Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఐదు ప్రయోజనాలు ఏంటో తెలుసా?
మన దేశంలో ఇరవయ్యేళ్లు దాటాయంటే చాలు ప్రతీ ఒక్కరూ పెళ్లెప్పుడు, పెళ్లెప్పుడూ అని అడుగుతూనే ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు.. ఇలా ప్రతీ ఒక్కరూ కనిపించిన ప్రతీసారి పెళ్లి టాపిక్ లేవనెత్తుతారు. ముఖ్యంగా చాలా చోట్లు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు రాగానే.. పెళ్లి ఒత్తిడి మొదలవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది సర్వసాధారణం. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు సరైన సమయంలో పెళ్లి చేయాలని కోరుకుంటారు. అందుకే ఇంతలా ఒత్తడి చేస్తారు.
పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది చాలా వ్యక్తిగతమైన విషయం. అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు వారు ముందడుగు వేయాలి. ఇతరుల ఒత్తిడితో అస్సలే పెళ్లి చేసుకోకూడదు. కానీ అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోకపోవడం వల్ల చాలా మంది జీవితంలో, ఇంట్లో సమస్యలు మొదలవుతాయి.

ఎందుకంటే ఆలస్యంగా పెళ్లి చేసుకునే వారికి ఇంకేదో లోటు ఉంటుందని అంతా అనుమాన పడుతుంటారు. అయితే ఎవరో ఒకరిని తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే సరైన వ్యక్తిని ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేటు వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్వతంత్రంగా జీవించే అవకాశం:
ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరి జీవితం వారికి అర్థం అవ్వడానికి, వ్యక్తి స్వతంత్రంగా జీవించడానికి ఇది అవకాశం ఇస్తుంది. లేటుగా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎవర్ని వారు బాగా అర్థం చేసుకోగలరు. అలస్యంగా పెళ్లి చేసుకుంటే.. అప్పటికే మీ కలలను నెరవేర్చుకోవడానికి మీకు వీలు ఉంటుంది. కెరియర్ తో పాటు మీకు నచ్చిన జీవితాన్ని సెట్ చేసుకోవచ్చు. కానీ కుటుంబ సభ్యులఒ ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవడం ద్వారా స్వేచ్ఛా జీవితాన్ని గడపలేరు. బరువు, బాధ్యతలతోనే జీవితం అంతా గడిచిపోతుంది.
2. ఆర్థిక భద్రత:
ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారిలో చాలా మంది ఆర్థికంగా బలంగా ఉంటారు. వారి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. మరోవైపు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న వారు ఆర్థికంగా బలపడలేరు. ఎందుకంటే కెరియర్ ప్రారంభంలోనే అనేక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఇటు కెరియర్ పై, అటు కుటుంబంపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతాడు. కాబట్టి ఆర్థికంగా బలపడిన తర్వాతే పెళ్లి చేసుకోండి. అప్పుడే జీవితాన్ని హాయిగా గడపచ్చు.
3. బంధంలో నిజాయితీ:
కాలంతో పాటు మనిషి ఆలోచనా విధానం మారుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 20 ఏళ్ల వయసులో నచ్చినవి 40 ఏళ్ల వయసులో నచ్చకపోవచ్చు. అయితే ఒక నిర్దిష్ట వయస్సులో మీరు మీ జీవితాన్ని తీవ్రంగా పరిగణించడం ప్రారంభిస్తారు. సరైన జీవిత భాగస్వామి కోసం చాలా మంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఓర్పు, కష్టపడే తత్వం ఉన్న భాగస్వామిని ఎంచుకుంటే మీ జీవితం సుఖమయం అవుతుంది. కష్టానికి తగ్గ ఫలాలు శాశ్వతంగా నిలుస్తాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అదే వివాహానికి వర్తిస్తుంది. ఆలస్యంగా వివాహం చేసుకున్న వారి మధ్య సంబంధంలో నిజాయితీ మరియు బలం ఎల్లప్పుడూ ఉంటాయి.
4. బాధ్యత భావం
కొందరు వయస్సును బట్టి కాకుండా సమయాన్ని బట్టి బాధ్యతను గుర్తిస్తారు. అటువంటి పరిస్థితిలో కాలక్రమేణా పొందిన జ్ఞానంతో మీ భవిష్యత్తు, వృత్తి గురించి ఆలోచించడానికి మీకు తగినంత సమయం ఉంటుంది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వారి కంటే కూడా ఆలస్యంగా వివాహం చేసుకున్న వారికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. లేటు వయసులో పెళ్లి చేసుకున్న జంటలకు తమ బాధ్యతతో పాటు ప్రాధాన్యతలు బాగా అర్థం అవుతాయి. ఇలా వారి బంధం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆలస్యంగా వివాహం చేసుకున్న వ్యక్తులు మానసికంగా స్థిరంగా ఉంటారు. అలాంటి దంపతుల మధ్య ఒత్తిడి, సమస్యలు తగ్గుతాయి.
5. మెరుగైన లైంగిక జీవితం
ఇతరుల ఒత్తిడికి తలొగ్గి తొందరపడి పెళ్లి చేసుకుంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది తొందరపడి తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మీరు చూసి ఉంటారు. ఫలితంగా వారి సంకల్ప శక్తి బాగా తగ్గిపోతుంది. మరోవైపు సహనంతో భాగస్వామిని ఎంచుకుంటే మంచి భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కోరుకున్న భాగస్వామితో మంచి సెక్స్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మీ లైంగిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











