Latest Updates
-
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.? -
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.!
గర్ల్ ఫ్రెండ్ ఖర్చులను ఎక్స్ఎల్ షీట్ లో పంపించిన మాజీ ప్రియుడు, జీఎస్టీ, ఈఎంఐ ఫెసిలిటి
యువతి, యువకులు ప్రేమించినప్పుడు ప్రపంచాన్ని మరచిపోతారు. ఒకరికొకరు ఎంత డబ్బు ఖర్చు చేసుకున్నామో అనే లెక్కలు వెయ్యరు. హోటళ్లు, పార్కులు, సినిమా థియేటర్ల చుట్టూ తిరిగే జంటలు ఒకరికొకరు బహుమతులు ఇస్తూ తమ ప్రేమను పంచుకుంటారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇండిపెండెంట్‌గా ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు బాయ్‌ఫ్రెండ్‌కి కాఫీ, టీ బిల్లులు ఇవ్వడంతో పాటు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తున్నారు.
ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ ఖర్చులు పెట్టుకుని తరువాత ఆ జంట విడిపోయాక వాళ్ల పద్దతి మారుతుంది. వారు తమ జీవిత భాగస్వామికి చాలా డబ్బు ఖర్చు చేశామని అంటూ వారి వెంట తిరుగుతారు. విడిపోయిన తర్వాత కొంతమంది జంటలు తమకు వచ్చిన బహుమతిని తిరిగి ఇచ్చేస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే గతంలో చేసిన ఖర్చులను తన మాజీ గర్ల్ ఫ్రెండ్, మాజీ బాయ్ ఫ్రెండ్ నుంచి వసూలు చెయ్యాలనే సాహసం చేస్తారు.

Image courtesy
అలాంటి వ్యక్తి అతని మాజీ ప్రియురాలి కోసం ఖర్చు పెట్టిన బిల్లు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అది విపరీతంగా వైరల్‌గా మారింది.
వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన బాయ్ ఫ్రెండ్ విడిపోయిన తర్వాత అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ కు ఖర్చుల జాబితాను పంపించాడు. తన ప్రియురాలు విడిచిపెట్టి వెళ్లిపోయింది అనే బాధకంటే ఆమెపై చేసిన ఖర్చు అతనిలో ఆందోళనను పెంచింది. అందుకే కాఫీ, టీ, సిగరెట్ తో సహా ప్రియురాలికి చేసిన ఖర్చులన్నీ ఓ ఎక్స్ఎల్ షీటులో రాసి అతని మాజీ ప్రియురాలికి పంపించాడు.
దీనికి జీఎస్టీ కూడా తోడవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ Xలో @sehahaj అనే అకౌంట్ హోల్డర్ ఆమె రూమ్‌మేట్ అందుకున్న బిల్లు ఫోటోను షేర్ చేసింది. రూమ్‌మేట్ ఆదిత్య అనే సీఏ అబ్బాయితో ఆమె డేటింగ్ చేస్తోంది. విడిపోయిన తర్వాత ఆదిత్య ఖర్చులన్నింటినీ ఎక్సెల్ షీట్‌లో జాబితా చేసి ఆమెకు పంపాడు. ఆదిత్య బిల్లును విభజించలేదని, క్యాష్ ఆన్ డెలివరీపై బహుమతిని పంపుతున్నాడని సాక్షి పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
సాక్షి ఆమె రూమ్‌మేట్ ఆదిత్యతో ఏడు నెలల పాటు డేటింగ్ చేసింది. ఈ సమయంలో వారిద్దరూ ఎంత ఖర్చు చేశారో ఆదిత్య బిల్లు పెట్టాడు. సిగరెట్, కాఫీ, హోటళ్లు, షాపింగ్, స్టేషనరీ, సినిమా, పార్టీలతో సహా అన్ని ఖర్చులను జాబితాలో ఆదిత్య అందులో చేర్చాడు. అతను మార్టిన్ కోయిల్‌ను కూడా జోడించాడు. వీరిద్దరూ ఏడు నెలల్లో లక్షకు పైగా ఖర్చు చేశారు. సాక్షి రూమ్ మేట్ షేర్ రూ. 51 వేలు. ఆదిత్య దానికి 18 శాతం జీఎస్టీని జోడించాడు కాబట్టి అతని మాజీ స్నేహితురాలి ఖర్చులు రూ. 60 వేలు అయ్యింది.
ఆదిత్యను తన ఇష్టానుసారం వదిలిపెట్టకుండా తన మాజీ ప్రియురాలికి డబ్బు చెల్లించేందుకు ఈఎంఐ సదుపాయం కూడా ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ ఆప్షన్‌ను ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఈఎంఐతో పాటు అతని మాజీ ప్రియురాలు 4 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆదిత్య తెలిపారు.
ఎక్స్‌పై సాక్షి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది ఇప్పటివరకు 13 లక్షలకు పైగా చూశారు. సాక్షి పోస్ట్‌పై పలువురు వ్యాఖ్యానించారు. అలాంటి శాడిస్టు, విచిత్రమైన అబ్బాయితో ఆమె ఎలా డేట్ చేసిందని ఓ వ్యక్తి కామెంట్ చెయ్యగా, ఎక్సెల్ షీట్, ఈఎంఐ సెలక్షన్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుందని మరొకరు కామెంట్ చేశారు. మొత్తం మీద ఆదిత్య ఇచ్చిన షాక్ కు అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ బిత్తరపోయింది.



Click it and Unblock the Notifications