Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
సంబంధాలలో కొత్త ప్రమాదం 'గోస్ ట్‌లైటింగ్'..మాయమై మళ్ళీ వచ్చే భాగస్వామితో జాగ్రత్త
ప్రేమ, రిలేషన్స్ ప్రపంచం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా కొత్త కొత్త పదాలు, వింత పోకడలు మనల్ని పలకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం గోస్ట్ లైటింగ్. గోస్ట్‌లైటింగ్ మరింత గందరగోళంగా, మానసిక క్షోభకు గురిచేసేలా ఉంటుంది.
సంబంధాలు ముగిసిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి,జంటలు రకరకాలుగా విడిపోతారు. అయితే గోస్ట్ లైటింగ్ అనేది ఒక విడిపోయే పద్ధతి మాత్రమే కాదు, అది ఒక మానసిక దాడి. ఇందులో మీ భాగస్వామి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఒక దెయ్యంలా అకస్మాత్తుగా మీ జీవితం నుండి అదృశ్యమవుతారు. ఆ తర్వాత ఏమీ జరగనట్టు కొన్ని రోజులకు లేదా వారాలకు మళ్లీ ప్రత్యక్షమవుతారు. ఈ వింత ప్రవర్తన ఎదుటివారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

గోస్ట్‌లైటింగ్ ఎందుకంత ప్రమాదకరం?
గోస్ట్‌లైటింగ్ అత్యంత ప్రమాదకరమైనదిగా భావించడానికి కారణం ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తుంది. ఇందులో అవతలి వ్యక్తి మిమ్మల్ని తీవ్రమైన అపరాధభావనకు గురిచేస్తారు. వారి అదృశ్యానికి మీరే కారణమని పరోక్షంగా నిందిస్తారు. దీంతో మీరు మీ సొంత భావాలను, నిర్ణయాలను, చివరికి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తారు. వారు ఎలాంటి తప్పు చేయనట్లుగా తిరిగి వచ్చి మాట్లాడినప్పుడు, మీరు వారిని నిలదీస్తే..నువ్వే ఎక్కువగా ఊహించుకుంటున్నావు లేదా "నేను బిజీగా ఉన్నాను, అర్థం చేసుకోలేవా?అంటూ మిమ్మల్నే తప్పుబడతారు. ఈ మానసిక గందరగోళం మీలో తీవ్రమైన ఆందోళనను, ఒంటరితనాన్ని నింపుతుంది. ఇది మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే దీనిని నివారించడం చాలా ముఖ్యం.
గోస్ట్ లైటింగ్ సంకేతాలు ఇవే..
ఈ ప్రమాదకరమైన పోకడను గుర్తించడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.
ఆకస్మిక అదృశ్యం
నిన్నటి వరకు మీతో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడిన వ్యక్తి, ఈ రోజు ఉన్నపళంగా మాయమైపోతాడు. మీ ఫోన్ కాల్స్‌కు సమాధానం ఉండదు, మీ మెసేజ్‌లకు రిప్లై రాదు. ఎలాంటి వివరణ లేకుండా అకస్మాత్తుగా కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోతుంది.
గందరగోళం సృష్టించడం: వారు మిమ్మల్ని పూర్తిగా విస్మరించరు. మీ ఫోన్ ఎత్తరు, కానీ మీ సోషల్ మీడియా పోస్టులను లైక్ చేస్తారు. మీ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను చూస్తారు. ఈ మిశ్రమ సంకేతాలు మీకు అంతుపట్టక సంబంధం ఉందా? లేదా? అనే తీవ్రమైన అయోమయంలో పడేస్తాయి.
తప్పు మీదేనని నిరూపించడం
కొన్ని రోజుల తర్వాత వారు తిరిగి వచ్చి, మీరు వారి ప్రవర్తన గురించి ప్రశ్నించినప్పుడు, తెలివిగా మాట మార్చేస్తారు. వారిని నిలదీసినందుకు తప్పు మీదేనని నెట్టేస్తారు. "నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావ్," "ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తావు" వంటి మాటలతో మీ భావాలను తక్కువ చేసి మాట్లాడతారు.
విష వలయం
ఇది ఒక నిరంతర ప్రక్రియలా సాగుతుంది. వారు మిమ్మల్ని విస్మరిస్తారు, కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తారు, మీతో మామూలుగా ఉంటారు, మళ్ళీ అదృశ్యమవుతారు. ఈ విష వలయంలో చిక్కుకుని మీరు మానసికంగా కుంగిపోతారు.



Click it and Unblock the Notifications