Latest Updates
-
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా?
పోట్లాటలో పోటీ పడితే మీ సంసారం సర్వనాశనం, తగ్గేదేలే అంటే తగలబడిపోతుంది
కోపంతో మాట్లాడటం చాలా సులభం కానీ దాన్ని దంపతుల జీవితాన్ని సరిదిద్దడం చాలా కష్టం. దంపతులు మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. సందర్భంతో సంబంధం లేకుండా ఉపయోగించే కొన్ని పదాలు, దాంపత్యంలో చీలికలు సృష్టించడం ప్రముఖ పాత్ర పోషిస్తాయి అని చాలా మంది దంపతులు గుర్తించలేకపోవడంతో వారి సంసారం సర్వనాశనం కావడానికి కారణం అవుతుంది .
ఉదయం నుంచి రాత్రి వరకు
చాలా మంది దంపతులు ఉదయం నుంచి నిద్రపోయే వరకు గొడవ పడతారని ఓ సామెత ఉంది. కొన్నిసార్లు కోపంతో దంపతుల మద్య జరిగే మాటలు యుద్దం వారి సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు కోపం, ద్వేషం, లింగభేదం మొదలైన కారణాల వల్ల భాగస్వామిని నొప్పించేలా కొన్ని పదాలు ఉపయోగిస్తుంటారు. కాబట్టి మీరు ఎక్కువగా ప్రేమించే భార్య అయినా, భర్త అయినా కొన్ని మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది.

నీతో కలిసి జీవించలేను
చాలా మంది చిన్న చిన్న గొడవలకు చాలా పెద్దపెద్ద మాటలు ఉపయోగిస్తారు. ఇది మీ భాగస్వామి హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇలాంటి మాటల వలన ఎదుటి వ్యక్తి కఠినంగా ఉండటమే కాకుండా తన భాగస్వామి తనను ప్రేమించలేదని కూడా అనిపిస్తుంది. గొడవలు జరిగిన సమయంలో ఎలాంటి పరిస్థితిలో నీతో కలిసి జీవించడం కంటే చచ్చిపోవడం మంచిది, నీతో విడిపోవడం మంచిది లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడితే వారి సంసారంలో చీకలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి మాటలు మాట్లాడకపోవడం మీకే మంచిది.
నా మాట ఎందుకు వినరు
మీరు చెప్పేది మీ భాగస్వామి వినకపోయినా పర్వాలేదు, ఆ సమయంలో వాదన జరిగినా పర్వాలేదు, ఆ సమయంలో నా మాట నువ్వు ఎందుకు వినవు అనే పదాన్ని ఉపయోగించడం అనవసరం. ఇలాంటి మాటలు మాట్లాడితే దంపతుల మధ్య కమ్యూనికేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. గొడవ జరిగిన సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడకుండా గతంలో జరిగిన గొడవలు మరచిపోవడం మంచిది. మీ జీవిత భాగస్వామి చాలా కోపంగా ఉన్నప్పుడు నా మాట నువ్వు ఎందుకు వినవు అనే పదాన్ని పదేపదే మాట్లాడటం వలన ఇంకా ఎక్కువ గొడవలకు దారి తీస్తుంది. కాబట్టి దంపతులు శాంతియుతంగా ఉంటూ ఈ మాట గురించి మాట్లాడుకోవడం మీకే మంచిది.
మీరు చాలా స్వార్థపరులు
మీ భాగస్వామి నిజంగా స్వార్థపరుడే అయినప్పటికీ, కోపంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగించవద్దు. ఇది మీ సంబంధాన్ని విచ్చిన్నం చేసి ఒకరిని ఒకరికి దూరం చెయ్యడమే కాకుండా ఉద్రిక్తతలను సృష్టిస్తుంది. ఇది మీ సంబంధంలో చీలికలను సృష్టిస్తుంది. వీలైనంత వరకు మీ జీవిత భాగస్వామితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను కలిపి మీరు చాలా స్వార్థపరులు అని మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని గుర్తు పెట్టుకోండి.
మీరు జీవితంలో మారారు:
మీలో మార్పు ఎప్పటికీ శాశ్వతం కాదని సాధారణంగా దంపతులు గ్రహించాలి. పెళ్లి తర్వాత ఒకరి మీద ప్రేమ ఒకరి జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. అంతేకాక, ఒక వ్యక్తి అన్ని విషయాలలో సమానంగా స్థిరంగా ఉండడు. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కాని అపార్థం చేసుకుంటే మీ సంసారం సర్వనాశనం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications