Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
బెడ్ మీద పడుకున్నప్పుడు మీ ఆవిడ పాదాలు చల్లగా ఉంటాయా? కారణం ఇదే!
చలికాలంలో చాలా ఇళ్లలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి పూట దుప్పటి కప్పుకుని పడుకున్నప్పుడు భర్త వెచ్చగా ఉన్నాడని భార్య తన చల్లని పాదాలను భర్త కాళ్ళకు ఆనిస్తుంది. ఆ చలికి భర్త ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు.. మీలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది?
ఒకే గదిలో, ఒకే ఉష్ణోగ్రతలో ఉన్నప్పటికీ భార్యాభర్తల శరీర ఉష్ణోగ్రతల్లో ఇంత తేడా ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. ఇటీవలే నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ విషయం కేవలం అపోహ కాదు, ఇది పూర్తిగా జీవశాస్త్రపరమైన నిజం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

మహిళలే ఎక్కువ వేడిని కలిగి ఉంటారు.. కానీ
పురుషుల కంటే మహిళల శరీర అంతర్గత ఉష్ణోగ్రత 0.5 నుండి 1 డిగ్రీ ఎక్కువగా ఉంటుంది. కానీ వారి చేతులు, కాళ్ళు మాత్రం పురుషుల కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి.
అంటే స్త్రీల శరీరం లోపల వేడిగా ఉన్నా, బయటకు మాత్రం చల్లగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్లు, కండరాలు, జీవక్రియ.
హార్మోన్ల మాయాజాలం
స్త్రీలలో ప్రధానమైన హార్మోన్ ఈస్ట్రోజెన్. ఇది రక్తాన్ని చిక్కగా చేసి, రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. చలి పెరిగినప్పుడు స్త్రీల శరీరం సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది. గుండె, గర్భాశయం వంటి ముఖ్యమైన అవయవాలను వెచ్చగా ఉంచడానికి ఈస్ట్రోజెన్ కాళ్ళు, చేతుల చివరలకు వెళ్లే రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అందుకే వారి పాదాలు ఐసు ముక్కల్లా మారతాయి.
మరోవైపు పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు లేదా చలికి అంత త్వరగా స్పందించదు. అందుకే పురుషుల చేతులు, కాళ్ళకు రక్త ప్రసరణ సాఫీగా జరిగి అవి వెచ్చగా ఉంటాయి.
కండరాలే హీటర్లు
పురుషులలో టెస్టోస్టెరాన్ కారణంగా కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. సగటున పురుషులలో 40 శాతం కండరాలు ఉంటే, స్త్రీలలో అది 30 శాతం మాత్రమే ఉంటుంది. శరీరం వేడిని ఉత్పత్తి చేయడంలో కండరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువ కండరాలు ఉంటే ఎక్కువ వేడి పుడుతుంది. అందుకే పురుషులు సహజంగానే ఎక్కువ వెచ్చదనాన్ని కలిగి ఉంటారు.
మెటబాలిజం
పురుషుల బేసల్ మెటబాలిక్ రేట్ (BMR) స్త్రీల కంటే 5-10 శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే పురుషులు విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ కేలరీలను కరిగించి ఎక్కువ శక్తిని, వేడిని విడుదల చేస్తారు. స్త్రీలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ అది అంతర్గత అవయవాలను వెచ్చగా ఉంచడానికే సరిపోతుంది తప్ప చర్మాన్ని వెచ్చగా ఉంచడానికి కాదు.
కాబట్టి ఈ శీతాకాలంలో మీ భార్య చేతులు చల్లగా ఉన్నాయని కంప్లెయింట్ చేస్తే, అది ఆమె తప్పు కాదు.. అది ఆమె శరీర నిర్మాణం చేసే మాయ అని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications
