Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పెళ్లైన 3 ఏళ్లకే ప్రేమ ఫసక్.. 80% జంటల పరిస్థితి ఇదే!..మొగుడు పెళ్ళాల మధ్య ఏం జరుగుతోంది?
పెళ్లి అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. పెళ్లైన కొత్తల్లో అంతా కలర్ ఫుల్ గా, సినిమాటిక్ గా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లయిన మొదటి రెండు,మూడు సంవత్సరాలను హనీమూన్ దశగా చెప్పుకుంటారు. ఈ సమయంలో జంటల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం పీక్స్ లో ఉంటాయి.
కానీ కాలం గడిచేకొద్దీ ఆ మ్యాజిక్ మాయమవుతుంది. ఉన్నట్టుండి ఆకర్షణ తగ్గిపోతుంది, రోజువారీ బాధ్యతల నీడలో ప్రేమ మసకబారుతుంది. లైఫ్ కోచ్ నిహారిక సూరి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రకారం..దాదాపు 80 శాతం వివాహాలలో 2-3 సంవత్సరాల తర్వాత దంపతుల మధ్య సాన్నిహిత్యం దాదాపుగా అదృశ్యమవుతుందట.

ఎందుకిలా జరుగుతుంది?
భార్య..కేవలం మేనేజర్ గా మారినప్పుడు
చాలా ఇళ్లల్లో కనిపించే సాధారణ దృశ్యం ఇది. పెళ్లైన కొత్తలో ప్రేమికురాలిగా ఉండే భార్య, కాలక్రమేణా ఇంటిని నిర్వహించే మేనేజర్ గా మారిపోతుంది. ఇంటి పనులు, వంట, పిల్లల బాధ్యతలు ఆమెను పూర్తిగా ఆక్రమించేస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పనుల ఒత్తిడిలో తనలోని ఉల్లాసం, శృంగార భావనలు మసకబారుతాయి. భార్యలో ఈ కేర్ టేకర్ పాత్ర పెరిగేకొద్దీ లవర్ పాత్ర వెనకబడిపోతుంది.
పురుషులపై పెరిగే ఒత్తిడి - తగ్గే కోరిక
కేవలం మహిళలదే కాదు పురుషుల సమస్య కూడా ఇందులో ఉంది. పెళ్లైన కొత్తలో లేని బాధ్యతలు, కొన్నేళ్లకి పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు, EMIలు,పెరిగే ఖర్చులు, కెరీర్ టెన్షన్లు భర్తపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. ఈ మానసిక ఒత్తిడి వారిలోని టెస్టోస్టెరాన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా శారీరక కోరికలు సహజంగానే తగ్గిపోతాయి. రొమాన్స్ కంటే రిలాక్సేషన్ కోరుకునేలా చేస్తుంది.
నువ్వు మొదలుపెడితేనే..అనే మౌన యుద్ధం
ఏ బంధంలోనైనా సాన్నిహిత్యం తగ్గడానికి అతిపెద్ద కారణం చొరవ తీసుకోకపోవడం. వాళ్లే దగ్గరకు వస్తారులే అని ఒకరు, నేనెందుకు తగ్గాలి అని మరొకరు..ఇలా ఇద్దరూ ఎదురుచూస్తూ కూర్చుంటారు. ఎవరూ చొరవ తీసుకోకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఒక అదృశ్య అగాధం ఏర్పడుతుంది. చివరకు ఇద్దరూ ఒకరికొకరు అవసరం లేదనే భావనలోకి వెళ్లిపోతారు.
ప్రేమ ఓ లావాదేవీలా మారినప్పుడు
నువ్వు ఈ పని చేస్తేనే, నేను నీకు దగ్గరవుతాను లేదా నువ్వు నా మాట వినలేదు, అందుకే నేను దూరంగా ఉంటున్నా అనే లావాదేవీల ధోరణి దాంపత్యంలోకి వస్తే ప్రమాదమే. షరతులతో కూడిన ప్రేమలో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఎప్పుడైతే సాన్నిహిత్యం ఒక బేరసారంగా మారుతుందో, అప్పుడు ఆ బంధంలోని ఆత్మ చనిపోతుంది.
అలసిపోయిన దాంపత్యం
ఉదయం ఆఫీసు పరుగు, సాయంత్రం ఇంటి పనులు..ఇలా రోజువారీ సర్వైవల్ మోడ్ లో పడిపోయాక, ఇక రొమాన్స్ కి శక్తి ఎక్కడుంటుంది? ఇద్దరూ శారీరకంగా, మానసిక అలసిపోయి ఉంటారు. ఒకరు ప్రేమను ఇవ్వడానికి విసిగిపోతే, మరొకరు బాధ్యతలు మోయలేక విసిగిపోతారు. ఫలితంగా పడకగది నిశబ్దంగా మారుతుంది.



Click it and Unblock the Notifications