Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
ఒక అమ్మాయిని అర్థం చేసుకోవడం ఎలా?
అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం రా బాబు, అదో బ్రహ్మ విద్య..ఆడవాళ్ల మనసులో ఏముదో కనిపెట్టడం ఎవ్వరి తరం కాదు వంటి మాటలు తరచూ వింటుంటాం. చాలామంది మగాళ్లు తమ భార్యలను అర్థం చేసుకోడాన్ని పెద్ద సవాల్ గా, ఓ టాస్క్ మాదిరి భావిస్తుంటారు. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రోషిణి రావ్..తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ వీడియోలో చెప్పారు. అమ్మాయిలంటే డీకోడ్ చేయాల్సిన పజిల్ కాదని..పరిష్కరించడానికి గణిత సమస్యలు కాదని.. వాళ్లు కూడా మనలాంటి మనుషులే, కాస్త భిన్నమైన ఆలోచనా విధానం, భావోద్వేగాల లోతు ఉన్నవాళ్లంతేనని తెలిపారు
సమస్యను పరిష్కరించడం కాదు, వ్యక్తిని అర్థం చేసుకోవాలి
మగవారి ఆలోచనా విధానం సాధారణంగా సమస్య పరిష్కారం (problem solving) వైపు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి వెంటనే ఒక పరిష్కారం కనిపెట్టాలని చూస్తారు. ఈ క్రమంలోనే అమ్మాయి ఏదైనా బాధగా లేదా కోపంగా ఉన్నప్పుడు సమస్య ఏంటి? దాన్ని ఎలా పరిష్కరించాలి? అని ఆలోచిస్తారు. కానీ ఆ సమయంలో ఆమెకు కావాల్సింది పరిష్కారం కాదు తన బాధను ఒకరు వినాలి, తనను ఒకరు అర్థం చేసుకోవాలి అనే భరోసా మాత్రమే.

మీరు ఆమె చెప్పేది ఓపిగ్గా విని నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమవుతోంది అని ఒక్క మాట అంటే చాలు. ఆ మాట ఆమెకు వెయ్యి పరిష్కారాలతో సమానం. ఆమెను అర్థం చేసుకోవడం ఒక టాస్క్ లా అనిపించినప్పుడు అది భారంగా ఉంటుంది, కానీ అదే ఒక జర్నీగా భావిస్తే అనుబంధం నేచురల్ గా సాగిపోతుంది.
గమనించడం, వినడం, స్పందించడం..ఇదే మంత్రం
అమ్మాయిని అర్థం చేసుకోడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఆమె ప్రవర్తనను గమనించాలి, ఆమె చెప్పేది శ్రద్ధగా వినాలి, దానికి ప్రేమగా స్పందించాలని రోషిణి రావ్ చెప్పారు. ఆమె రోజంతా ఆఫీసులో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు, మీతో మాట్లాడే తీరులో కొంచెం విసుగు కనిపించవచ్చు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఈరోజు పని ఎక్కువయ్యిందా? చాలా అలసిపోయినట్లున్నావు అని అడిగి చూడండి. మీపై ఆమెకు గౌరవం, ప్రేమ రెట్టింపు అవుతాయి.
మహిళలు తమ భావాలను వ్యక్తపరిచే ముందు ఎదుటివారి మూడ్ ఎలా ఉందో గమనిస్తారు. ఈ సమయంలో ఈయనతో ఈ విషయం మాట్లాడితే ఎలా స్పందిస్తాడో అని ఆలోచించి, సరైన సమయం కోసం వేచి చూస్తారు. కానీ చాలామంది పురుషులు తాము చెప్పాలనుకున్నది ఎప్పుడైనా, ఎలాగైనా చెప్పేయవచ్చని, ఆమె తేలిగ్గా తీసుకుంటుందని అనుకుంటారని రోషిణి రావ్ తెలిపారు. ఈ చిన్న వ్యత్యాసాన్ని గ్రహిస్తే చాలు, చాలా సమస్యలు రాకుండా ఉంటాయి.
సహనం..తేడా ఇక్కడే
సాధారణంగా మహిళలకు సహనం, ఓపిక ఎక్కువగా ఉంటాయి. వారు సంబంధాలకు ఎక్కువ విలువ ఇచ్చి, చిన్న చిన్న విషయాలను సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే వారికి ఇతరులను అర్థం చేసుకోవడం అనేది సహజంగా అబ్బుతుంది. పురుషులకు సహనం కాస్త తక్కువ కాబట్టి వెంటనే ఫలితం రాకపోతే దాన్ని ఒక వైఫల్యంగా, కష్టమైన టాస్క్ గా భావిస్తారని రోషిణి రావ్ చెప్పారు.



Click it and Unblock the Notifications