా మలుచుకోవాలనేదానిపై దృష్టిపెట్టి ప్రస్తుతంలో జీవించాలని విజయ సూచించారు. ఈ రోజును, ఈ క్షణాన్ని ఎలా అద్భుతంగా మలుచుకోవాలనే దానిపై దృష్టి పెడితే అనవసరమైన ఆందోళనలు, ఒత్తిడి వాటంతట అవే దూరమవుతాయి.
లివ్ విత్ గ్రాటిట్యూట్ అండ్ జాయ్(live with gratitude and joy)
మనస్తత్వశాస్త్రం ప్రకారం కృతజ్ఞతాభావం ఆనందానికి రాజమార్గం. చాలాసార్లు మన జీవితంలో ఏం లేదు అనే దాని గురించే ఎక్కువగా ఆలోచించి బాధపడతాం. కానీ ఏం ఉంది అనేదాన్ని గుర్తించం. జీవితంలో మీకు ఏది ఉందో చూస్తూ వాటిని గమనించి గుర్తించి ఆనందించాలని విజయ చెప్పారు.ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఆ రోజు మీకు ఆనందాన్నిచ్చిన మూడు విషయాలను గుర్తుచేసుకొని దేవుడికి, ప్రకృతికి ధన్యవాదాలు చెప్పండి. అది మీ పిల్లల నవ్వు కావచ్చు, భాగస్వామి అందించిన సహాయం కావచ్చు లేదా మీరు రుచిగా వండిన వంట కావచ్చు. ఏం లేదో వెతుక్కొని బాధపడకుండా ఉన్నదాంతో సంతృప్తి చెంది మీరు గ్రేట్ ఫుల్ గా ఫీల్ అయితే జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ప్రతికూల ఆలోచనలు తగ్గి జీవితం అద్భుతంగా, ఆనందమయంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications