Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఫ్రెండ్స్ కి ఈ పెళ్లి రహస్యాలు చెప్పకండి..డేంజర్ లో పడతారు!
వివాహ బంధానికి పునాది నమ్మకం. భార్యాభర్తల మధ్య ఉండే బంధం ఓ పవిత్రమైన కోట లాంటిది. ఆ కోట గోడలు ఎంత బలంగా ఉంటే, బంధం అంత పదిలంగా ఉంటుంది. దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. అయితే ఆ కోట గోడల మధ్య జరిగే ప్రతి విషయాన్నీ బయటి ప్రపంచానికి, అంటే మూడో వ్యక్తికి చెప్పడం మొదలుపెడితే ఆ పునాదే కదిలిపోయే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది తమ వ్యక్తిగత జీవితాలను ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే సంతోషకరమైన, ఆరోగ్యకరమైన వివాహ బంధం కోసం కొన్ని విషయాలను ఎప్పటికీ దంపతులు మధ్యే రహస్యంగా ఉంచుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.
భాగస్వామి గౌరవాన్ని కాపాడండి
ప్రతి మనిషిలో లోపాలు, బలహీనతలు ఉంటాయి. మీ భాగస్వామి వారి బలహీనతలను, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను, లోతైన భావోద్వేగాలను మీతో పంచుకుంటున్నారంటే అది మీపై ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనం. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారి లోపాలను స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ముందు ఎగతాళిగా చెప్పడం లేదా సానుభూతి కోసం వాడటం ద్రోహం చేయడమే. ఈ విషయం వారికి తెలిస్తే వారి ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతింటుంది. మీపై నమ్మకం శాశ్వతంగా కోల్పోతారు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గాయం మానదు.

మీ మధ్య గొడవలు, మీ గది ముచ్చట్లు మీలోనే
భార్యాభర్తల మధ్య వాదనలు రావడం సర్వసాధారణం. కానీ ఆ కోపంలో జరిగిన వాదనలను, ఒకరినొకరు అనుకున్న మాటలను మూడో వ్యక్తికి వివరించడం అవివేకం. ఈ రోజు మీరు గొడవ పడొచ్చు, రేపు మళ్లీ కలిసిపోవచ్చు. కానీ మీరు ఎవరితోనైతే ఈ విషయాలు పంచుకున్నారో, వారి మనసులో మీ భాగస్వామిపై ఓ చెడు అభిప్రాయం శాశ్వతంగా నిలిచిపోతుంది. అలాగే మీ ఏకాంతానికి, పడకగదికి సంబంధించిన విషయాలు అత్యంత వ్యక్తిగతమైనవి. వాటిని సరదాకి కూడా స్నేహితులతో చర్చించకూడదు. ఇది మీ బంధం పవిత్రతను దెబ్బతీస్తుంది.
ఆర్థిక విషయాలలో గోప్యత పాటించండి
డబ్బు, కెరీర్ అనేవి దాంపత్యంలో కీలకమైనవి. మీ ఇద్దరి ఆదాయం, ఖర్చులు, అప్పులు లేదా ఆర్థిక పరమైన గొడవల గురించి బయటి వారికి చెప్పడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. ఇది ఇతరులకు మీ కుటుంబాన్ని అంచనా వేయడానికి, సలహాల పేరుతో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది మీ బంధంలో అభద్రతాభావాన్ని పెంచుతుంది. మీ వివాహ బంధం అనేది ఇద్దరు వ్యక్తుల ప్రపంచం. మూడో వ్యక్తికి అక్కడ స్థానం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటూ, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ దాంపత్య నౌక ఎలాంటి తుఫానులనైనా తట్టుకుని ఆనందంగా ముందుకు సాగిపోతుంటది.



Click it and Unblock the Notifications