Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
తొందరగా కమిట్ అవుతున్నారా? కలిసి బెడ్ రూమ్ లోకి వెళ్లేముందు తెలుసుకోవాల్సిన 5 కీలక సంకేతాలు!
ఈ రోజుల్లో అందరికీ అన్నీ తొందర తొందరగా అయిపోవాలనే ఉత్సాహం ఉండటం సహజమైన విషయమే. అయితే ప్రేమ, పెళ్లి విషయాల్లో ఇలాంటి తొందరపాటు పనికిరావు. తొలిచూపులోనే నచ్చారని, మనసులు మాటలు కలిశాయని వెంటన జీవితాంతం కలిసి ఉండాలనే బలమైన కోరిక మనసులో పుడుతుంది. అయితే ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సిన సమయమే ఇది. లవ్, నిబద్దత అనేది ఫాష్ట్ ఫుడ్ లాంటివి కాదు ఆర్ఢర్ చేసిన వెంటనే మన ముందుకు వచ్చేయడానికి. రిలేషన్ షిప్ నిపుణులు కూడా ఇదే చెబుతుంటారు. ఒకరిపై బలమైన ఆకర్షణ కలిగినప్పుడు ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రెండో డేట్ కు తొందరపడటంతో తప్పులేదు కానీ నిబద్దత అనే పెద్ద అడుగేయడానికి మాత్రం తొందరపాటు పనికిరాదు.
సంబంధం అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే బ్యూటిఫుల్ జర్నీ. అంతేకానీ ఏదో సాయంత్రం పూట పబ్ లోనో లేదా పార్టీలోనో లేదా మరెక్కడైనా సరదాగా కాసేపు గడిపినంత మాత్రానా లేదా కొన్ని తీపి మాటలు పంచుకున్నంత మాత్రానా జీవితం మొత్తం కలిసి నడవాలనే నిర్ణయానికి రావడం అవివేకం అవుతుంది. అవతలి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్లు ఎలా స్పందిస్తారు?మీ ఇష్టాయిష్టాలను గౌరవిస్తారా?ఫ్రెండ్స్, కొత్తవాళ్లతో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటది? ఈ ప్రశ్నలన్నింటికీ కరెక్ట్ సమాధానం లభించినప్పుడే వారి నిజమైన వ్యక్తిత్వం మీకు అర్థమవతుంది. అంతిమంగా నిబద్దత అనేది గుడ్డిగా తీసుకునే డెసీషన్ కాదు..అన్నీ ఆలోచించి సృహతో తీసుకునే నిర్ణయం కావాలని గుర్తుపెట్టుకోవాలి.

స్పీడ్ కాదు సృష్టతే ముఖ్యం
సంబంధంలో స్పీడ్ అనేది కత్తిమీద సాము లాంటిది. చాలా స్పీడ్ గా వెళ్తే అవతలి వ్యక్తిలోని లోపాలను, ముఖ్యమైన విషయాలను గమనించలేకపోవచ్చు.. అదే సమయంలో మరీ స్లో గా ఉండే బంధంలో ఉన్న ఉత్సాహం నీరుకారిపోెయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ టైం కోసం ఎదురుచూడాలి. మీతో సమయం గడపడం బాగుంది అనే స్టేజ్ నుంచి నా భవిష్యత్తులో నిన్ను చూడాలనుకుంటున్నాను అనే దశకు మారడానికి కొన్ని వారాలు లేదా నెలలు లేదా కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కాబట్టి ఇక్కడ అసలు విషయం స్పీడ్ కాదు సృష్గతే.
నిబద్దతకు ముందు గమనించాల్సిన ముఖ్యమైన సంకేతాలు
స్థిరత్వం,నిజాయితీ: అవతతి వ్యక్తి చెప్పే మాటలకు,చేసే చేష్టలకు పొంతనా ఉందా,వాళ్లు నిజాయితీగా ఉంటన్నారా లేదా మిమ్మలి ఆకట్టుకోవడం కోసం నటిస్తున్నారా? అనేది గమనించుకోవాలి.
నమ్మకం, సేఫ్టీ: వాళ్ల ముందు మీ మనసులోని మాటలను భయం లేకుండా ఎలాంటి రిప్లై ఇస్తారోనన్న ఆందోళన లేకుండా చెప్పగలరా అనే కూడా గమినించాల్సిన విషయం
గౌరవం: వారు మిమ్మల్ని మాత్రమే కాకుండా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, అపరిచితులను ఎలా గౌరవిస్తున్నారో,వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా గమనించాలి. ఎందుకంటే గౌరవం అనేది సెలక్ట్ చేసుకునేది కాదు..ప్రతి చోటా కనబడాలి.
గొడవ పరిష్కారం: మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదా జరిగితే దాన్ని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారా లేక ఎదుటోళ్లపై నిందలు వేసి గొడవ పెద్దది చేస్తారా అనేది కూడా గమినించాలి.



Click it and Unblock the Notifications