Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు!
మనల్ని ఎవరైనా అవమానిస్తుంటే మనసు చాలా గాయపడుతుంది. వెంటనే వారికి ఘాటుగా బదులివ్వాలని మనసు ఉవ్విళ్లూరడం చాలా సహజం. ఒకవేళ ఆ టైంలో ఏమీ అనలేకపోతే, ఆ కోపం మనలోనే ఒక అగ్నిపర్వతంలా రగులుతూ ఉంటది. పోనీ కోపాన్ని ఆపుకోలేక తిరిగి గట్టిగా సమాధానం ఇచ్చేస్తే ఆ అవమానభారం తగ్గిపోతుందా? అంటే అదీ లేదు. ఆ చేదు జ్ఞాపకం ఒక పీడకలలా చాలాకాలం పాటు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

అయితే ఈ మానసిక క్షోభ నుంచి బయటపడే దారి లేదా? కచ్చితంగా ఉందంటున్నారు మానసిక నిపుణులు. ఆ అద్భుతమైన రహస్యం అంతా అవమానం జరిగిన వెంటనే వచ్చే ఆ తొలి పది సెకన్ల వ్యవధిలోనే దాగి ఉంది. ఎవరైనా మనల్ని అవమానించగానే వెంటనే కోపగించుకోవడం అంటే, మన మనస్సుపై ఉన్న నియంత్రణను కోల్పోయి, ఆ అధికారాన్ని మనల్ని అవమానించిన వారి చేతుల్లో పెట్టేయడమే.
లోకంలో అన్ని అవమానాలూ ఒకేలా ఉండవు. కొందరు కేవలం మీ సహనాన్ని పరీక్షించి వికృతానందం పొందడానికే కావాలని మిమ్మల్ని రెచ్చగొడతారు. కొందరికి మాటల్లో కటువుగా ప్రవర్తించడమే సహజ నైజం. మరికొందరు తమ జీవితంలోని వైఫల్యాల వల్ల వచ్చిన అసహనాన్ని మీపై రుద్దుతారు. అందుకే ప్రతిస్పందించే ముందు మిమ్మల్ని మీరు ఈ మూడు ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోండి.
-మిమ్మల్ని విమర్శించిన ఆ వ్యక్తికి, వారి అభిప్రాయానికి మీ జీవితంలో నిజంగా అంత విలువుందా?
-ఆ మాట ఎక్కడ అన్నారు? ఆఫీసు మీటింగ్ లో అందరి ముందు అవమానించడం వల్ల కలిగే తీవ్రత వేరు, ఏకాంతంగా రెండు కఠినమైన మాటలు అనడం వల్ల కలిగే ప్రభావం వేరు.
-వారు అన్న మాటల్లో ఏమాత్రమైనా నిజం ఉందా? ఇది జీర్ణించుకోవడం కొంచెం కష్టమే అయినా, ఆత్మవిమర్శకు ఇది అత్యంత అవసరమైన ప్రశ్న.
ఇక భావోద్వేగాల నియంత్రణ విషయానికి వస్తే.. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రఖ్యాత మనస్తత్వవేత్త జేమ్స్ గ్రాస్ ఒక అద్భుతమైన చిట్కాను సూచించారు. అదే ఎఫెక్ట్ లేబులింగ్(Affect Labeling). అంటే మీ లోపల కలుగుతున్న భావాలకు మీరే ఒక పేరు పెట్టుకోవడం. అవమానం జరిగిన వెంటనే మీకు కోపం వస్తోందా? బాధగా అనిపిస్తోందా? లేక ఆశ్చర్యానికి గురయ్యారా? అనేది మనసులోనే గుర్తించండి.
ఇలా మీ భావాలకు పేరు పెట్టడం వల్ల ఆ భావోద్వేగాల తీవ్రత సగానికి పైగా తగ్గిపోతుంది. భావాలను బలవంతంగా అణచిపెట్టుకుంటే అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. అదే వాటిని అర్థం చేసుకుంటే, మనసు నెమ్మదిగా మీ అదుపులోకి వస్తుంది. మిమ్మల్ని అంత మాట అన్నా సరే మీరు చెక్కుచెదరలేదన్న విషయం వారిని ఆశ్చర్యపరుస్తుంది. కోపంతో ఊగిపోతూ మీరు ఇచ్చే సమాధానం ఆ క్షణానికి ఒక తాత్కాలిక విజయాన్ని ఇవ్వొచ్చు. కానీ పది సెకన్ల ఆగి.. సంయమనంతో, హుందాతనంతో మీరు ఇచ్చే రిప్లై ఎదుటివారి మనసులో మీ వ్యక్తిత్వంపై శాశ్వతమైన, సానుకూలమైన ముద్రను వేస్తుంది.



Click it and Unblock the Notifications
