Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.!
డిజిటల్ యుగంలో రిలేషన్‌షిప్ ఏర్పడే విధానం మారుతోంది. సోషల్ మీడియాలో పరిచయాలు క్రమంగా ప్రేమగా మారి సరికొత్త బంధానికి దారితీస్తున్నాయి. అయితే కొన్ని బంధాలు విచ్ఛిన్నం అవుతుండగా.. మరికొన్ని మొదట్లో బాగుండి తర్వాత విడిపోయే వరకూ వెళుతున్నాయి. ఈ క్రమంలో అసలు సోషల్ మీడియాలో దొరికే ప్రేమ నిజంగా వాస్తవమేనా.. నమ్మవచ్చా అనే సందేహం ఈ కాలం యువతలో తలెత్తుతోంది.

సోషల్ మీడియాలో బంధాలు నిజమా కాదా అనే దానిపై సమాధానం అంత సులభంగా ఉండదు. ఏ బంధానికైనా ఇద్దరి మధ్య నిజాయతీ, గౌరవం, నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఆ మూడు ఎలా ఉన్నాయి.. వాటి కోసం ఇద్దరూ ఎంత సమయం కేటాయిస్తారు అనేదానిపైనే ఆ బంధం అనేది ఆధారపడి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్ష్యంగా కలిసినప్పుడు వారి గురించి కొంత అవగాహన వస్తుంది. కానీ ఆన్‌లైన్ పరిచయాల్లో అవతలి వ్యక్తి గుర్తింపు, ఉద్దేశాలు, ప్రవర్తన అర్థం చేసుకోవడం చాలా సవాలుగా ఉంటుంది. అందుకే ఏ రిలేషన్‌షిప్ గురించి అయినా తెలుసుకోవడానికి, కొనసాగించడానికి తొందరపాటు పనికిరాదు. వాస్తవాలు తెలుసుకోవడం కోసం చాలా విషయాలు, జాగ్రత్తలు పాటించాలి.
నమ్మకానికి సంకేతాలు
మీరు సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్ ద్వారా రిలేషన్‌షిప్‌ను కొనసాగించాలనుకుంటే కొన్ని సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఆన్‌లైన్ రిలేషన్‌షిప్ నిజం కాదు.. అలా అని ఫేక్ కాదు. ఆ వ్యక్తితో సంభాషణలో కొన్ని సంకేతాలు నిజాయతీని తెలియజేస్తాయి. ఆ వ్యక్తి తన గుర్తింపును మొదటి పరిచయంలోనే మీకు తెలియజేయడం, సంభాషణలో గౌరవప్రదంగా, స్థిరంగా ఉండటం, హద్దులను పాటించడం, పబ్లిక్‌లో కలవడానికి ఇబ్బంది పడకపోవడం వంటివి ఆ వ్యక్తి క్యారెక్టర్‌లో పారదర్శకతను తెలియజేస్తుంది. ఇవన్నీ ఆ బంధానికి ఎదుటి వ్యక్తి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారనేది అర్థమవుతుంది.
హెచ్చరిక సంకేతాలు
అయితే ఇలాంటి సంకేతాలు ఉన్నప్పటికీ.. మాటలతోనే కాకుండా చేష్టల ద్వారా మున్ముందు ఆ వ్యక్తిపై ఒక అంచనాకి రావచ్చు. మీ గురించి ఏమీ తెలుసుకోకుండా, తన గురించి ఏం చెప్పకుండా ప్రేమ ప్రపోజల్ పెట్టడం, పెళ్లి గురించి మాట్లాడి మిమ్మల్ని ప్రలోభ పెట్టడం చేస్తే అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. డబ్బు, బహుమతులు, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటివి అడగడం, తరచూ వీడియో కాల్స్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, గుర్తింపును దాచిపెట్టడం చేస్తుంటారు. వీటిని హెచ్చరిక సంకేతాలుగా పరిగణించాలి. కుటుంబీకులు, స్నేహితుల వద్ద మీ రిలేషన్‌షిప్‌ను దాచాలని ప్రయత్నిస్తుంటారు. మీరూ అదేవిధంగా ఉండాలని కోరుకుంటారు. భావోద్వేగపరంగా ఒత్తిడి పెట్టడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నట్లయితే ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉండాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సోషల్ మీడియా రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు తెలుసుకోవడానికి ముందుగా సమయం కేటాయించడం. వ్యక్తిగత సమాచారాన్ని తొందరపడి షేర్ చేసుకోకండి. బహిరంగ ప్రదేశాల్లో కలవడం మంచిది. మీ రిలేషన్‌షిప్ గురించి, ప్లానింగ్స్ గురించి మీకు నమ్మకస్తులైన వారికి తెలియజేయండి. ఎదుటి వ్యక్తి మాట తీరులో, ప్రవర్తనలో నిలకడగా ఉన్నారా లేదా గమనించండి. ఏ బంధానికైనా నమ్మకం క్రమంగా ఏర్పడుతుంది. ఆకర్షణ, తరచుగా ఎక్కువగా మాట్లాడుకోవడం మాత్రమే ఇద్దరి మధ్యా నమ్మకానికి నిదర్శనం కాదని గమనించాలి.
సోషల్ మీడియా పరిచయాల్లో ఒకే రకమైన ఇష్టాలు, ఆసక్తులు ఉన్న వ్యక్తులతో రిలేషన్‌షిప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సంభాషణలో అర్థం చేసుకోవడానికి సమయం ఉంటుంది. వివిధ నగరాలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులను కలుసుకునే అవకాశం దొరుకుతుంది. కానీ అదేవిధంగా నకిలి ప్రొఫైల్స్, గుర్తింపును దాటిపెట్టే వ్యక్తులు మీకు ఎదురుపడొచ్చు. భావోద్వేగపరంగా మిమ్మల్ని మోసం చేయవచ్చు.
రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తితో ముందుకు వెళ్లేముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని వీలైనంత తక్కువగా పంచుకోండి. ఆర్థిక లావాదేవీలను చేయకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నమ్మకమైన వారి సలహా తీసుకోండి. గౌరవం, నమ్మకం, సంభాషణకి ప్రాధాన్యత ఇవ్వండి.



Click it and Unblock the Notifications