Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చిన్న వయస్సులోనే శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుందో తెలుసా?
యవ్వనం అనేది వ్యక్తి జీవితంలొ చాలా ఉత్సాహం, ఉద్వేగభరితమైన దశ. ఈ వయస్సులోనే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, ప్రపంచాన్ని జయించాలనే తపన ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే శారీరక ఆకర్షణ, ప్రేమ, సంబంధాల వైపు యువత అడుగులు వేయడం సహజం. ఈ రోజుల్లో చాలామంది చిన్న వయస్సులోనే శృంగారం లేదా సంభోగంలో పాల్గొంటున్నారు. అయితే ఈ సున్నితమైన వయసులో సరైన మార్గనిర్దేశం, అవగాహన లేకపోవడం వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది. చిన్న వయసులోనే లైంగిక సంబంధాల వైపు ఆకర్షితులైనప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి.
అనారోగ్యానికి ద్వారం
చిన్న వయసులో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే చాలామందికి దాని పర్యవసానాల గురించి పూర్తి సమాచారం ఉండదు. తల్లిదండ్రులతో లేదా పెద్దలతో ఇలాంటి విషయాలు మాట్లాడటానికి సంకోచించడం, ఫ్రెండ్స్ నుండి లేదా ఇంటర్నెట్ నుండి లభించే అసంపూర్ణ, తప్పుడు సమాచారాన్ని నమ్మడం వంటివి వారిని తప్పుదారి పట్టిస్తాయి. సురక్షితమైన పద్ధతులు, వ్యక్తిగత పరిశుభ్రత, లైంగికంగా సంక్రమించే వ్యాధులు వంటి కీలక అంశాలపై వారికి అవగాహన శూన్యం. ఈ అజ్ఞానమే వారి ప్రైవేట్ భాగాలలో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

నిశ్శబ్దంగా ప్రాణాలు ఫసక్
ఇన్ఫెక్షన్లు మొదట్లో చాలా సాధారణంగా కనిపించవచ్చు. దురద, మంట, దద్దుర్లు, అసాధారణ స్రావాలు వంటి లక్షణాలతో ప్రారంభమై సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కొన్ని ఇన్ఫెక్షన్లు HPV, హెచ్ఐవి వంటివి బయటకు ఎలాంటి లక్షణాలు చూపించకుండానే శరీరాన్ని నాశనం చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ల వల్ల జననేంద్రియాలు దెబ్బతినడమే కాకుండా, అవి అంతర్గత అవయవాలకు కూడా వ్యాపించి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.
భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం
చిన్న వయసులో సోకిన ఈ ఇన్ఫెక్షన్ల ప్రభావం జీవితాంతం వెంటాడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో గర్భం దాల్చడంలో సమస్యలు, సంతానలేమి, దీర్ఘకాలిక నొప్పి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా ఇది వారి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అవమానం, అపరాధ భావం, ఆందోళన వంటివి వారిని కుంగదీస్తాయి. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఒక చిన్న వయసులో తెలియక చేసిన పొరపాటు, వారి కలలను, జీవితాన్ని నాశనం చేసేంత శక్తివంతమైనదిగా మారవచ్చు.



Click it and Unblock the Notifications