Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నిద్రలేవగానే భర్తతో ఆ పని..బెడ్ రూమ్ సీక్రెట్ బయటపెట్టిన ప్రియాంక చోప్రా!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సెన్సేషన్ నిక్ జోనాస్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సెలబ్రిటీల వివాహాలు ఎక్కువ కాలం నిలవవు, అవి కేవలం పబ్లిసిటీ స్టంట్స్ అనే అపవాదు తరచుగా వినిపిస్తుంటుంది. కానీ ఆ అపవాదులను పటాపంచలు చేస్తూ నిక్-ప్రియాంక జోడి ముందుకు సాగుతోంది.
వీరి మధ్య పదేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ జంట నిరూపిస్తూనే ఉంది. మధ్యమధ్యలో వీరి విడాకుల గురించి పుకార్లు షికార్లు చేసినా, వాటికి మాటలతో కాకుండా, చేతలతో సమాధానం చెబుతూ విమర్శకుల నోళ్లు మూయిస్తుంటారు ఈ దంపతులు. కొన్ని నెలల క్రితం ప్రియాంక చోప్రా తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన బెడ్ రూమ్ సీక్రెట్ ను బయటపెట్టి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు.

ఆదివారం ఉదయం ఆ పని తప్పనిసరి
ఓ ప్రముఖ హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక తన సండే సెంటిమెంట్ గురించి వివరించారు. వారమంతా షూటింగ్స్, బిజినెస్ పనులతో ఎంత బిజీగా ఉన్నా ఆదివారం మాత్రం పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తానని ఆమె తెలిపారు. ఆదివారం ఉదయం నిద్రలేచాక, మంచం మీద భర్తను గట్టిగా హత్తుకోకపోతే ఆ రోజు అసలు మొదలైనట్టే అనిపించదని.. అది తమకు అత్యంత అవసరం, అదొక సంప్రదాయం అని ప్రియాంక సిగ్గుపడుతూ చెప్పారు.
వారంలో ఆ ఒక్కరోజే తమకు ఏకాంతంగా గడిపే సమయం దొరుకుతుందని, దాన్ని ఆస్వాదించడం తమకు అలవాటుగా మారిందని ఆమె చెప్పారు. ప్రియాంక దృష్టిలో లగ్జరీ అంటే ఖరీదైన కార్లు, బంగ్లాలు కాదు..కుటుంబంతో కలిసి ఇంట్లో ప్రశాంతంగా గడపడమే నా జీవితంలో అతిపెద్ద లగ్జరీ. ఆ రోజు ఎక్కడికీ వెళ్లడానికి తొందరపడను. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, స్క్రిప్ట్స్ చదువుతూ లేదా టీవీ చూస్తూ గడిపేస్తాం అని ఆమె తమ అన్యోన్యతను వివరించారు.
ప్లే బాయ్ నిక్ మనసు మార్చిన దేశీ గర్ల్
నిక్ జోనాస్ గతంలో హాలీవుడ్ స్టార్స్ మిలే సైరస్, సెలీనా గోమెజ్, డెల్టా గుడ్రెమ్, మాజీ మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో వంటి వారితో డేటింగ్ చేశారు. కానీ మెట్ గాలా రెడ్ కార్పెట్ పై మన 'దేశీ గర్ల్'ను చూసిన తర్వాత నిక్ ప్రపంచం మారిపోయింది. ప్రియాంక ప్రేమను గెలుచుకోవడానికి నిక్ ఏకంగా అర్ధరాత్రి టిఫనీ షోరూమ్ తెరిపించి మరీ డైమండ్ రింగ్ కొనుగోలు చేశాడంటే ప్రియాంకపై అతనికి ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఏడేళ్ళ వివాహ బంధం తర్వాత కూడా వీరి ప్రేమ ఇంకా కొత్తగానే ఉంది. ప్రస్తుతం ఈ జంట తమ గారాల పట్టి మాల్తీ మేరీతో కలిసి అమెరికాలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.



Click it and Unblock the Notifications