Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Backup Partner: మీ భార్యకి 'ప్లాన్ B' ఉందా? ఆందోళన కలిగించే నిజాలు
ఏ బంధంలో అయినా 3 ముఖ్యమైనవి వింటే అది జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. బంధానికి ముఖ్యమైన ఆ 3 ఏంటంటే..ప్రేమ, నమ్మకం, అంకితభావం. వీటిని బంధాలకు పునాదులుగా చెబుతారు. ఈ పునాదులు ఎంత గట్టిగా ఉంటే ఆ బంధం అంత గట్టిగా ఉంటుంది. అయితే ఈ నమ్మకాన్ని కదిలించే ఒక చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బ్రిటన్ దేశానికి చెందిన వన్ పోల్ అనే సంస్థ వెయ్యి మంది మహిళలపై జరిపిన ఒక సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
ఆ సర్వే ప్రకారం ప్రతి ఇద్దరు మహిళలలో ఒకరు తమ ప్రస్తుత సంబంధం విఫలమైతే..వెంటనే ఆధారపడటానికి ఒక బ్యాకప్ పార్టనర్ ను సిద్ధంగా ఉంచుకుంటున్నారని తేలింది. వివాహిత స్త్రీలు కూడా ఈ జాబితాలో ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం. వివాహేతర సంబంధాలకు ఇది అప్ డేటెడ్ వెర్షన్ లాంటిది అని చెప్పుకోవచ్చు.

ఎవరీ బ్యాకప్ భాగస్వామి?
ఈ బ్యాకప్ భాగస్వామి ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడలేదు. మనకు తెలిసినవాళ్లే. సర్వే ప్రకారం చాలా సందర్భాలలో ఈ వ్యక్తి ఒక పాత స్నేహితుడు, గతంలో మీపై ప్రేమను చూపించి అప్పుడు మీరు అంగీకరించకపోయినా ఇప్పటికీ మీతో టచ్‌లో ఉండే వ్యక్తి. మరికొందరి విషయంలో అది మాజీ ప్రియుడు, ఆఫీస్‌లో తోటి ఉద్యోగి లేదా జిమ్‌లో పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు. అంటే ఈ వ్యక్తితో ఇప్పటికే ఒక భావోద్వేగ బంధం లేదా కనీసం సంభాషణ అయినా ఉంటుంది. ప్రస్తుత బంధంలో ఏదైనా సమస్య వస్తే ఈ వ్యక్తి వెంటనే వచ్చి తమకు ఓదార్పునిస్తాడని, అండగా నిలుస్తాడని మహిళలు బలంగా నమ్ముతున్నారు.ః
ఈ ధోరణికి కారణాలేంటి?
ఈ ప్లాన్ బి మనస్తత్వం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భావోద్వేగ భద్రత కోసం మహిళలు ఇలా చేస్తున్నారని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత భాగస్వామితో గొడవలు జరిగినప్పుడు లేదా ఇద్దరి మధ్య దూరం పెరిగినప్పుడు నేను ఒంటరిని కాను.. నాకోసం మరొకరు ఉన్నారు అనే ధీమా వారికి కావాలి. అంతేకాకుండా సోషల్ మీడియా కూడా ఈ ధోరణికి ఆజ్యం పోస్తోంది. ఒకప్పుడు బంధాలను నిలబెట్టుకోవాలనే తపన ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో ఇది కాకపోతే ఇంకొకటి అనే ధోరణి పెరిగిపోయింది.
ఈ బ్యాకప్ ఆలోచన బంధాలకు ప్రమాదకరమా?
నిజమైన బంధానికి పునాదులే నమ్మకం, అంకితభావం. మనసులో మరొకరిని ప్లాన్ బి గా పెట్టుకుని, ప్రస్తుత భాగస్వామితో నూటికి నూరు శాతం నిజాయితీగా, ప్రేమగా ఉండగలమా? ఈ ఆలోచనే బంధం లోతును తగ్గించి, దానిని బలహీనపరుస్తుంది. ఇది భాగస్వాముల మధ్య నిజాయితీని, భావోద్వేగ అనుబంధాన్ని దెబ్బతీసి దీర్ఘకాలిక సహవాసాన్ని ప్రశ్నార్థకం చేస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ సంబంధంలో ఇలాంటి బ్యాకప్ ఆలోచనలకు తావులేకుండా చూసుకోవడం ఇద్దరికీ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications