Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
3 డేట్స్, 3 మెసేజ్‌లు, 3 డేస్ గ్యాప్..మీ బంధం లోతుగా మారడానికి సింపుల్ ఫార్ములా
ప్రతి కొత్త సంబంధం ఒక సరికొత్త ప్రయాణం లాంటిది. మనసు నిండా కొత్త ఆశలు, చెప్పలేని భావోద్వేగాలు, ఉప్పొంగే ఉత్సాహంతో ఆ ప్రయాణం మొదలవుతుంది. అయితే ఈ డిజిటల్ యుగంలో కంటిన్యూ మెసేజ్ లు, తక్షణ స్పందనల ఒత్తిడిలో పడి చాలా బంధాలు మొదట్లోనే తడబడుతున్నాయి. ఈ ఉత్సాహం ఎక్కువ కాలం నిలవాలన్నా, బంధం బలంగా మారాలన్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సరైన వేగంతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఇక్కడే ఆధునిక డేటింగ్ ప్రపంచంలో ప్రాచుర్యం పొందుతున్న 333 డేటింగ్ రూల్ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఇది మీ సంబంధానికి ఒక క్రమపద్ధతిని అందించి దానిని లోతుగా, సమతుల్యంగా మార్చే ఒక అద్భుతమైన సూత్రం.
ఏమిటీ 333 డేటింగ్ రూల్?
కొత్తగా పరిచయమైన వ్యక్తితో బంధాన్ని తొందరపాటుతో కాకుండా, వివేకంతో ముందుకు నడిపించడమే ఈ రూల్ ముఖ్య ఉద్దేశం. ఇందులో మూడు సరళమైన దశలు ఉంటాయి.

3 రోజుల విరామం: మొదటి డేట్ ఎంతో అద్భుతంగా జరిగి ఉండవచ్చు. కానీ వెంటనే మరో డేట్ కోసం తొందరపడకుండా 3 రోజుల విరామం తీసుకోవాలి. ఈ సమయం మీ ఇద్దరికీ ఆ అనుభవాన్ని నెమరువేసుకోవడానికి, కలిగిన భావాలను అంచనా వేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది అవతలి వ్యక్తిపై ఆసక్తిని సజీవంగా ఉంచుతుంది, తొందరపాటు నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తుంది.
రోజుకు 3 మెసేజ్ లు: రెగ్యులర్ గా చాటింగ్ చేస్తూ, ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకోవడం మొదట్లో బాగున్నప్పటికీ..అది త్వరగా అలసటను తెచ్చిపెడుతుంది. అందుకే రోజుకు 3 ముఖ్యమైన మెసేజ్ లకు పరిమితం కావడం బెటర్. ఉదయం ఒక పలకరింపు, మధ్యాహ్నం ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ, నైట్ ఒక గుడ్ నైట్ మెసేజ్..ఇలా సంభాషణను తేలికగా, అర్ధవంతంగా ఉంచాలి. ఇది అతిగా మెసేజ్ లు పంపే ఒత్తిడిని తగ్గించి, నాణ్యమైన మాటలకు ప్రాధాన్యతనిస్తుంది.
3 డేట్ ల తర్వాత నిర్ణయం: మొదటి 3 డేట్ లు ఒకరినొకరు తెలుసుకోవడానికి కేటాయించిన ముఖ్యమైన సమయం. ఈ మూడు మీటింగ్స్ లో వారి వ్యక్తిత్వం, ఇష్టాయిష్టాలు, ప్రవర్తనను గమనించండి. తొందరపడి భావోద్వేగాలకు లోనుకాకుండా, ఒకరికొకరు ఎంతవరకు సరిపోతారో అంచనా వేయండి. మూడవ డేట్ ముగిశాక..ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం సరైనదేనా? అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోవాలి.
ఈ రూల్ ఎందుకు పాటించాలి?
ఎమోషనల్ బ్యాలెన్స్: రెగ్యులర్ కాల్స్, చాటింగ్ వల్ల కలిగే మానసిక అలసటను, ఒత్తిడిని ఈ నియమం నివారిస్తుంది. ఇది బంధాన్ని భారంలా కాకుండా ఆనందంగా ఆస్వాదించేలా చేస్తుంది.
నిజమైన అనుబంధం: వర్చువల్ సంభాషణల కన్నా నిజ జీవితంలో కలిసినప్పుడు ఏర్పడే అనుబంధం చాలా బలమైనది. ఈ నియమం టెక్స్టింగ్ ను తగ్గించి, డేట్ లపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తుంది.
క్లారిటీ లభిస్తుంది: మూడు డేట్ లలోనే, ఎలాంటి భావోద్వేగ చిక్కుముడులు లేకుండా, ఆ బంధం భవిష్యత్తుపై ఒక స్పష్టత వస్తుంది. ఇది సమయాన్ని, శక్తిని ఆదా చేస్తుంది.
ఆసక్తిని నిలుపుతుంది: ప్రతిదీ వెంటనే తెలిసిపోతే ఆకర్షణ తగ్గిపోతుంది. ఈ రూల్ ద్వారా ఏర్పడే చిన్న విరామం, పరిమిత సంభాషణ బంధంలో తాజాదనాన్ని, ఒకరిపై ఒకరికి కుతూహలాన్ని పెంచుతుంది.



Click it and Unblock the Notifications
