Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భర్త ముందు భార్యలు ఇవి దాచుకోకూడదు!..సుఖ సంసారానికి ఇవి చేటు!
మెగుడు పెళ్లాం బంధం ఓ అందమైన కోట లాంటిది. ఆ కోటకి పునాది నమ్మకం,గోడలు ప్రేమ, పైకప్పు అన్యోన్యత. అయితే రహస్యాలనే చెదలు పడితే ఆ పునాది బలహీనపడి,బంధం అనే సౌధం కూలిపోవడానికి ఎంతో కాలం పట్టదు. సంసారమనే నావ సజావుగా సాగాలంటే భార్యభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. కష్టసుఖాలు, ఆనంద విషాదాలు అన్నీ ఇద్దరూ పంచుకున్నప్పడే ఆ బంధం కలకాలం పచ్చగా వర్థిల్లుతుంది.
అయినప్పటికీ కొన్నిసార్లు తెలిసి కానీ,తెలియక కానీ భార్యాభర్తలు ఒకరి నుంచి ఒకరు కొన్ని విషయాలు దాచిపెడుతుంటారు. ముఖ్యంగా భార్యలు కొన్ని సున్నిహితమైన విషయాలను తమ భర్తలతో పంచుకోడానికి వెనుకాడతారు. ఇది తాత్కాలికంగా సమస్యను దూరం చేసినట్లు అనిపించినా సుదీర్ధ బంధాన్ని బలహీనపరుస్తుంది. దాంపత్య జీవితం సంతోషంగా,స్ట్రాంగ్ గా ఉండాలంటే భార్యలు మీ భర్త నుంచి అస్సలు దాచకూడని కొన్ని కీలకమైన విషయాలు ఏవో ఇక్కడ చూడండి.

డబ్బు విషయాలు
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతాయి. డబ్బు సంబంధాలను నిలబెడుతుంది, అలాగే కూల్చేస్తుంది కూడా. మీ జీతం, ఆదాయం, పొదుపు వంటి వివరాలను మీ భర్తతో పంచుకోవడంలో ఎలాంటి మొహమాటం వద్దు. ముఖ్యంగా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా ఎవరి దగ్గరైనా తీసుకున్నా ఆ విషయాన్ని వెంటనే భర్తకు చెప్పాలి. ఆర్థిక విషయాల్లో దాపరికం లేనప్పుడు, ఇద్దరూ కలిసి మెరుగైన ఆర్థిక ప్రణాళికలు వేసుకోగలుగుతారు. రేపటి భవిష్యత్తు కోసం కలిసి లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఇది మీ బంధంలో బాధ్యతను, భాగస్వామ్యాన్ని పెంచుతుంది.
మనసులోని మథనం
ప్రతి మనిషికి ఆందోళనలు, భయాలు ఉండటం సహజం. వాటిని మీలోనే అణచివేసుకుని మధనపడకండి. మీ మనసును తొలిచేస్తున్న ఆందోళన ఏదైనా, గుండెల్లో గూడుకట్టుకున్న భయం ఏదైనా సరే, దాన్ని మీ భర్తతో పంచుకోండి. ఆయన మీ జీవిత భాగస్వామి, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకునే నేస్తం. మీ భయాన్ని పంచుకోవడం వల్ల అది సగం అవుతుంది. మీ భర్త మీకు ధైర్యాన్ని ఇవ్వగలడు, సమస్యకు పరిష్కారం చూపగలడు, లేదా కనీసం నేనున్నాననే భరోసాతో మీ భారాన్ని తేలిక చేయగలడు.
భావాల వ్యక్తీకరణ
చాలా మంది స్త్రీలు తమ భావాలను, ముఖ్యంగా కోపం, బాధ వంటి వాటిని వ్యక్తపరచడానికి ఇష్టపడరు. ఇది ఇంట్లో అనవసరమైన గొడవలకు దారితీస్తుందని భావిస్తారు. కానీ భావాలను అణచివేయడం వల్ల అవి లోలోపల కుమిలిపోయి, ఏదో ఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలయ్యే ప్రమాదం ఉంది. మీ సంతోషం, బాధ, కోపం ప్రతి భావాన్ని ఆయనతో పంచుకోండి. దీనివల్ల ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ మనసులో ఏముందో ఆయనకు స్పష్టంగా తెలుస్తుంది, ఇది అపార్థాలకు తావివ్వదు.
ఇష్టాయిష్టాల కలయిక
ఆయనకు నచ్చిందే నాకూ నచ్చుతుంది అని సర్దుకుపోవడం మంచిదే కానీ మీకంటూ సొంత ఇష్టాయిష్టాలు ఉండటం కూడా అంతే ముఖ్యం. మీకు నచ్చినవి, నచ్చనివి భర్తతో నిర్మొహమాటంగా చెప్పండి. మీకు ఇష్టమైన రంగు, మీరు చూడాలనుకునే సినిమా, మీకు తినాలనిపించని కూర ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మీ ఇష్టాలను ఆయనతో పంచుకున్నప్పుడు, ఆయన వాటిని గౌరవించడానికి మిమ్మల్ని మరింత సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత మధురంగా మారుస్తుంది.



Click it and Unblock the Notifications