Latest Updates
-
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.!
సంభోగం మధ్యలో మూత్రం వస్తుందా? తీవ్రమైన వ్యాధికి ఇది సంకేతమా!
చాలామందికి ఉండే ఒక సమస్య ఏంటంటే..శృంగార సమయంలో సడెన్ గా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? నిస్సందేహంగా ఇది శృంగార ఆనందాన్ని దెబ్బతీసే ఒక పెద్ద యాంటీ క్లైమాక్స్. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? దీనిని ఎలా అధిగమించాలి?..లైంగిక సంపర్కం సమయంలో కలిగే ఈ అనుభూతికి అనేక కారణాలు ఉండవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం శృంగారంలో పాల్గొన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలలో G-spot ఉత్తేజితం కావడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా మూత్ర విసర్జన చేయాలనే భావన కలుగుతుంది. చాలా సందర్భాలలో ఇది నిజమైన అవసరం కాకపోవచ్చు, కేవలం ఒక రకమైన శారీరక స్పందన మాత్రమే. కొన్నిసార్లు ఇది ఉద్వేగానికి లేదా క్లైమాక్స్ చేరువవుతున్నారనడానికి కూడా ఒక సంకేతం కావచ్చు. కాబట్టి ఈ అనుభూతి అప్పుడప్పుడు కలిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎప్పుడు ప్రమాద ఘంటికలు మోగినట్లు
అయితే ఈ సమస్య ప్రతిసారీ మిమ్మల్ని వేధిస్తుంటే మాత్రం దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది మీ శరీరం ఇస్తున్న ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI): శృంగారం సమయంలో తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరికతో పాటు మూత్రంలో మంట, నొప్పి లేదా పొత్తి కడుపులో అసౌకర్యం వంటి లక్షణాలు ఉంటే అది UTIకి సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవడం మంచిది.
పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్: న్యూయార్క్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం ప్రతి నలుగురు అమెరికన్ మహిళలలో ఒకరు పెల్విక్ ఫ్లోర్ (కటి కండరాల) బలహీనత సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కండరాలు బలహీనపడటం వల్ల మూత్రాశయంపై నియంత్రణ తగ్గుతుంది. ఇది సంభోగం సమయంలో ఒత్తిడిని కలిగించి మూత్ర విసర్జన చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది. ఈ సమస్య పురుషులలో కూడా కనిపించే అవకాశం ఉంది.
సులభమైన చిట్కాలు
ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని నివారించి మీ ఏకాంత క్షణాలను మరింత ఆనందమయం చేసుకోవడానికి కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
-శృంగారానికి ఉపక్రమించే ముందు తప్పనిసరిగా మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేసుకోండి. ఇది చాలా వరకు సమస్యను నివారిస్తుంది.
-సంభోగానికి కనీసం రెండు గంటల ముందు ఆల్కహాల్, కాఫీ, టీ, నికోటిన్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఇవి డైయూరిటిక్స్ గా పనిచేసి మూత్ర ఉత్పత్తిని పెంచి మీ మూత్రాశయంపై భారం మోపుతాయి.
-ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండటం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విభిన్న భంగిమలను ప్రయత్నించండి. ఇది మీ లైంగిక జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మూత్రాశయంపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications