Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.?
లవ్ రిలేషన్ ఏళ్ల నాటిది అయినా, కొన్ని నెలలే అయినా ప్రేమికులు విడిపోయిన తర్వాత కలిగే బాధ వర్ణనాతీతం. అయితే వీటన్నికంటే జీవితం చాలా ముఖ్యమైనది. జీవనగమనంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. వాటిని దాటుకుంటూ సమాజంలో గుర్తింపు పొందడమే జీవితానికి అసలైన పరమార్థం. ఈ క్రమంలో బ్రేకప్ కారణంగా మీరు క్రుంగిపోకుండా త్వరగా ఆ బాధ నుంచి బయటపడాలంటే మనస్తత్వ నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. వాటిని పాటిస్తే మీ జీవితాన్ని మళ్లీ ప్రారంభించవచ్చని చెబుతున్నారు.

ఒంటరిగా ఏడవండి
యువతీయువకులు ప్రేమలో ఉన్నప్పుడు మెదడు డోపమైన్, ఆక్సిటోసిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి వారి మధ్య సంతోషం, అనుబంధాన్ని పెంచుతాయి. అయితే ప్రేమ జంట విడిపోయినప్పుడు ఈ హార్మోన్లు తగ్గిపోవడంతో మానసికంగా బాధ ఏర్పడుతుంది. ఫలితంగా వారి జ్ఞాపకాలు తరచుగా గుర్తురావడం, నిద్రలేమి, చేసే పనిపైన ఆసక్తి లేకపోవడం వంటివాటికి దారితీస్తాయి. దీని నుంచి బయటపడాలంటే ముందుగా మీ భావోద్వేగాలను మీరు అంగీకరించాలి. ఏడుపు వస్తే కంటికి ధారగా ఏడవాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోకండి. కన్నీళ్లు బయటకు రావడం ద్వారా మీ మనసు తేలిక పడుతుంది. ఒంటరిగా ఏడవడం ద్వారా ఇంకా ఉపశమనం కలుగుతుంది.
ఫాలో అవ్వకండి
గతంలో మీ మాజీ ప్రేమ భాగస్వామితో దిగిన ఫొటోలు, వీడియోలు ఈ సమయంలో చూడటం మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. వాటిని చూడటం మానుకోండి. అవసరమైతే వాటిని మీ ఫోన్‌లో నుంచి తొలగించండి. సోషల్ మీడియాలో వారి ప్రొఫైల్‌ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నట్లయితే అలా చేయడం ఆపేయండి. లేదంటే మీ మనసుపై ఒత్తిడి పెరిగి మిమ్మల్ని ఎమోషనల్‌గా వీక్ చేస్తుంది.

విశ్రాంతి అవసరం
బ్రేకప్ అయిన తర్వాత ఆ బాధ నుంచి బయటపడాలంటే మీరు కచ్చితంగా కొంత విశ్రాంతి తీసుకోవాలి. యోగా సాధన చేయడం, వాకింగ్‌కి వెళ్లడం వంటి ద్వారా మానసికంగా రిలీఫ్ ఉంటుంది. వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా ఉండొచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించవచ్చు. ఇలా చేయడం ద్వారా విడిపోయిన బాధ కొంతైనా తగ్గుతుంది.
అన్వేషణ
చివరిగా.. మీ ఎక్స్ లవర్ జ్ఞాపకాల నుంచి పూర్తిగా కోలుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీలో ఉన్న స్కిల్స్‌ను బయటకు తీయండి. ఆర్ట్ పెయింటింగ్ వేయడం, ఏదైనా కొత్తగా రాసేందుకు ప్రయత్నించడం, కొత్త ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించడం ద్వారా మీ మనసు నెమ్మదిగా ఆ జ్ఞాపకాల నుంచి కోలుకుంటుంది. ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ వంటి వినూత్న ప్రయోగాలు సైతం మీ మానసిక స్థితిని బలపరుస్తుంది.



Click it and Unblock the Notifications
