Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పెళ్లయిన మొదటి ఏడాదిలో అస్సలు చేయకూడని 3 పనులు..పొరపాటున చేస్తే జీవితం నాశనం!
ప్రతి మనిషికి పెళ్లి అనేది అత్యంత ప్రత్యేకమైన విషయం. పెళ్లి అనగానే మనసులో అనేక ఆలోచనలు, కోరికలు మొదలవుతాయి. ఎంతో ఉత్సాహంగా పెళ్లి చేసుకున్నాక ఒకరినొకరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడంలో చాలా జంటలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా పెళ్లయిన మొదటి సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలతో, కొత్త అనుభూతులతో నిండి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరి ప్రపంచంలోకి మరొకరు అడుగుపెట్టి, కలల సౌధాన్ని నిర్మించుకునే సమయం ఇది. అయితే, ఈ ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో, అంత సున్నితంగా కూడా ఉంటుంది
ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే క్రమంలో కొన్ని సవాళ్లు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. పెళ్లైన తొలి ఏడాదిలోనే కొన్ని తప్పులు జరిగితే జీవితం మొత్తం కలిసి గడపడం కష్టం అవచ్చు. ప్రముఖ రిలేషన్‌షిప్ కోచ్ కోమల్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొత్త జంటలు మొదటి సంవత్సరంలో అస్సలు చేయకూడని మూడు ముఖ్యమైన తప్పుల గురించి వివరించారు. అవేంటో ఇక్కడ చూడండి.

కఠినమైన నిర్ణయాలను వాయిదా వేయడం
పెళ్లైన కొత్తలో అంతా సంతోషంగా ఉండాలని, ఎలాంటి గొడవలు రాకూడదని చాలా జంటలు భావిస్తాయి. ఈ క్రమంలో డబ్బు, కుటుంబ బాధ్యతలు లేదా కెరీర్ కు సంబంధించిన కఠినమైన చర్చలను, నిర్ణయాలను వాయిదా వేస్తుంటారు. ఇప్పుడెందుకులే, తర్వాత చూసుకుందాం అనే ధోరణి ప్రమాదకరం. సమస్యను నెట్టేయడం వల్ల అది మాయం కాదు మరింత పెద్దదిగా మారుతుంది. చిన్న చిన్న అసంతృప్తులు పేరుకుపోయి, భవిష్యత్తులో పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. కాబట్టి సమస్య తలెత్తినప్పుడే దాని గురించి ధైర్యంగా, గౌరవంగా మాట్లాడుకోవాలి. కలిసి కూర్చుని ఒక పరిష్కారం కనుగొనడం వల్ల మీ మధ్య నమ్మకం, అవగాహన రెండూ పెరుగుతాయి.
మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం
పెళ్లి తర్వాత నేను కాస్తా మేముగా మారడం చాలా అందమైన విషయం. కానీ ఈ క్రమంలో మీ సొంత అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోకూడదు. చాలా మంది తమ భాగస్వామే తమ ప్రపంచం అనుకుని, తమ స్నేహితులను, ఇష్టాలను, అభిరుచులను వదిలేస్తుంటారు. తమ ఆనందం పూర్తిగా అవతలి వ్యక్తిపైనే ఆధారపడి ఉందని భావిస్తారు. ఇది మొదట్లో ప్రేమగా అనిపించినా, రాను రాను బంధంలో ఊపిరాడని పరిస్థితిని సృష్టిస్తుంది. ప్రతి చిన్న విషయానికి భాగస్వామిపై ఆధారపడటం, వారి నుంచి నిరంతరం ఆనందాన్ని ఆశించడం నిరాశకు దారితీస్తుంది. ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు కలిస్తేనే ఒక ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుంది. మీకంటూ సొంత ప్రపంచాన్ని కాపాడుకోవడం మీ బంధానికి కొత్త శక్తిని ఇస్తుంది.
పరిపూర్ణతను ఆశించడం
సినిమాల్లో, కథల్లో చూపించినట్లు వివాహ బంధం ఎప్పుడూ ఒక అద్భుత కథలా సాగిపోదు. జీవితంలో ఎత్తుపల్లాలు ఉన్నట్లే బంధంలోనూ ప్రేమ, గొడవలు, సర్దుబాట్లు అన్నీ ఉంటాయి. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు, ఏ బంధమూ లోపాలు లేకుండా ఉండదు. "నా భాగస్వామి ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోవాలి, మా మధ్య అస్సలు గొడవలే రాకూడదు వంటి అవాస్తవ అంచనాలు పెట్టుకున్నప్పుడు, అవి నెరవేరనప్పుడు తీవ్రమైన నిరాశ కలుగుతుంది. వివాహం అంటే ఇద్దరు అపరిపూర్ణ వ్యక్తులు కలిసి, ఒకరికొకరు తోడుగా ఉంటూ, తమ బంధాన్ని పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేయడమే. వాస్తవాన్ని అంగీకరించి, మీ భాగస్వామిలోని లోపాలను కూడా ప్రేమతో స్వీకరించినప్పుడే మీ బంధం కలకాలం నిలుస్తుందని రిలేషన్‌షిప్ కోచ్ కోమల్ తెలిపారు. ఈ మొదటి సంవత్సరం ఒకరినొకరు నేర్చుకునే పాఠశాల లాంటిది. ఈ ప్రయాణంలో పైన చెప్పిన తప్పులను నివారించగలిగితే మీ వైవాహిక జీవితం మరింత ఆనందమయంగా, దృఢంగా మారుతుంది.



Click it and Unblock the Notifications