Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఇలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలు పడి చస్తారు..దేనికైనా రెఢీ అంటారు..మీలో ఈ లక్షణాలున్నాయా?
స్కూల్స్, కాలేజీ లేదా ఆఫీసుల్లో మనం తరచుగా ఒక విషయాన్ని గమనిస్తుంటాం. కొందరు పురుషులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. వారి చుట్టూ ఎప్పుడూ మహిళలు ఉండటం, వారితో మాట్లాడటానికి, సమయం గడపటానికి ఆసక్తి చూపడం కనిపిస్తుంది. అయితే ఈ ఆకర్షణకు కారణం కేవలం అతని అందం, కీర్తి లేదా హోదా మాత్రమే కాదు. నిజానికి స్త్రీలు ఎక్కువగా వ్యక్తిత్వంతో ప్రేమలో పడతారని నిపుణులు చెబుతున్నారు. పురుషులలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు, అలవాట్లు వారిని సులభంగా ఆకర్షిస్తాయట. అవేంటో ఇక్కడ చూడండి.
సున్నితత్వం, అర్థం చేసుకునే గుణం
అమ్మాయిలు ఎక్కువగా భావాలకు విలువ ఇస్తారు. తమను ప్రత్యేకంగా భావించేలా చేసే పురుషుడిని వారు ఎంతగానో ఇష్టపడతారు. సున్నితమైన మనస్తత్వం, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం ఉన్న పురుషులంటే మహిళలకు అమితమైన ఇష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం సంతోషంలోనే కాకుండా కష్ట సమయాల్లోనూ తోడుగా నిలిచే భరోసా ఇచ్చే వ్యక్తి వారి హృదయాన్ని సులభంగా గెలుచుకుంటాడట.

నిజాయితీ, గౌరవం
ఏ బంధానికైనా నిజాయితీ, గౌరవం అనేవి పునాదులుగా నిలుస్తాయి. తన భాగస్వామిని గౌరవించే, ఆమెతో నిజాయితీగా ఉండే వ్యక్తిని మహిళలు కోరుకుంటారు. ఆమె స్వేచ్ఛను ప్రోత్సహిస్తూ, తనకు తానుగా ఎదగడానికి తోడ్పడే పురుషుడు వారికి ఆప్తుడవుతాడు. మాటల్లో, చేతల్లో స్థిరంగా ఉండే పురుషుల పట్ల మహిళలు సులభంగా ఆకర్షితులవుతారు. ఎందుకంటే నమ్మకం అనేది సంబంధానికి ఊపిరి వంటిది. అది లోపించినప్పుడు ఏ బంధం అయినా బలహీనపడుతుంది.
బాధ్యతాయుతమైన ప్రవర్తన
కుటుంబం, సంబంధాలు, కెరీర్.. ఇలా ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించే పురుషుడంటే స్త్రీలకు ఎంతో నమ్మకం ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా తనకు అండగా ఉంటాడనే ధైర్యం వారికి కావాలి. బాధ్యతలను స్వీకరించే పురుషుడు వారికి ఎల్లప్పుడూ ఆదర్శంగా కనిపిస్తాడు.
మాట్లాడటం, వినడం
ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది కమ్యూనికేషన్. ఏ సంబంధంలోనైనా అనుబంధాన్ని బలోపేతం చేసేది సరైన సంభాషణే. చెప్పేది శ్రద్ధగా విని అర్థం చేసుకుని స్పందించే నేర్పు ఉన్న పురుషుడు ఏ స్త్రీ మనసునైనా సులభంగా గెలుచుకోగలడు. ఇది వారి మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది.



Click it and Unblock the Notifications