Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పెళ్లి తర్వాత భాగస్వామితో ఈ పని చేయకండి..లేకుంటే అల్లకల్లోలమే!
ఆచార్య చాణక్యుడు అనగానే ముందుగా తెలివితేటలు అనే పదం గుర్తుకొస్తుంది. చాణక్యుడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణమీనమైనవి,అమూల్యమైనవి. చాణక్యుడిని విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఆయన రచించిన 'అర్థశాస్త్రం', 'చాణక్య నీతి' గ్రంథాలు నేటికీ మన జీవితాలకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే మానవ సంబంధాలపై, ముఖ్యంగా దాంపత్య బంధం లోతులపై అద్భుతమైన విశ్లేషణ చేసిన మహనీయుడు ఆచార్య చాణక్యుడు.
వైవాహిక జీవితంలో భార్యాభర్తలు సంతోషంగా ఉండటానికి చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు అత్యంత విలువైనవి. మీ దాంపత్య జీవితం కలకాలం ఆనందంగా, అన్యోన్యంగా సాగాలంటే చాణక్యుడు చెప్పిన మూడు విషయాలను తప్పక పాటించాలి. ఈ మూడు సూత్రాలు పాటించడం ద్వారా మీ వైవాహిక జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించి మీ బంధాన్ని మరింత దృఢంగా, ప్రేమమయంగా మార్చుకోవచ్చు. చాణక్యుడు చెప్పిన ఆ 3 విషయాలేంటో ఇక్కడ చూడండి.

పోలిక
మనలో చాలా మందికి తెలియకుండానే చేసే పెద్ద పొరపాటు ఇదే. మన జీవిత భాగస్వామిని స్నేహితులు, బంధువులు, లేదా ఇరుగుపొరుగు వారితో పోల్చి మాట్లాడటం చేయకూడదు. వాళ్ళ ఆయన చూడు ఎంత బాగా చూసుకుంటాడో, వాళ్ళ ఆవిడ చూడు ఎంత చక్కగా ఉందో వంటి మాటలు సరదాగా అన్నప్పటికీ అవి మీ భాగస్వామి మనసులో తీవ్రమైన గాయాన్ని చేస్తాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం పోలిక అనేది బంధాన్ని నాశనం చేసే ఒక విషం లాంటిది. ఇది మీ భాగస్వామిలో న్యూనతా భావాన్ని పెంచి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. కాలక్రమేణా ఇది వారిలో కోపాన్ని, మీపై విరక్తిని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడని, వారిలో ఉండే గుణగణాలు, వ్యక్తిత్వం వేరని గ్రహించాలి. మీ భాగస్వామిలోని మంచితనాన్ని, ప్రత్యేకతను గుర్తించి అభినందించండి.. అంతేగానీ ఇతరులతో పోల్చి వారిని తక్కువ చేయకండి.
గౌరవం
భార్యాభర్తల బంధానికి ప్రేమ ఎంత ముఖ్యమో, పరస్పర గౌరవం కూడా అంతే ముఖ్యం. కొంతమంది తమ భాగస్వామిని అందరి ముందు ఎగతాళి చేయడం..వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా అవమానించడం వంటివి చేస్తుంటారు. అయితే ఏ బంధంలోనైతే గౌరవం లోపిస్తుందో, ఆ బంధం ఎప్పటికీ సంతోషంగా ఉండదని చాణక్యుడు చెబుతున్నాడు. మాటలతో చేసే గాయం కత్తితో చేసే గాయం కన్నా లోతైనది. మీరు పదేపదే మీ భాగస్వామిని అవమానిస్తుంటే అది వారి మనసులో చెరగని ముద్ర వేస్తుంది. ఇది క్రమంగా గొడవలకు, మనస్పర్థలకు దారితీసి, ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీ భాగస్వామికి, వారి మాటలకు ఎల్లప్పుడూ విలువ ఇవ్వండి. గౌరవమే మీ బంధానికి బలమైన పునాదని గుర్తుపెట్టుకోండి.

సమయమే అమూల్యమైన కానుక
నేటి బిజీ బిజీ లైఫ్ లోవృత్తిపరమైన ఒత్తిళ్ల కారణంగా చాలామంది తమ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. బంధాలు బలహీనపడటానికి ఇదే ప్రధాన కారణమని చాణక్యుడు స్పష్టం చేశాడు. మీరు ఎంత సంపాదించినా, ఎన్ని బహుమతులు ఇచ్చినా మీ భాగస్వామికి మీరిచ్చే అమూల్యమైన సమయానికి ఏదీ సాటిరాదు. మీరు ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ కొంత సమయాన్ని కేవలం మీ భాగస్వామి కోసమే కేటాయించండి. వారితో కలిసి కూర్చొని మనసు విప్పి మాట్లాడండి. వారి కష్టసుఖాలను పంచుకోండి. ఈ చిన్న చిన్న క్షణాలే మీ బంధాన్ని పటిష్టం చేసి, మీ ఇద్దరి మధ్య ప్రేమను, అన్యోన్యతను పెంచుతాయి.



Click it and Unblock the Notifications