Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
కాపురం సుఖంగా సాగిపోవాలంటే..భాగస్వామితో ఎప్పుడూ చెప్పకూడని 6 విషయాలు ఇవే
ఏ బంధమైనా చివరిదాకా నిలబడాలంటే మూదు విషయాలు చాలా ముఖ్యం..అవే ప్రేమ, నమ్మకం, గౌరవం. బంధాలకు ఇవి పునాదుల్లాంటివి. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే, ఆవేశంలోనో అనే కొన్ని మాటలు ఈ పునాదులను పెకిలించివేస్తాయి. మాట తూటా కన్నా శక్తివంతమైనదని,దాన్ని పొదుపుగా వాడాలని మన పెద్దలు తరుచుగా చెబుతుంటారు. మీ ఉద్దేశం మంచిదైనా కొన్ని మాటలు మీ భాగస్వామి హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తాయి. ఈ చిన్న చిన్న పొరపాట్లే నెమ్మదిగా బంధంలో చీలికలు తెచ్చి దూరాన్ని పెంచుతాయి. మీ బంధం కలకాలం సంతోషంగా, దృఢంగా ఉండాలంటే మీ భాగస్వామితో ఎప్పటికీ అనకూడని 6 మాటలు ఏవో ఇక్కడ చూడండి.
నువ్వెప్పుడూ ఇంతే..అన్నీ తప్పులే చేస్తావు
ఈ మాట మీ భాగస్వామి ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. వారిని నిస్సహాయులుగా, పనికిరానివారిగా భావించేలా చేస్తుంది. మనుషులన్నాక తప్పులు సర్వసాధారణం. అలా కాకుండా జరిగిన తప్పును సున్నితంగా వివరిస్తూ మనం కలిసి దీన్ని ఎలా సరిదిద్దుకుందాం? అని మాట్లాడితే సమస్య పరిష్కారమవడమే కాకుండా మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.

నా మాజీ నీకన్నా చాలా బెటర్
మీ భాగస్వామిని వేరొకరితో ముఖ్యంగా మీ మాజీతో పోల్చడం మీ బంధానికి మీరే నిప్పు పెట్టుకున్నట్టు. ఇది వారిని అవమానించడమే కాకుండా నేను వారికి సరైన జోడిని కాదేమో అనే అనుమానాన్ని, అభద్రతాభావాన్ని కలిగిస్తుంది. పోలికలను పూర్తిగా పక్కనపెట్టి మీ ప్రస్తుత భాగస్వామిలోని గొప్పతనాన్ని గుర్తించండి.
నీకు అర్థం కాదులే వదిలేసెయ్
ఇలా అనడం ద్వారా మీరు వారి అభిప్రాయానికి విలువ ఇవ్వడం లేదని వారిని తక్కువ అంచనా వేస్తున్నారని స్పష్టమవుతుంది. ఇది వారిని మానసికంగా కుంగదీస్తుంది. దీనికి బదులుగా ఓపికగా వారి వాదన వినండి. నువ్వు చెప్పేది నాకు పూర్తిగా అర్థం కాలేదు, దయచేసి ఇంకోసారి వివరిస్తావా?అని అడగడం గౌరవప్రదంగా ఉంటుంది.
మీ కుటుంబ సభ్యులు చాలా విచిత్రంగా ఉంటారు
భాగస్వామి కుటుంబాన్ని విమర్శించడం లేదా ఎగతాళి చేయడం వారిని నేరుగా బాధపెట్టినట్లే. కుటుంబం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సున్నితమైన భాగం. వారి కుటుంబం గురించి మాట్లాడే నెగిటివ్ వ్యాఖ్యలు మీ రిలేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏదైనా సమస్య ఉంటే నిర్దిష్ట వ్యక్తి గురించి లేదా సంఘటన గురించి సున్నితంగా, గౌరవంగా మాట్లాడండి.
నీతో ఏ పనీ సరిగ్గా కాదు
ఈ మాట మీ భాగస్వామిని నీరు కారిపోయేలా చేస్తుంది..అంటే వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని శూన్యంగా మార్చేస్తుంది. వారిలో వైఫల్య భావనను నింపుతుంది. ఎవరూ ఎప్పుడూ పరిపూర్ణులు కారు. వారు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ అవసరమైతే ప్రేమతో సూచనలు ఇవ్వండి. వారిని విమర్శించే బదులు ప్రోత్సహించండి.
నీతో కలిసి బ్రతకడం నావల్ల కాదు
ేికోపంలో అనే ఈ మాట మీ బంధం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. ఇది సంబంధంలో తీవ్రమైన అస్థిరతను, భయాన్ని సృష్టిస్తుంది. మీరు బంధాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదనే సంకేతాన్ని పంపుతుంది. ఎంత కష్టమైనా మీ భావాలను ప్రశాంతంగా పంచుకోండి కానీ విడిపోతామనే బెదిరింపులకు దిగకండి.



Click it and Unblock the Notifications
