Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ భాగస్వామితో బోర్ కొడుతుందా? 15 నిమిషాలు ఇలా చేస్తే..ఎఫైర్స్ టెన్షన్ కూడా ఉండదు!
ఈ రోజుల్లో చాలామందికి పని ప్రదేశంలో సహోద్యోగులతో, ఫ్యాక్టరీల్లో ఇతర కార్మికులతో,సోషల్ మీడియాలో తెలియని ఫ్రెండ్స్ తో సమయం గడపడానికి,వారితో మాట్లాడటానికి వీలుపడుతుంది కానీ ఇంట్లో భాగస్వామితో కొద్దిసేపు సమయం గడపడానికి కుదరకుండా పోతుంది. కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా, మనసుల మధ్య దూరం పెరుగుతోంది. అయితే ఇలాగే ఉంటే కొన్నాళ్లకు ఆ బంధంలో బీటలు వస్తాయి,ఫలితంగా విడాకులు,బ్రేకప్ కామన్ గా అయిపోతాయి. అయితే మీ బంధం ఎన్నేళ్లయినా స్ట్రాంగ్ గా ఉక్కులా ఉండాలంటే, మీ భాగస్వామితో మీకు ఎప్పటికీ బోర్ కొట్టాలంటే నిపుణులు సూచిస్తున్న 15 నిమిషాల రూల్ పాటించాల్సిందే.
మీ భాగస్వామితో మీ అనుబంధం ఎప్పటికీ పదిలంగా ఉండాలనుకుంటే 15 నిమిషాల సూత్రాన్ని పాటించాలని, ఇది మీ బంధంలో అద్భుతాలు చేస్తుందని లైంగిక ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సంకల్ప్ జైన్ చెబుతున్నారు. ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ వీడియోలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. అసలు ఏంటీ 15 నిమిషాల రూల్, ఆ వీడియోలో డాక్టర్ సంకల్ప్ జైన్ ఏం సూచించారో ఇప్పుడు చూద్దాం.

ఏమిటీ 15 నిమిషాల సూత్రం?
ఇది చాలా ఈజీ,ఎఫెక్టివ్ నియమం. రోజులో మూడుసార్లు కేవలం 15 నిమిషాల పాటు మీ సమయాన్ని పూర్తిగా మీ భాగస్వామికి కేటాయించాలి.
మొదటి 15 నిమిషాలు-కార్యాచరణ: రోజులో ఏదైనా ఒక సమయంలో ఇద్దరూ కలిసి ఒక 15 నిమిషాల పాటు ఏదైనా పని చేయండి. అది ఉదయాన్నే చేసే వాకింగ్ కావచ్చు, సాయంత్రం చేసే యోగా కావచ్చు, లేదా ఏ పనీ లేకుండా కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కావచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే..ఈ 15 నిమిషాల టైంలో మీ పూర్తి దృష్టి ఒకరిపై ఒకరు ఉంచాలి.
రెండవ 15 నిమిషాలు-కలిసి తినడం: రోజులో కనీసం ఒక్కసారైనా అది బ్రేక్ ఫాస్ట్ అయినా లేదా మధ్యాహ్న భోజనం లేదా నైట్ డిన్నర్ అయినా ఏదైనా సరే ఒక 15 నిమిషాల పాటు కలిసి కూర్చొని తినండి. ఈ టైంలో టీవీ, మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచి ఆ రోజు ఎలా గడిచిందో కబుర్లు చెప్పుకోండి.
మూడవ 15 నిమిషాలు-మనసు విప్పడం: ఇది చాలా ముఖ్యమైనది. ఈ 15 నిమిషాల్లో మీరు సాధారణంగా పంచుకోవడానికి సంకోచించే విషయాలను, మీ మనసులోని ఆలోచనలను, భయాలను మీ భాగస్వామితో చెప్పండి. ఇది మీ మధ్య నమ్మకాన్ని, పారదర్శకతను పెంచుతుంది.
కలిగే ప్రయోజనాలు
చాలామంది తమ సమస్యలను బయటి వ్యక్తులతో ఫ్రెండ్స్, కొలీగ్స్,తెలియని వ్యక్తులతో కూడా పంచుకుంటారు కానీ తమ భాగస్వామితో చెప్పడానికి వెనకాడతారు. అయితే 15 నిమిషాల రూల్ పాటించడం ద్వారా మీ భాగస్వామే మీకు మంచి ఫ్రెండ్ గా, ఉత్తమ సలహాదారుగా మారిపోతారు. మీ సంతోషం, బాధ అన్నీ పంచుకున్నప్పుడు మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఇదే సమయంలో మీ మధ్య సాన్నిహిత్యం పెరిగిపోతుంది. ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఐ లవ్ యూ చెప్పుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు మీ బంధాన్ని పటిష్టం చేస్తాయి. ఇది మీ మధ్య శారీరక, మానసిక సాన్నిహిత్యాన్ని పెంచి, అసంతృప్తికి తావు లేకుండా చేస్తుంది.

ఎఫైర్స్ టెన్షన్ కూడా ఉండదు
వివాహేతర సంబంధాలకు ముఖ్య కారణం జంటల మధ్య భావోద్వేగ దూరం పెరగడమే. ఒకరికొకరు సమయం కేటాయించనప్పుడు, అవసరమైన ప్రేమ, మద్దతు బయట వెతుక్కుంటారు. ఈ 15 నిమిషాల నియమం మీ బంధం చుట్టూ ఒక భావోద్వేగ కవచాన్ని సృష్టిస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ లేనప్పుడు, అపార్థాలకు తావుండదు, మీ బంధంలోకి మూడో వ్యక్తి ప్రవేశించే అవకాశమే ఉండదు.



Click it and Unblock the Notifications