Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
పోయేకాలం పీక్ స్టేజ్ కు వచ్చేసింది, నా భార్య కాల్ గర్ల్, బావమరిది బ్రోకర్, ఫేస్ బుక్ లో ఫుల్ డిటైల్స్
భార్యతో చక్కగా సంసారం చేస్తున్న భర్తకు పోయేకాలం దగ్గరకు వచ్చింది. ఏడాది నుంచి తప్పుదోవపట్టిన భర్త అతని భార్యను పట్టించుకోవడం మానేశాడు. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను వదిలేసిందని భర్త రగిలిపోయాడు. ఫేస్ బుక్ లో నకిలి అకౌంట్ ఓపెన్ చేసిన భర్త అందులో అతని భార్య ఫోటోలు, ఫోన్ నెంబర్ పెట్టి ఈమె కాల్ గర్ల్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చెయ్యండి అని ఫుల్ డిటైల్స్ పెట్టాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో భార్య వదిలేసి వెళ్లిపోయిందనే పగతో ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి ఆమె ఫొటో, ఫోన్ నంబర్ పెట్టి కాల్‌గర్ల్ అని పోస్ట్ చేసి కట్టుకున్న భార్యను వేధించాడు. బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మోసపోయిన భార్య ఫిర్యాదు చెయ్యడంతో అప్పటికే కిలాడీ మొగుడు విదేశాలకు పారిపోయాడని వెలుగు చూసింది సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి 2019లో రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

వివాహం జరిగిన తరువాత సత్యనారాయణ రెడ్డి, రూపా దంపతులు బాగానే ఉన్నారు. వీరి పెళ్లికి, సుఖ సంసారాని సాక్షంగా ఓ కూతురు కూడా పుట్టింది. అంతా సవ్యంగా సాగిపోతుందని అందరూ అనుకుంటున్న సమయంలో అసలు సమస్య వచ్చిపడింది. గత ఏడాది కాలంగా భర్త సత్యనారాయణ రెడ్డి దారితప్పాడు. ఇంటి నిర్వహణకు భర్త సత్యనారాయణ రెడ్డి సరిగా సహకరించకపోవడంతో అతన్ని భార్య రూపా ప్రశ్నించింది.
తరువాత దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగాయి. ఆపై గత ఏడాది కాలంగా భార్య రూపాను ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు.
భర్త వేధింపులు భరించలేక భార్య రూపా ఇల్లు వదిలి ఆమె స్వగ్రామానికి వెళ్లిపోవాలని అనుకుంది. ఆ సమయంలో భార్య రూపా తమ్ముడు కూడా బెంగళూరు వచ్చి మా సోదరిని మేము బాగా చూసుకుంటామని, ఇక ముందు మా జోలికిరావద్దు అని బావ సత్యనారాయణ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. తరువాత సత్యనారాయణ రెడ్డి బావ మరిది రూపాను వాళ్ల ఇంటికి తీసుకెళ్ళిపోయాడు..
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన సత్యనారాయణ రెడ్డి ఏం చేయాలో తోచక సోషల్ మీడియాను ఆశ్రయించాడు. తన భార్య పరువును ఎలా తియ్యాలి అంటూ సోషల్ మీడియాలో వెతికాడు. ఆ సందర్బంలో కేటుగాడు సత్యనారాయణ రెడ్డికి ఓ ఐడియా వచ్చింది. సత్యనారాయణ రెడ్డి అతని భార్య పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా ప్రారంభించాడు. అలాగే అతని భార్య ఫొటోను కాల్‌గర్ల్‌గా చిత్రీకరించి ఫేస్ బుక్ లో అప్‌లోడ్ చేశాడు. దానికి తోడు మీకు ఎప్పుడైనా ఈ అమ్మాయి కావాలంటే కాల్ చేయండి అంటూ అతని భార్య ఫోన్ నెంబర్ అందులో పోస్టు చేశాడు.
పనిలో పనిగా ఈమెకు ఇతను బ్రోకర్ అంటూ బావమరిది మొబైల్ నంబర్‌ను పోస్ట్ చేశాడు.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో ఈ తరహా పోస్ట్ పెట్టిన వెంటనే అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు చాలా మంది ఫోన్లు చేశారు. అంతేకాకుండా అదే ఫోన్ నెంబర్ వాట్సాప్ కు మెసేజ్ లు పంపుతూ వేధించడం మొదలుపెట్టారు. మీ రేటు ఎంత? ఎంత డబ్బులు ఇస్తే ఎంత సమయం ఉంటారు ? అంటూ ఫోన్ చేసి అడిగారు.
ఇలాంటి ఫోన్లు రావడంతో సత్యనారాయణ రెడ్డి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఆ తర్వాత అనుమానం వచ్చి ఆమె ఫేస్‌బుక్ ఖాతాలు తనిఖీ చేయగా ఆమె పేరుతో నకిలీ ఖాతా తెరిచినట్లు గుర్తించారు. ఇలాంటి పని తన భర్త సత్యనారాయణ రెడ్డి చేసి ఉంటాడని ఆమెకు తెలిసింది. దీని తర్వాత సత్యనారాయణ రెడ్డి భార్యకు, ఆమె తమ్ముడికి ఇలాంటి ఫోన్ కాల్స్ ఎక్కువ కావడం, ఒక నైట్ కు ఆమె రేటు ఎంత అంటూ ఫోన్లు చేసి ప్రశ్నించడంతో వారు విసిగిపోయారు.
ఈ వేధింపులు భరించలేక భార్య, ఆమె కుటుంబ సభ్యులు బెంగళూరులోని నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సత్యనారాయణ రెడ్డి కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే నిందితుడు సత్యనారాయణ రెడ్డి అప్పటికే విదేశాలకు వెళ్లిపోయాడని, అక్కడి నుంచే నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించాడని తెలుసుకున్నారు. విదేశాల్లో ఉన్న సత్యనారాయణ రెడ్డిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భార్య మీద పగతో ఆమె జీవితాన్ని నాశనం చేసిన భర్త కోసం పోలీసులు వెయిటింగ్ లో ఉన్నారు.



Click it and Unblock the Notifications