Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఒకే ఇంట్లో ఉంటూ భాగస్వామికి దూరమవుతున్నారా? ఈ 777 ఫార్ములా ట్రై చేయండి!
ఉరుకులు పరుగుల జీవితం, స్మార్ట్ ఫోన్ల మాయాజాలం, ఆఫీస్ టార్గెట్లు..ఈ రోజుల్లో ప్రేమను, రిలేషన్స్ ను కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్ గా మారింది. ఒక్కోసారి ఒకే ఇంట్లో ఉంటున్నా, ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం పెరిగిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ భాగస్వామితో బంధాన్ని జీవితకాలం పాటు ఫ్రెష్ గా, మధురంగా ఉంచుకోవడానికి ఇంటర్నెట్ లో ఒక ట్రెండ్ వైరల్ అవుతోంది. అదే 777 రిలేషన్ షిప్ రూల్.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జంటలు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరు ఇది తమ జీవితాలనే మార్చేసిందంటుంటే, మరికొందరు ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా అని చర్చిస్తున్నారు. అసలు ఏంటీ 777 రూల్? ఇది మీ ప్రేమకథను ఎలా మలుపు తిప్పుతుందో ఇక్కడ చూడండి.

ఏమిటీ 777 రూల్?
ఉద్దేశపూర్వకంగా మీ భాగస్వామికి సమయం కేటాయించడానికి ఇదొక అద్భుతమైన ఫ్రేమ్ వర్క్.
ప్రతి 7 రోజులకు: ఇద్దరూ కలిసి ఒక డేట్ నైట్ ప్లాన్ చేసుకోవాలి.
ప్రతి 7 వారాలకు: ఒక వీకెండ్ విహారయాత్రకి వెళ్లాలి.
ప్రతి 7 నెలలకు: ఇద్దరూ కలిసి ఒక సుదీర్ఘమైన పెద్ద వెకేషన్ ప్లాన్ చేయాలి.
దీనిలో ఉన్న మ్యాజిక్ ఏంటి?
దీనికోసం లక్షలు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ బడ్జెట్, మీ సమయానికి తగ్గట్టుగా దీనిని మార్చుకోవచ్చు. 7 రోజుల డేట్ నైట్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ కే వెళ్లక్కర్లేదు, ఇంట్లో ఇద్దరూ కలిసి ఇష్టమైన వంట వండుకోవడం లేదా ప్రశాంతంగా కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం కావచ్చు. 7 వారాల ట్రిప్ అంటే ఒక లాంగ్ డ్రైవ్ లేదా దగ్గర్లోని ప్రకృతిలోకి వెళ్లడం. 7 నెలల ట్రిప్ అంటే కొత్త ప్రదేశాలను అన్వేషించడం. ఉద్దేశం ఒక్కటే.. ఫోన్లు, పిల్లల బాధ్యతలు, ఆఫీస్ మెయిల్స్ అన్నీ పక్కనపెట్టి కేవలం మీ భాగస్వామి మనసులో ఏముందో వినడం.
దీని లాభాలు
సాన్నిహిత్యం పెరుగుతుంది: రోజువారీ గందరగోళం నుంచి బయటపడి, శారీరక, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక రీసెట్ బటన్ లా పనిచేస్తుంది.
కొత్తదనం: ఒకే రొటీన్ లైఫ్ కి అలవాటు పడి బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు బంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది.
విడిపోకుండా అడ్డుకుంటుంది: మనమిద్దరం ప్రపంచానికి ఎదురునిలబడగలం అనే నమ్మకం ఇద్దరిలోనూ పెరుగుతుంది.
కొన్ని ప్రతికూలతలు కూడా..
అయితే ఇది మ్యాజిక్ ట్రిక్ ఏమీ కాదు. అందరికీ డబ్బు, సమయం ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి ఈ రూల్ ను కచ్చితంగా పాటించలేకపోయినప్పుడు భాగస్వాముల్లో అపరాధ భావన లేదా నిరాశ కలగవచ్చు. పైగా బంధంలో ఏవైనా తీవ్రమైన మూల సమస్యలు ఉంటే కేవలం డేట్ ల వల్ల అవి పరిష్కారం కావు.. దానికి ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ అవసరం పడొచ్చు.



Click it and Unblock the Notifications