Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో..
ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి.. కానీ అదే ప్రేమపై అనుమానం పెరిగితే అది ఎంతటి విపరీత పరిణామాలకు దారితీస్తుందో బెంగళూరులో వెలుగుచూసిన ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. సర్ ప్రైజ్ ప్రపోజల్ పేరుతో నమ్మించి ఇంటికి పిలిపించుకున్న ఒక యువతి, తన ప్రియుడిని అత్యంత కిరాతకంగా కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసింది. ఈ దారుణ ఘటన బెంగళూరులోని బ్యాదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనా నగర్ లో మంగళవారం (ఏప్రిల్ 21, 2026) మధ్యాహ్నం జరిగింది. సినిమాను తలపించే ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేరణ అలియాస్ ప్రేమ (27), కిరణ్ (27) ఇద్దరూ రాజాజీనగర్ సమీపంలోని ఓ మొబైల్ స్టోర్ లో కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ఇటీవల కాలంలో కిరణ్ తనను దూరం పెడుతున్నాడనే అనుమానంతో ప్రేరణ అతడితో తరచూ గొడవ పడేది. తాను ఎంత బతిమాలినా కిరణ్ పట్టించుకోకపోవడంతో అతడిపై కక్ష పెంచుకుంది.
ఈ క్రమంలోనే పక్కా స్కెచ్ వేసిన ప్రేరణ.. కిరణ్ ను అంతమొందించాలని నిర్ణయించుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, అతడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. తనకు ఒక అదిరిపోయే విదేశీ స్టైల్ సర్ ప్రైజ్ ప్రపోజల్ ఇస్తానని నమ్మించింది. ఆమె మాటలు గుడ్డిగా నమ్మిన కిరణ్, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎలాంటి అనుమానం లేకుండా ఆమె ఇంటికి వెళ్లాడు.
కిరణ్ ఇంటికి చేరుకోగానే.. విదేశాల్లో ఇలాగే ప్రపోజ్ చేస్తారంటూ అతడి దుస్తులు విప్పించింది. కళ్లకు గంతలు కట్టి, చేతులు, కాళ్లను ఒక కుర్చీకి గట్టిగా కట్టేసింది. తాళ్లు మరీ గట్టిగా కట్టడంతో కిరణ్ ప్రశ్నించగా.. ఇది ప్రపోజల్ లో భాగమేనని, ట్రెండింగ్ లో ఉందని నమ్మబలికింది. ఆ తర్వాత ముందుగానే ఇంట్లో దాచిపెట్టుకున్న పెట్రోల్, కిరోసిన్ తెచ్చి కిరణ్ పై పోసి నిప్పంటించింది.
మంటల ధాటికి తాళలేక హాహాకారాలు చేసిన కిరణ్.. కదల్లేని స్థితిలో అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. పైగా,ఈ కిరాతక చర్య మొత్తాన్ని ఆ సైకో ప్రియురాలు తన మొబైల్ ఫోన్లో వీడియో తీయడం పోలీసులనే విస్మయానికి గురిచేసింది.
కిరణ్ చనిపోయిన అనంతరం.. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రేరణ నాటకం ఆడింది. తాను బాత్రూంలో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని, బయటకు వచ్చి చూసేసరికి కిరణ్ తనకు తానుగా నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ అల్లింది. కానీ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షేత్రస్థాయి పరిశీలన చేయగా అసలు నిజం బయటపడింది. కిరణ్ బైక్ పై కేవలం ఒక బ్యాగ్ తో మాత్రమే వచ్చాడని పోలీసులు గుర్తించారు.
తొలుత ఇది ఆత్మహత్యగా భావించినా, ఆధారాలను బట్టి ఇదొక పక్కా ప్లాన్డ్ మర్డర్ అని నిర్ధారించాం అని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. నిందితురాలి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో ఉన్న వీడియోను కీలక సాక్ష్యంగా పరిగణిస్తున్నారు. కేవలం ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమా? లేక ఈ హత్యలో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో బ్యాదరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ముమ్మరం చేశారు.



Click it and Unblock the Notifications