Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అవకాశాలతో పాటు కొత్త కొత్త సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ప్రేమ విషయంలో కూడా ఇది ఉంటుంది. ఒకప్పుడు తొలిచూపులోనే ప్రేమ అంటూ కవిత్వం రాసుకునే రోజులు పోయి ఇప్పుడంతా డేటింగ్ యాప్ లు, సోషల్ మీడియా ప్రొఫైల్ లు, బయోడేటాలే బంధాలను నిర్ణయిస్తున్నాయి.
అయితే ముఖం తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని, జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అందుకే డేటింగ్ యాప్స్ ద్వారా అడుగు ముందుకు వేసే ముందు కొన్ని చేయకూడని,చేయాల్సిన విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

చేయకూడని తప్పులు
రహస్యాలు ఇప్పుడే వద్దు
డేటింగ్ యాప్ లో ఎవరైనా చూడగానే నచ్చవచ్చు లేదా వారితో చాటింగ్ చేయడం బాగుండవచ్చు. అలాగని, పరిచయమైన కొత్తలోనే మీ వ్యక్తిగత విషయాలు, అత్యంత రహస్యాలను వారితో పంచుకోకండి. కేవలం రోజూ మాట్లాడుతున్నంత మాత్రాన అది గాఢమైన బంధం కాదు. ఎదుటివారి స్వభావం పూర్తిగా తెలియకుండా ఓపెన్ బుక్ లా మారిపోతే భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి రావచ్చు.
సోషల్ మీడియాలో గూఢచర్యం వద్దు
ఒక వ్యక్తి నచ్చగానే వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తం జల్లెడ పట్టడం సహజం. అయితే వారి పాత ఫోటోలను చూసి అనవసరమైన అనుమానాలు పెంచుకోవడం లేదా వాటి గురించి వారిని పదే పదే ప్రశ్నించడం చేయకండి. ఇది మీపై నెగెటివ్ ఇంప్రెషన్ ను కలిగిస్తుంది. గతం కంటే వర్తమానం ముఖ్యం అని గుర్తుంచుకోండి.
రెడ్ ఫ్లాగ్స్ ను విస్మరించవద్దు
పరిచయమైన కొద్దిరోజులకే అవతలి వ్యక్తి అతిగా చొరవ తీసుకుంటున్నా, మిమ్మల్ని జోక్ పేరుతో కించపరిచినా, లేదా ఉద్దేశపూర్వకంగా మీ ప్రశ్నలను దాటవేస్తున్నా అప్రమత్తం అవ్వండి. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకండి. అవసరమైతే నిర్మొహమాటంగా చెప్పేసి ఆ పరిచయానికి స్వస్తి చెప్పడమే ఉత్తమం.
చేయాల్సిన పనులు
లక్ష్యంపై స్పష్టత
అసలు మీరు డేటింగ్ యాప్ లో ఎందుకున్నారు? జీవితాంతం తోడుండే భాగస్వామి కోసమా? లేక కేవలం కాలక్షేపం కోసమా? ఈ విషయంలో ముందు మీకెంతో స్పష్టత ఉండాలి. అలాగే మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఉద్దేశం కూడా అదేనా అని నిర్ధారించుకోండి. ఇద్దరి దారులు వేరైనప్పుడు, అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ విషయాన్ని ముందే చర్చించడం ఆరోగ్యకరం.
నిజాయితీ ముఖ్యం
మీ ప్రొఫైల్ ను ఎట్రాక్టివ్ గా మార్చుకోవడం తప్పు కాదు కానీ అందులో అబద్ధాలు ఉండకూడదు. ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం దీర్ఘకాలిక బంధానికి పునాది కాలేదు. మీరేంటో నిజాయితీగా చెప్పగలిగినప్పుడే సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు.
అభిరుచులే వారధి
ఇద్దరి మధ్య సంభాషణ బోర్ కొట్టకుండా సాగాలంటే కామన్ ఇంట్రెస్ట్స్ చాలా ముఖ్యం. ఎదుటివారిని అర్థం చేసుకున్నాక మీకు నచ్చిన పుస్తకాలు, సినిమాలు, వెబ్ సిరీస్ లు లేదా మ్యూజిక్ గురించి చర్చించండి. అభిరుచులు కలిసినప్పుడు స్నేహం వేగంగా, గాఢంగా మారుతుంది.



Click it and Unblock the Notifications