Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
శృంగారం చేస్తుంటే విపరీతంగా చెమట వస్తోందా.. అయితే ఈ బలహీనత ఉందేమో చూస్కోండి!
శృంగారం అనేది ఓ మధురానుభూతి. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే చాలా శక్తి కావాలి. అలా అని కేవలం శక్తి మాత్రమే ఉంటే కూడా దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. కొందరికి అనుమానం, ఒత్తిడి, టెన్షన్ వల్ల కూడా ఎక్కువ సేపు ఎంజాయ్ చేయలేరు. భార్యను బాగా సుఖపెడతానా లేదా అని అనుమానంతో బాగా పెర్ఫార్మ్ చేయలేకపోతారు. ఇలా శృంగారం చేసే సమయంలో చెమట పట్టడంపై కూడా ఇదే విధంగా పలువురు ఆందోళన చెందుతుంటారు. ఒళ్లంతా ఇలా చెమటలు పట్టడం నరాల బలహీనత అని, అది శృంగారంపై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని భావిస్తుంటారు. మరి వీరి అనుమానాల్లో నిజం ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చెమటలు పట్టడం నరాల బలహీనత కాదు
చెమటలు పట్టడానికి నరాల బలహీనతకు ఏమైనా సంబంధం ఉందనేది పూర్తిగా అపోహ మాత్రమే. నరాల బలహీనతకు, రతికి అసలు సంబంధమే లేదు. కంగారు, ఆందోళన ఉన్న వారికే చెమట అధికంగా వస్తుంది. అలాగే హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్లకు ఎక్కువగా చెమట పడుతుంది. మరికొందరికి సహజంగానే చెమట ఎక్కువ వస్తుంది. అది జబ్బు కాదు. అయితే చెమట ఎక్కువగా వచ్చేవారు.. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అంటే చెమట వల్ల ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది!
ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల, డస్ట్ పౌడర్ వాడడం వల్ల చర్మ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే వైద్యులను సంప్రదించడం మంచిది. కానీ భయపడిపోతూ తమకేదో అయిపోతుందని అనుకోకూడదు. చెమటలు ఎక్కువగా వస్తున్నాయని టెన్షన్ పడడం కంటే కూడా దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలసుకోవాలి. ముఖ్యంగా శృంగారం వల్ల ఆనందం, సంతోషం, ఉత్సాహం చేకూరుతాయి. ఇవే కాకుండా అనేక ఉపయోగాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఒత్తిడి దూరం అయి మెదడు చురుగ్గా పని చేయడం, రోగనిరోధక శక్తి పెరగడం సహా ఇంకా చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రతిలో పాల్గొనడం వల్ల యాంటీబాడీస్ పెరుగుతాయట!
రతిలో పాల్గొనడం సంతృప్తి చెందడం వ్లల శరీరంలో యాంటీ బాడీస్ పెరుగుతాయట. తద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రిములు, వైరస్ లను ఎదుర్కోవడానికి శృంగారం బాగా సహాయపడుతుందట. రతి వల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారు అవుతాయి. వారిలో యూరిన్ లీక్ సమస్ ఉంటే దానికి చెక్ పెట్టొచ్చు. కార్యంలో పాల్గొనడం మహిళల ఆరోగ్యానికి మంచిది. అలాగే శృంగారం వల్ల విడుదల అయ్యే ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ లెవెల్స్ సరిగ్గా ఉండేలా చేస్తుంది.
ఆత్మవిశ్వాసమూ విపరీతంగా పెరుగుతుందట!
ఒకవేళ ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పితే గుండెపోటు వస్తుంది. కాబట్టి తరచుగా శృంగారం చేయడం వల్ల గుండెపోటు, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చాలా జాగ్రత్త పడవచ్చు. రతిలో పాల్గొనే వాళ్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరం చురుగ్గా పని చేస్తుంది. చాలా మందిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. అదే ఈ కార్యం క్రమం తప్పకుండా చేసుకుంటుంటే నిద్రలో నాణ్యత పెరుగుతుంది. బాగా నిద్రపోవాలని అనిపస్తుంది. దీని వల్ల శరీరం చాలా రిలాక్స్ గా ఉంటుంది. తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందాన్ని పొందుతారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications